Share News

భానుడి భగభగలు

ABN , Publish Date - May 10 , 2026 | 12:26 AM

జిల్లా శనివారం భానుడి భగభగలతో అల్లాడింది. ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగు తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

భానుడి భగభగలు
బస్టాండ్‌ సమీపంలో నిర్మానుష్యంగా రోడ్డు

నిర్మానుష్యంగా రహదారులు.. జిల్లాలో విభిన్న వాతావరణం

(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి)

జిల్లా శనివారం భానుడి భగభగలతో అల్లాడింది. ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగు తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో శనివారం 39 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఉష్నోగ్రతలు నమోద య్యాయి. ప్రజలు ఉక్కబోతను తట్టుకోలేక తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడి తీవ్రత మొదలవు తోంది. ఉదయం 10 గంటల సమయానికే రహదారుల పైన ప్రయాణించడం కష్టతరంగా తయారవుతోంది. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతా వరణ శాఖ చెబుతోంది. జిల్లాలోని పలు ప్రాం తాల్లో విభిన్న వాతావరణం నెలకొని ఉంది. ఉదయం ఎండ తీవ్రత తారస్థాయిలో ఉన్న ప్రాంతాల్లో ఎల్‌నినో ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఏలూరులో ఎండ తీవ్రత కారణంగా రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌తో పాటు ప్రధాన కూడళ్లు ఖాళీగా కనిపించాయి. గత నాలుగు రోజులుగా ఎండల తీవ్రత కారణంగా విద్యుత్‌ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోందని విద్యుత్‌ శాఖ వర్గాలు తెలిపాయి.

Updated Date - May 10 , 2026 | 12:26 AM