సబ్ జైళ్ల ఆకస్మిక తనిఖీ
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:21 AM
భీమవరం ఉప కారాగారాన్ని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ ఎస్.శ్రీదేవి గురు వారం ఆకస్మికంగా సందర్శించి ఖైదీలతో మాట్లాడారు.
భీమవరం క్రైం/ నరసాపురం టౌన్/ తణుకు/ చింత లపూడి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): భీమవరం ఉప కారాగారాన్ని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ ఎస్.శ్రీదేవి గురు వారం ఆకస్మికంగా సందర్శించి ఖైదీలతో మాట్లాడారు. న్యాయవాదులను పెట్టుకోలేకపోతే ఉచిత న్యాయవాదులను ఏర్పాటు చేస్తామన్నారు.జైల్లో తాగునీరు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్, ఒకటవ అదనపు సివిల్ జడ్జి పి.హనీష ఉన్నారు. నరసాపురం సబ్ జైలును శ్రీదేవి ఆకస్మికంగా తనిఖీ చేసి ఆహార పదార్థాలు, సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. జైలులో ఉన్న వారు ఉచిత న్యాయ సేవా కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. తణుకు సబ్ జైల్‌ను ఆమె సందర్శించారు. చింతలపూడి సబ్ జైలును జూనియర్ సివిల్ జడ్జి సి.హెచ్.మధుబాబు తనిఖీ చేశారు. నిందితుల కేసు వివరాలు తెలుసుకుని వారికి అందిస్తున్న ఆహార పదార్థాలు, మంచినీరు, వైద్య సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జైలు సూపరింటెండెంట్ కృపానందం, ప్యానల్ లాయర్లు సి.హెచ్.నాగార్జున, ఎం.డి.అక్బర్ అలీ పాల్గొన్నారు.