Share News

షరాబ్‌ కౌంటర్‌లో రూ.70 లక్షలు మాయం ఘటనలో..మరో ముగ్గురి సస్పెన్షన్‌

ABN , Publish Date - Sep 21 , 2026 | 12:37 AM

నగర పాలక సంస్థ షరాబ్‌ కౌంటర్‌లో రూ.70 లక్షలు మాయం ఘటనలో మరో ముగ్గురిని నగర పాలక సంస్థ కమిషనర్‌ భానుప్రతాప్‌ సస్పెండ్‌ చేశారు.

షరాబ్‌ కౌంటర్‌లో రూ.70 లక్షలు మాయం ఘటనలో..మరో ముగ్గురి సస్పెన్షన్‌

ఏలూరు టూటౌన్‌, సెప్టెంబరు 20 (ఆంధ్ర జ్యోతి): నగర పాలక సంస్థ షరాబ్‌ కౌంటర్‌లో రూ.70 లక్షలు మాయం ఘటనలో మరో ముగ్గురిని నగర పాలక సంస్థ కమిషనర్‌ భానుప్రతాప్‌ సస్పెండ్‌ చేశారు. ఆరోపణలు వచ్చిన వెంటనే గతంలోనే జూనియర్‌ అసి స్టెంట్‌ శ్రీనివాస్‌, అటెండర్‌ మోహనకృష్ణలను సస్పెండ్‌ చేయగా తాజాగా మేనేజర్‌ సీహెచ్‌ వీవీఎన్‌.మూర్తి, అకౌంటెంట్‌ కేఎస్‌ఆర్‌. లింగే శ్వరి, సీనియర్‌ అసిస్టెంట్‌ ఓ.రవిలను సస్పెండ్‌ చేశారు. ఇప్పటికే అడిషనల్‌ కమిషనర్‌ శ్రీని వాసరావు, ఎగ్జామినర్‌ రాజులను విచారణాధి కారులుగా నియమించారు. వీరికి అదనంగా తణుకు మున్సిపాల్టిలో పని చేస్తున్న జూని యర్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ చిట్టి బాబు, నూజివీడు మున్సిపాల్టిలో జూనియర్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ రవిచంద్రలను నియమించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటి వరకు నగదు దుర్వినియోగం జరిగిందా.. లేదా.. తేల్చేందుకు ప్రత్యేక ఆడిట్‌ నిర్వహిస్తున్నామని కమిషనర్‌ తెలిపారు.

Updated Date - Sep 21 , 2026 | 12:37 AM