Share News

బాలిక మృతి

ABN , Publish Date - Aug 08 , 2026 | 12:43 AM

ఆశ్ర మ పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఒక బాలిక మృతిచెందింది. శివకాశీపురం గిరిజన ఆశ్రం పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కెచ్చెల లక్ష్మీపార్వతి(14) శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఉతికిన వస్త్రాలు ఆర బెడుతుండగా ఇనుప తీగకు విద్యుత్‌ ప్రవ హించి విద్యుదాఘాతంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.

బాలిక మృతి
కెచ్చెల లక్ష్మీపార్వతి

ఆశ్రమ పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యానికి బాలిక మృతి

ఐటీడీఏ పీవో హామీతో ఆందోళన విరమించిన బాలిక బంధువులు

వేలేరుపాడు, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ఆశ్ర మ పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఒక బాలిక మృతిచెందింది. శివకాశీపురం గిరిజన ఆశ్రం పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కెచ్చెల లక్ష్మీపార్వతి(14) శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఉతికిన వస్త్రాలు ఆర బెడుతుండగా ఇనుప తీగకు విద్యుత్‌ ప్రవ హించి విద్యుదాఘాతంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చగా అప్పటికే మృతి చెందినట్టు ప్రభుత్వ వై ద్యాధికారిణి డాక్టర్‌ ప్రవీణ ఆశా జ్యోతి నిర్థా రించారు. విగతజీవిగా మారిన తమ బిడ్డను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విల పించారు. పాఠశాల వద్ద బైఠాయించి అధికా రుల తీరుపై ఆగ్రహిస్తూ నినాదాలు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరస నకారులకు సర్దిచెప్పారు.ఐటీడీఏ పీవో మధ్యా హ్నం ఒంటి గంట ప్రాంతంలో ఘటన స్థలా నికి చేరుకుని ఆశ్రం పాఠశాలను పరిశీలించి నిర్వాహకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డా రు. కిటికీకి ఇనుప తీగ కట్టుకోగా విద్యుత్‌ ప్రసారమయ్యే తీగ తగిలి ఈ ఘటన జరిగి నట్టు నిర్థారించారు. బాలిక కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కు టుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వా లని ఆశ్రమం వార్డెన్‌, ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డి మాండ్‌ చేశారు. బాలిక తండ్రికి అవుట్‌సో ర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామని పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు, వార్డెన్‌లను సస్పెండ్‌ చేస్తు న్నట్లు ప్రకటించారు. బాలిక అంత్యక్రియలకు రూ.50 వేలు అందిస్తామన్నారు. మిగతా డి మాండ్లను ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకెళ్తా నని హామీ ఇచ్చారు. అనంతరం బాలిక మృత దేహాన్ని అంబులెన్స్‌లో పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Aug 08 , 2026 | 12:43 AM