భీమడోలు కార్యదర్శి సస్పెన్షన్
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:39 PM
పంచాయతీ నిధు లు దుర్వినియోగం, ఒక ఇంటి అదనపు ప్రహరీ కూల్చి వేత విషయంలో నిబంధనలు పాటించకపోవడంతో భీమడోలు పంచాయతీ కార్యదర్శి కేవీఎల్ తనూజపై సస్పెన్షన్ వేటు పడింది.
భీమడోలు, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి):పంచాయతీ నిధు లు దుర్వినియోగం, ఒక ఇంటి అదనపు ప్రహరీ కూల్చి వేత విషయంలో నిబంధనలు పాటించకపోవడంతో భీమడోలు పంచాయతీ కార్యదర్శి కేవీఎల్ తనూజపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణతేజ ఉత్తర్వులు జారీ చేశారు. తన ఇంటి అదనపు ప్రహరీని కూల్చే విషయంలో గ్రామ కార్యదర్శి తనూజ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా కూల్చినట్టు భీమడోలు నివాసి చంద్రమౌళి ఉన్నతాధికారు లను ఆశ్రయించాడు. అలాగే గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగం చేశారంటూ ఇదే ఫిర్యాదిదారుడు చంద్రమౌళి ఆరోపించడంతో జిల్లా పంచాయతీ అధికారు లు విచారణ నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదించగా కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.