ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి..
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:33 AM
రాష్ట్రంలో విద్యారంగ సమస్య లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు సోమవారం ఏలూరులో కదం తొక్కారు.
ఏలూరు రూరల్, జూలై 13 ఆంధ్రజ్యోతి):రాష్ట్రంలో విద్యారంగ సమస్య లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు సోమవారం ఏలూరులో కదం తొక్కారు. ఫైర్ స్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం ధర్నా చేపట్టారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్‌జీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్, జిల్లా అధ్యక్షుడు డి.శివకుమార్ మాట్లాడుతూ రూ.6,400 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయాలని కోరారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి కె.సిద్దు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండీ సాధిక్ బాబు, రాష్ట్ర సమితి సభ్యులు ఎ.జగదీష్, ఎస్.రంజిత్, ఎన్.యశ్వంత్, జిల్లా నాయకులు టి.చంటి, బి.మధు, ఎన్.హర్ష, వెంకటేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు.