Share News

ఉక్కిరిబిక్కిరి

ABN , Publish Date - May 23 , 2026 | 12:35 AM

జిల్లాలో శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచే భానుడి ప్రతాపం మొదలైంది. తీవ్ర వడగాడ్పులు, ఉక్కపోతతో జనం అవస్థలు పడ్డారు. రాత్రి 8 గంటల వరకు వేడిగాలుల తీవ్రత కొనసాగింది.

ఉక్కిరిబిక్కిరి
శుక్రవారం ఉదయం 10.56 గంటలకు ఏలూరులో నిర్మానుష్యంగా బస్టాండ్‌– సత్రంపాడు రోడ్డు

వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరి.. కొనసాగిన భానుడి భగభగలు

నూజివీడు, పెదపాడుల్లో అత్యధికం.. వచ్చే ఆరు రోజులు హీట్‌ వేవ్స్‌

వడగాడ్పులను తట్టుకోలేక అల్లాడిన ప్రజలు

(ఏలూరు సిటీ–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచే భానుడి ప్రతాపం మొదలైంది. తీవ్ర వడగాడ్పులు, ఉక్కపోతతో జనం అవస్థలు పడ్డారు. రాత్రి 8 గంటల వరకు వేడిగాలుల తీవ్రత కొనసాగింది. ఉదయం 11 గంటలకే జిల్లాలోని ప్రధాన పట్టణాలు, మండల కేంద్రా ల్లో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. నూజివీడు, పెదపాడు మండలాల్లో అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉంగు టూరులో 43.4, దెందులూరు, చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, మండవల్లి, ముసు నూరు, ఆగిరిపల్లి, పెదవేగిల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే ఆరు రోజులు భానుడి ప్రతాపం అత్యంత తీవ్రంగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ఈనెల 23న జిల్లాలో ఒక మండలంలో అత్యంత తీవ్ర వేడిగాలులు, 13 మండలాల్లో తీవ్ర వేడిగాలులు వీస్తాయని, 24న 20 మండలాల్లో తీవ్రమైన వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. 26 వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి సూచించారు. ఎండల తీవ్రతను తాళలేక ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తుండడతో దుకా ణాల వద్ద రద్దీ నెలకొంది.

జనం ఇళ్లకే పరిమితం

జంగారెడ్డిగూడెం/కామవరపుకోట : జంగా రెడ్డిగూడెం,కామవరపుకోటలో ఎండలు నిప్పుల కొలిమిని తలపించాయి. తీవ్ర వడగాడ్పులు వీయడంతో ప్రజలు బెంబేలెత్తారు. పనులకు వెళ్లే కూలీలు ఎండల ధాటికి భయపడి నివా సాలకే పరిమితమవుతున్నారు.

Updated Date - May 23 , 2026 | 12:35 AM