మళ్లీనా..!
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:09 AM
భూముల మార్కెట్ విలువను పెంచేం దుకు రిజిస్ర్టేషన్ శాఖ సిద్ధమైంది. ఏడాది క్రితం ధరలను పెంచారు. మళ్లీ పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందంటూ సబ్ రిజిస్ర్టార్‌లు మల్లగుల్లాలు పడుతున్నారు. భూముల మార్కెట్ విలువ పెంపుపై మార్గ దర్శకాల కోసం చూస్తున్నారు.
మార్కెట్ విలువ పెంపుపై సబ్ రిజిస్ట్రార్లు తర్జనభర్జన
ఏడాది క్రితమే ఒకసారి పెంచిన కూటమి ప్రభుత్వం
ఇప్పటికే ధరలు అధికంగా ఉన్నాయంటున్న అధికారులు
మళ్లీ పెంచితే రిజిస్ర్టేషన్‌లపై ప్రభావం
అధికారుల మల్లగుల్లాలు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
భూముల మార్కెట్ విలువను పెంచేం దుకు రిజిస్ర్టేషన్ శాఖ సిద్ధమైంది. ఏడాది క్రితం ధరలను పెంచారు. మళ్లీ పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందంటూ సబ్ రిజిస్ర్టార్‌లు మల్లగుల్లాలు పడుతున్నారు. భూముల మార్కెట్ విలువ పెంపుపై మార్గ దర్శకాల కోసం చూస్తున్నారు. భూముల మార్కెట్ విలువ పెంపును పట్టణాలకే పరిమితం చేయనున్నారు. అర్బన్ పరిధిలో పెంచాలంటూ రిజిస్ర్టేషన్ శాఖ ఉన్నతాధికా రులు మెమో జారీ చేశారు. జిల్లాలో భూములన్నీ ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ పరిధిలోకి వస్తున్నాయి. దీంతో కేవలం మున్సిపాలిటీలకు పరిమితం చేయాలా లేదంటే అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ మొత్తానికి అమలు చేయాలా అనే విషయం పై సబ్ రిజిస్ర్టార్‌లలో సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ అయితే దీనికి తెరపడనుంది. రిజిస్ర్టేషన్ శాఖలో మాత్రం గ్రామీణ, అర్బన్ ప్రాంతాలుగానే పరిగణిస్తూ ఇప్పటి వరకు మార్కెట్ విలువను పెంచు తున్నారు. దీంతో ఈసారి పెంపు అనివార్య మైతే పట్టణ పరిధిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. పట్టణాల్లో ఇప్పటికే అధిక ధరలు అమలులో ఉన్నాయి. రిజిస్ర్టేషన్‌లు కావడం లేదంటూ సబ్‌రిజిస్ర్టార్‌లు బెంబేలెత్తిపోతున్నారు.
రోజువారీ లక్ష్యాలు
ఇటీవల రిజిస్ర్టేషన్ శాఖలో రోజువారీ లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. రిజిస్ర్టేషన్ డీఐజీ స్థాయి అధికారి సబ్ రిజిస్ర్టార్‌లతో సంప్ర దించే పరిస్థితి నెలకొంది. ఫలితంగా రోజు వారీ ఆదాయంపై సబ్ రిజిస్ర్టార్‌లు దృష్టి పెడుతున్నారు. అయినా సరే లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పట్టణాల్లో రిజిస్ర్టేషన్‌లు తగ్గుము ఖం పట్టాయి. రియల్‌ఎస్టేట్ అంతంతమా త్రంగానే ఉంటోంది. కేవలం వ్యక్తిగత నిర్మా ణాలు మాత్రమే చేపడుతున్నారు. పట్టణా ల్లో అపార్ట్‌మెంట్లు నిర్మిస్తే అమ్మకాలు జరగడం లేదు. గతంలో భీమవరం పట్టణంలోనే అపార్ట్‌మెంట్‌లకు మంచి క్రేజ్ ఉండేది. ఇప్పుడది తగ్గింది. అన్ని పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో రిజిస్ర్టేషన్ అంతగా ఉండడం లేదు. చిన్నపాటి రిజిస్ర్టేషన్‌లు మాత్రమే జరుగుతున్నాయి. గతంలో లేఖరులకు చేతినిండా పని ఉండేది. ఇప్పుడు వారికి పనితగ్గింది. సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లోనూ తాకిడి తగ్గింది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ ధరలు పెంచితే ఆ ప్రభావం రియల్ ఎస్టేట్‌పై పడతుందుని గుబులు చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయకతప్పదంటూ సబ్‌రిజిస్ర్టార్‌లు ఒక నిర్ణయానికి వచ్చేశారు.
జిల్లాలో పట్టణ ధరలు గజాల్లో
సబ్ రిజిస్ర్టార్ (రూపాయల్లో.. )
కార్యాలయం కనిష్ఠం గ రిష్ఠం
భీమవరం 9,500 66,000
గునుపూడి 10,000 70,000
తాడేపల్లిగూడెం 11,000 70,000
సజ్జాపురం 24,000 35,000
తణుకు 12,500 45,500
నర్సాపురం 10,000 50,000
పాలకొల్లు 14,000 45,000
మార్కెట్ విలువ పెంపుపై సబ్ రిజిస్ట్రార్లు తర్జనభర్జన