Share News

చినుకుల్లోనూ ఉక్కపోత

ABN , Publish Date - Aug 04 , 2026 | 12:54 AM

ఇది వేసవికాలమా.. వర్షాకాలమా అర్థం కావ డం లేదు. సోమవారం ఉదయం నుంచే భానుడి ప్రతాపం మొదలైంది.

చినుకుల్లోనూ ఉక్కపోత

ఎల్‌నినో ప్రభావం.. సుర్రుమన్న సూరీడు

ఇదేం కాలంరా బాబూ అంటూ జనం నిట్టూర్పు

(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి)

ఇది వేసవికాలమా.. వర్షాకాలమా అర్థం కావ డం లేదు. సోమవారం ఉదయం నుంచే భానుడి ప్రతాపం మొదలైంది. ఎండ తీవ్రతతో ప్రజలు ఇక్కట్ల గురయ్యారు. గతంలో 40 డిగ్రీ ల దాటి ఉష్ణోగ్రతలు వచ్చినా ఇంత ఎండ తీవ్రత కనిపించలేదు. ఉమ్మడి పశ్చిమ గోదా వరి జిల్లాలో సరాసరి పగటి పూట 33 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మాత్రమే నమోదైనా ఎండ తీవ్రత మాత్రం విపరీతంగా వుంది. ఉదయం నుంచి మొదలైన ఉక్కపోత రాత్రైనా వీడలేదు. ఇలాం టి పరిస్థితులు ఎన్నడూ చూడలేదని వృద్ధులు చెబుతున్నారు. గతంలో ఎల్‌నినో ప్రభావం వచ్చినా ఇంత తీవ్రంగా లేదు. అడపాదడపా వర్షాలు కురిసేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. సోమవారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా సరైన చినుకు జాడ లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఎల్‌నినో ప్రభావానికి ప్రధానంగా పర్యా వరణం రోజురోజుకు క్షీణించడమే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో 19వ శతా బ్దం ప్రారంభంలో వచ్చిన విధంగా ఇప్పుడు ఎల్‌నినో పరిస్థితులు ఉన్నాయని, కురిసిన చోట వర్షాలు కురుస్తాయని, అసలు కొన్ని చోట్ల వర్షాలు అసలు కురిసే అవకాశం లేదంటున్నా రు. భూగర్భ జలాలు అడుగంటడంతో మంచినీటి బోర్లు ఇంకిపోయాయి. గతంతో మూడు గంటల్లో లోడ్‌ అయ్యే రక్షిత మంచినీటి పథకం ఇప్పుడు ఐదారు గంటల వరకు లోడ్‌ కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో మంచినీటిని సక్రంమంగా సరఫరా చేయని పరిస్థితి కనిపి స్తోంది. జల్‌జీవన్‌ మిషన్‌ పథకంలో రెండున్నర అంగుళాల పైప్‌లు మాత్రమే వేయడంతో మంచినీటి కుళాయిలకు నీరు సక్రమంగా అందని పరిస్థితి ఏర్పడింది. గతంలో మెయిన్‌ పైప్‌లైన్‌ రక్షిత మంచినీటి పథకం నుంచి నాలుగు నుంచి ఆరు అంగుళాల వరకు నిడివి ఉండేది. ఇప్పుడు జల్‌జీవన్‌ మిషన్‌లో మెయిన్‌ పైప్‌లైన్‌ మూడు అంగుళాలు మాత్రమే వేయడంతో గ్రామాల్లో మంచినీటి పథకాల నుంచి ఇళ్లకు నీరు సక్రమంగా అందడం లేదు.

సార్వా సాగు కష్టమే

మెట్ట ప్రాంతంలో బోర్లలో నీరు అడుగంటి పంట చేలకు తడులు అందించడం కష్ట తరంగా మారింది. ఎండ తీవ్రత కార ణంగా సార్వా వరి నారు మళ్లు, వరి నాట్లతో పాటు ఇతర పంటల సాగులో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రత్యామ్నాయ పంటలను (ఆరుతడి పంటలను) సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారులు సూచిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ధాన్యం దిగుబడులు అంతంత మాత్రంగానే ఉండటమే కాకుండా బియ్యం ధరలు ఆకాశాన్నంటే అవకాశాలున్నాయి.

Updated Date - Aug 04 , 2026 | 12:54 AM