వడదెబ్బకు దంపతులు కన్నుమూత
ABN , Publish Date - May 28 , 2026 | 01:06 AM
దెందు లూరు మం డలం సోమవరప్పాడు శివారు వీరభద్రపురంలో తీవ్ర వడగాడ్పుల ప్రభావంతో వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు.
దెందులూరు, మే 27 (ఆంధ్రజ్యో తి):దెందు లూరు మం డలం సోమవరప్పాడు శివారు వీరభద్రపురంలో తీవ్ర వడగాడ్పుల ప్రభావంతో వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ముక్కెల్లి నాగరాజు(65), భార్య పుష్ప(61) గోడలు లేని ఓపెన్ డాబాలో ఉంటున్నారు. నాలుగు రోజులుగా వీస్తున్న వడగాడ్పులకు డీహైడ్రేషన్‌తో వాంతులు, తల తిరగడం వంటి లక్షణాలతో మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఆర్‌ఎంపీ వైద్య సేవలందించాడు. బుధవారం తెల్లవారుజామున దంపతులిద్దరూ మృతి చెంది ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఒకే రోజు కన్నుమూయడంతో కుమారుడు, కుమార్తెలు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామ రెవెన్యూ అధికారులు వడదెబ్బ మృతిగా నమోదు చేసుకున్నారు.