Share News

బాలికలకు ఏది భద్రత?

ABN , Publish Date - Nov 03 , 2026 | 12:53 AM

పాఠశాల లకు వెళ్తున్న బాలికలకు భద్రత కరువవుతోంది. అనం తపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్‌ రంపంతో దుండ గుడు దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

బాలికలకు ఏది భద్రత?

బాలికలకు ఏది భద్రత?

పాఠశాలల్లో కానరాని రక్షణ.. ప్రైవేటులోనూ అదే పరిస్థితి.. రాప్తాడు ఘటనతో ఆందోళన

ప్రతి స్కూల్‌కు సెక్యూరిటీ అవసరం.. విద్యార్థినులకు భద్రత తప్పనిసరంటున్న సంఘాలు

ఏలూరు క్రైం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): పాఠశాల లకు వెళ్తున్న బాలికలకు భద్రత కరువవుతోంది. అనం తపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్‌ రంపంతో దుండ గుడు దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పాఠశాల ల్లో తమ పిల్లలకు రక్షణ ఉందా? లేదా? అన్న ఆందో ళన తల్లిదండ్రుల్లో మొదలైంది. ఉన్నత చదువులు చది వించి ప్రయోజకులను చేయాలన్న ఆశతో పిల్లలను పాఠశాలలకు పంపిస్తుంటే.. అక్కడ భద్రత లేకపోతే ఎలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా హైస్కూల్‌ స్థాయిలో చదివే బాలికల భవిష్యత్తుకు పునాది పడు తుంది. అలాంటి సమయంలో కొందరు ఆకతాయిలు ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడుతుం డటంతో వారి చదువులకు ఆటంకం కలుగుతోంది.

నాడు భద్రత.. నేడు కరువు

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు ఎంతో భద్రత ఉండేది.పాఠశాల పూర్తిగా విడిచిపెట్టిన తర్వాతే ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్లేవారు. పిల్లలతో మాట్లాడాల న్నా హెడ్‌మాస్టర్‌ అనుమతి తీసుకుని, సిబ్బంది సమ క్షంలోనే మాట్లాడాల్సి వచ్చేది. ప్రతి హైస్కూల్‌కు వాచ్‌ మెన్‌, స్వీపర్‌, అటెండర్‌ ఉండేవారు. ప్రస్తుతం ఈ పో స్టులు ఉన్నాయో లేదో తెలియదు. కొన్ని ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు ఆలస్యంగా వస్తుండటంతో బెల్‌ కొట్టగానే పిల్లలకంటే ముందే వెళ్లిపోతున్నారన్న విమర్శలున్నాయి.ప్రస్తుతం చాలా పాఠశాలల్లో విద్యార్థు లను తీసుకెళ్లేందుకు వచ్చే వారి వివరాలు సరిగా పరి శీలించడం లేదన్న ఆరోపణలున్నాయి. బంధువులమ ని, కుటుంబ సభ్యులమని చెప్పి తరగతి గదుల వద్దకు వచ్చి పిల్లలను బయటకు తీసుకెళ్తున్నారు. వచ్చిన వా రు ఎవరు? విద్యార్థినికి తెలిసిన వారేనా? అనే వివ రాలు తెలుసుకోవడం లేదు. దీంతో ఆకతాయిలు, నేరస్థులకు పిల్లలను చేరుకోవడం సులభమవుతోంది.

జిల్లాలో ప్రభుత్వానికి సంబంధించిన 256 హైస్కూ ళ్లు ఉండగా, ఎలి మెంటరీ, అప్పర్‌ ప్రైమరీ, హైస్కూల్‌, హయ్యర్‌ సెకండరీ పాఠశాలలు కలిపి మొత్తం 1748 ఉన్నాయి. ప్రైవేటు హైస్కూళ్లు 217 ఉండగా, మొత్తం ప్రైవేటు పాఠశాలలు 482 ఉన్నాయి. ప్రైవేటు పాఠశా లల్లో విద్యా బుద్ధులతో పాటు భద్రతకూ ప్రాధాన్యమి వ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో భద్రతా ఏర్పాట్లు సరిగా లేవన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో ప్రతి హైస్కూల్‌కు వాచ్‌మెన్‌, స్వీపర్‌, అటెండర్‌ ఉండేవారు. ప్రస్తుతం అలాంటి సిబ్బంది లేకపోవడంతో పాఠ శాలల్లో పర్య వేక్షణ తగ్గుతోంది. విద్యార్థులను బయటకు తీసుకెళ్లే వారి వివరాలు నమోదు చేయడం, అనుమతి తీసుకో వడం వంటి నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదని తెలుస్తోంది.

వేధింపులతో చదువుకు దూరం

ఈవ్‌టీజింగ్‌, అపహరణ, సోషల్‌ మీడియా మోసా ల వల్ల బాలికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రే మ పేరుతో వేధింపులకు పాల్పడే ఆక తాయిలు, తా ము తరగతికి వస్తామని చెప్పి కొంతమంది బాలిక లను బయటకు పిలుస్తున్నట్లు గతంలో జిల్లాలో పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఘటనల్లో కొందరికి కౌన్సె లింగ్‌ చేసిన సందర్భాలూ ఉన్నాయి. తమ కుమా ర్తెలకు ఎదురవుతున్న వేధింపులపై కేసులు పెడితే స మాజంలో పరువుపోతుందని కొంతమంది తల్లిదండ్రు లు భావిస్తున్నారు. తమ సమస్యలు చెబితే చదువు మాన్పిస్తారేమోనన్న భయంతో విద్యార్థినులు బాధను బయటపెట్టడం లేదు. దీంతో ఆకతాయిలు, నేరస్థులు మరింత రెచ్చిపోతున్నారు.

భద్రతా చర్యలు తప్పనిసరి

‘రాప్తాడు ఘటన నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలల్లో భద్రతా చర్యలు పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉంది. పాఠశాల గేట్ల వద్ద సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలి. అనుమతి లేని వ్యక్తులను లోపలికి రానివ్వ కూడదు. విద్యార్థినులకు గుడ్‌టచ్‌, బ్యాడ్‌టచ్‌పై అవగా హన కల్పించాలి.ఉపాధ్యాయులు వారితో స్నేహపూర్వ కంగా ఉంటూ సమస్యలను తెలుసుకోవాలి. ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలతో నిత్యం మాట్లాడి పాఠశాలల్లో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకోవా లి. ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోవద్దని, ఇబ్బందులు ఎదురైతే వెంటనే తమకు చెప్పాలని సూచించాలి. ప్రతి పాఠశాలలో కంప్లయింట్‌ బాక్సులు, పోక్సో కమిటీలను ఏర్పాటుచేయాలని చట్టం చెబుతున్నా.. వాటి అమలు పై పర్యవేక్షణ కొరవడుతోంది. బాలికల భద్రత పాఠ శాలలకే పరిమితం కాకుండా ఉపాధ్యాయులు, తల్లిదం డ్రులు, ప్రభుత్వం, సమాజం సమష్టి బాధ్యతగా తీసు కోవాలి. అప్పుడే విద్యార్థినులు భయం లేకుండా చదు వుకుని అన్ని రంగాల్లో రాణించగలుగుతార’ని జిల్లాకు చెందిన పలువురు సూచిస్తున్నారు.

Updated Date - Nov 03 , 2026 | 12:53 AM