Share News

నీట్‌ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలి

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:30 AM

నీట్‌ కేంద్రం ఆధ్వర్యంలో కాకుండా రాష్ట్రాలు నిర్వహించుకునే అధికారం ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి.

నీట్‌ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలి
ఏపీ నిట్‌ వద్ద విద్యార్థి సంఘాల నినాదాలు

విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థలు బంద్‌

తాడేపల్లిగూడెం, జూలై 24(ఆంధ్రజ్యోతి): నీట్‌ కేంద్రం ఆధ్వర్యంలో కాకుండా రాష్ట్రాలు నిర్వహించుకునే అధికారం ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి. నీట్‌ పేపర్‌ లీక్‌కు నిరసనగా విద్యార్థి సంఘాల పిలుపు మేరకు శుక్రవారం విద్యా సంస్థల బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. తాడేపల్లిగూడెంలో సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌ యూ ఆధ్వర్యంలోఏపీ నిట్‌ ఎదుట ఆందోళన చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పీటీఎం కార్యక్రమాలు యథావిధిగా జరిగాయి. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.రామకృష్ణ, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం.రూపాశంకర్‌, ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షుడు నాగేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు. పెనుగొండలో ఎస్‌ఎఫ్‌ఐ నిరసన ప్రదర్శన నిర్వహించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీ నామాతో పాటు చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని నినాదాలు చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కె.ఈశ్వర్‌, ఎస్‌. వెంకటేశ్వర రావు, ఎస్‌కె పాదుషా, ఎస్‌.వెంకన్న పాల్గొన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జీకి తణుకు న్యాయవాదులు నిరసన తెలిపారు. ఐలు జిల్లా కార్యదర్శి కామన మునిస్వామి మాట్లాడుతూ నీట్‌ లీక్‌ కారకులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయవాదులు వెలగల సాయిబాబారెడ్డి, ఎం.ప్రతాప్‌ కుమార్‌, అంబే డ్కర్‌, పి.మురళీకుమార్‌, పొట్ల సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. పలు ప్రవేట్‌ విద్యా సంస్థలు మూసివేశారు. ప్రజా సంఘాలు, న్యాయవాదులు, వామపక్షాలు బంద్‌లో పాల్గొన్నారు. ఆకివీడు గాంధీ సెంటర్‌లో నిరసన కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కె.రోహిత్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రవితేజ, సీఐటీయూ మండల కన్వీనర్‌ రాంబాబు, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి వంశీ తదితరులు ఉన్నారు. నరసాపురం పట్టణంలో విద్యా సంస్థల బంద్‌ విజయవంతమైంది. పట్టణంలోని అన్ని ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో ఎం.త్రిమూర్తులు, స్వరూప్‌, లక్ష్మణ్‌, ఏడుకొండలు, ప్రవీణ్‌కుమార్‌, నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2026 | 12:30 AM