Share News

సర్వే శాఖ సగం ఖాళీ

ABN , Publish Date - May 03 , 2026 | 12:39 AM

జిల్లాలో 27 మండలాలకు కేవలం 14 ప్రధాన మండలాల్లో మాత్రమే సర్వేయర్లు ఉన్నారు.

సర్వే శాఖ సగం ఖాళీ

పేరుకుపోతున్న సమస్యలు

రీ సర్వేతో ఉన్న వారంతా బిజీబిజీ

ఏళ్ల తరబడి పేరుకు పోతున్నాయి.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో 27 మండలాలకు కేవలం 14 ప్రధాన మండలాల్లో మాత్రమే సర్వేయర్లు ఉన్నారు. మరో 13 మండలాల్లో అంటే దాదాపుగా సగం మండలా ల్లో కనీసం డిప్యూటీ సర్వేయర్లు పోస్టులైనా ఉండా లి. అవి కూడా ఏళ్ల తరబడి భర్తీ కాకపోవడంతో క్షేత్రస్థాయిలో మండలాల్లో భూ వివాదాల పరి ష్కారం కావడం లేదు. ఇటీవలే మండల సర్వే యర్లు ఉన్న 14కు గాను చింతలపూడి, లింగ పాలెంల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిల్లో డిప్యూ టేషన్లపై సిబ్బంది పనిచేస్తున్నారు.

ఎక్కడెక్కడ ఖాళీలంటే..

పెదపాడు, కలిదిండి, ముదినేపల్లి,జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, కుక్కు నూరు, వేలేరుపాడు, కామవరపుకోట, బుట్టాయగూడెం, ముసునూరు, చాట్రాయి, లింగపాలెం, నిడమర్రులో డిప్యూటీ సర్వేయర్ల పోస్టులు చాలా కాలంగా దాదాపు మూడు నుంచి ఐదేళ్లలోపు ఖాళీగానే ఉంటున్నాయి.

పీజీఆర్‌ఎస్‌లో వినతులు ఎక్కువ

జిల్లా వ్యాప్తంగా భూముల రీ సర్వే కింద చాలా మండలాల్లో ఐదో విడత కార్యక్రమం జరుగుతోంది. మరోవైపు కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు సర్వేలు చేయాలన్న డిమాండ్లతోనే ప్రజల నుంచి వినతులు ఎక్కువ వస్తున్నాయి. గ్రామాల్లో చెరు వులు, పంట బోదెలు, మురుగు కాల్వలు, గ్రామాల్లో సరిహద్దుల వివాదాలు పరిష్కారం కావడం లేదని ఫిర్యాదులు అందుతు న్నాయి. చాలాచోట్ల చెరువుల ఆక్రమణల వివాదాలు తేలడం లేదు. భూముల రీ సర్వే నాలుగు విడతలుగా చేపట్టారు. ఐదో విడతలో భూములు పెద్ద సంఖ్యలో ఉండడంతో ఇప్పుడున్న సర్వేయర్ల భారాన్నే మోస్తున్నారు.

లైసెన్సుడ్‌ సర్వేయర్లతో భర్తీ

ఏళ్ల తరబడి సర్వేయర్ల పోస్టుల భర్తీ కాక పోవడం రెవెన్యూ వివాదాలు మరింత పెరిగిపో వడానికి ఆస్కారం ఏర్పడుతోంది. లైసెన్సుడ్‌ సర్వే యర్లను తీసుకోవడానికి సర్వేశాఖ సన్నద్ధం అవు తోంది. ఈ నేపథ్యంలో ఖాళీలు భర్తీ జరుగు తుందా? అన్న ఆసక్తి నెలకొంది. దరఖాస్తుల ప్రక్రియ చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. ఈనెలాఖరు నాటికి సర్వేయర్ల భర్తీ జరిగే అవకాశం ఉందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 03 , 2026 | 12:39 AM