రాష్ట్రస్థాయి సాఫ్ట్, బేస్ బాల్ పోటీలకు ‘కరాటం జడ్పీహెచ్‌ఎస్’ విద్యార్థులు
ABN , Publish Date - Nov 29 , 2026 | 12:26 AM
బుట్టాయ గూడెం కరాటం కృష్ణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్‌లో చదువు తున్న విద్యార్థులు రాష్రస్థాయి సాఫ్ట్, బేస్ బాల్ పోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ఎం కె.సుబ్బలక్ష్మి తెలిపారు.
బుట్టాయగూడెం/టి.నరసాపురం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): బుట్టాయ గూడెం కరాటం కృష్ణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్‌లో చదువు తున్న విద్యార్థులు రాష్రస్థాయి సాఫ్ట్, బేస్ బాల్ పోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ఎం కె.సుబ్బలక్ష్మి తెలిపారు. హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న పి.రమ్య, ఎం.కృష్ణ ప్రదీప్ అండర్–17 విభాగంలో కె.లక్షిత (8వ), ఆర్.గౌతమ్(7వ), పి.రఘురాంలు అండర్–14 విభాగంలో రాష్ట్రసాయి సాప్ట్, బేస్ బాల్ పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. శనివారం పాఠశాలలో జరిగిన కార్యక్ర మంలో ఎంపికైన విద్యార్థులను, శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యా యులు ఆర్.సీతారామ్, టి.శ్రీనివాసరావు, కె.రామచంద్రలను హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ చైర్మన్, సభ్యులు గ్రామపెద్దలు అభినందించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు కేతవరం విద్యార్థులు
రాష్ట్రస్థాయి సాఫ్ట్, బేస్ బాల్ పోటీలకు టి.నరసాపురం మండలం కేతవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్టు హెచ్‌ఎం పూరేటి శ్రీనివాసరావు తెలిపారు. అండర్–14, అండర్–17 విభాగాల్లో 9 మంది విద్యార్థులు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. విద్యార్దులతో పాటు శిక్షణ ఇచ్చిన పీడీ కాజా నవీన్‌ను పలువురు అభినందించారు. కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మన్ బుచ్చిబాబు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.