Share News

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

ABN , Publish Date - Aug 19 , 2026 | 12:22 AM

అయితంపూడి లాకుల వద్ద ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో కాలువలో గల్లంతైన చెరుకూరి రాజారామ్‌ చరణ్‌ మృతదేహం లభ్యమైంది.

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
అయితంపూడి కాలువ వద్ద ఇనుప రెయిలింగ్‌తో రక్షణ చర్యలు

పెనుగొండ వద్ద కాలువలో గుర్తించిన పోలీసులు

ఇరగవరం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : అయితంపూడి లాకుల వద్ద ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో కాలువలో గల్లంతైన చెరుకూరి రాజారామ్‌ చరణ్‌ మృతదేహం లభ్యమైంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి కుటుంబ సభ్యులు, పోలీసులు, గత ఈతగాళ్ళు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పెనుగొండ వాసవీమాత ఆలయం సమీపంలోని కాలువలో మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న తణుకు రూరల్‌ సీఐ వెంకటేశ్వరరావు సంఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. రెండు రోజులుగా నిద్రహారాలు కరువైన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు జిల్లా ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కాలువ వద్ద పటిష్ట భద్రత

అయితంపూడి – ఓగిడి సమీపంలోని కాలువ వద్ద అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. కాలువ వద్ద ఇనుప దిమ్మలు ఏర్పాటు చేయడంతో పాటు వాహనదారులు అప్రమత్తంగా ఉండేలా రక్షణ చర్యలు చేపట్టారు. ప్రమాదకర ప్రాంతాల్లో శాశ్వత రక్షణ ఏర్పాట్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలకు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్ధానికులు కోరుతున్నారు.

Updated Date - Aug 19 , 2026 | 12:22 AM