Share News

గ్యాస్‌.. గండం!

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:51 AM

ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మధ్య కొన సాగుతున్న యుద్ధం ఎఫెక్ట్‌ గ్యాస్‌ సరఫరాపై పడింది. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలోనే గ్యాస్‌ కొరత లేదని ప్రభు త్వాలు ప్రకటిస్తున్నా సామాన్య, మధ్య తర గతి కుటుంబాల్లో గ్యాస్‌ కొరత ఉందనే ఆందోళన కలుగు తోంది.

 గ్యాస్‌.. గండం!

సిలిండర్‌ బుక్‌ చేసుకోవడానికి 25 రోజుల గడువు

గ్యాస్‌ సరఫరాపై ఇరాన్‌–ఇజ్రాయెల్‌ యుద్ధం ఎఫెక్ట్‌

వాణిజ్య గ్యాస్‌కు డిమాండ్‌

పెరిగిన ధరలు .. సరఫరాలో కోత

ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మధ్య కొన సాగుతున్న యుద్ధం ఎఫెక్ట్‌ గ్యాస్‌ సరఫరాపై పడింది. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలోనే గ్యాస్‌ కొరత లేదని ప్రభు త్వాలు ప్రకటిస్తున్నా సామాన్య, మధ్య తర గతి కుటుంబాల్లో గ్యాస్‌ కొరత ఉందనే ఆందోళన కలుగు తోంది. దీనికి తగ్గట్టు గానే గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకోవడానికి సిలిండర్‌కు సిలిండర్‌కు మధ్య గడువును 25 రోజులకు పెంచారు.

ఏలూరుసిటీ, మార్చి 11(ఆంధ్రజ్యోతి): అమెరికా– ఇరాన్‌ యుద్ధ ప్రభావం తక్షణమే గ్యాస్‌ సరఫరాపై పడింది. దానికి నిదర్శనమే వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ లలో కోత. గృహ వినియోగ గ్యాస్‌ విషయం లోనూ ఇప్పుడిప్పుడే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బుక్‌ చేసుకున్న మరుసటిరోజే గ్యాస్‌ ఇంటికి వచ్చేసేది. ప్రస్తుతం మూడు రోజులైనా సరఫరా కావడం లేదు. యుద్ధ ప్రభావం వల్ల సరఫరాలో కోత విధిస్తున్నారు. ఇప్పటికే 25 రోజులకు ఒకసారి గృహ వినియోగ గ్యాస్‌ బుకింగ్‌ చేయాలంటూ ఏజన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. వాణిజ్య సిలిండర్‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కృత్రిమ కొరత లేకుండా ఆదేశాలు జారీచేసింది.

ఇప్పటి వరకు గ్యాస్‌ బుక్‌ చేసినా, చేయక పోయినా గ్యాస్‌ ఆపరేటర్లు గ్యాస్‌ సిలిండర్లను అడి గిన వెంటనే అందించేవారు. అయితే యుద్ధం తర్వాత గ్యాస్‌ సరఫరాలో నిబంధనలను కఠినతరం చేశారు. సాధారణంగా గ్యాస్‌ సరఫరాలో ఆపరేటర్‌ యాప్‌లో బుక్‌ చేస్తే గ్యాస్‌ డెలివరీ చేసేవారు. ఇప్పుడు ఆ విధంగానే చేస్తున్నా ఎవరికి సంబంధించి వారికి గ్యాస్‌ సరఫరా చేయడానికి వారి ఫోన్‌కు వచ్చిన ఓటీపీ చెబితేనే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తు న్నారు. ఒకసారి గ్యాస్‌ సిలిండర్‌ తీసుకున్న తర్వాత మరో సిలిండర్‌ తీసు కోవాలంటే 25 రోజులు దాటితేనే గ్యాస్‌ బుక్‌ అవుతోంది. ఇప్పుడు డొమెస్టిక్‌ సిలిండర్‌ (వంటగ్యాస్‌) ధర పెంచడంతో ఏలూరు జిల్లాలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.946లకు చేరింది. నిబంధనలు తప్పని సరిగా పాటిస్తుండటంతో ఎప్పటికప్పుడు గ్యాస్‌ సిలిండర్‌ లభించని పరిస్థితి కనిపిస్తోంది. తప్పనిసరిగా గ్యాస్‌ బుకింగ్‌ చేసుకుంటేనే గ్యాస్‌ సరఫరా చేయడం జరుగుతుంది.

వాణిజ్య సిలిండర్లకు షాక్‌

యుద్ధం కారణంగా వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.114 పెంచినా సరఫరాను నిలిపివేయడంతో హోటళ్లు, ఇతర వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. హాస్పటళ్లు ఇతరత్రా ప్రభుత్వ అవసరా లకు వాణిజ్య సిలిండర్ల సరఫరాను కొనసాగిస్తు న్నారు. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల వాడకం జిల్లాలో రోజువారీ 400 వరకు ఉంటుంది. వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో హోటళ్లు, స్వీట్‌ దుకా ణాల్లో తినుబండారాలు, స్వీట్స్‌ ధరలు పెరిగే అవకాశాలున్నాయి.

జిల్లాలో 6,19 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు

ఏలూరు జిల్లాలో 6లక్షల 19వేల 907 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. జిల్లాలో 55 గ్యాస్‌ ఏజన్సీలు ఉన్నాయి. జిల్లాలో సాధారణ గ్యాస్‌ కనెక్షన్లు 4,19,479 కాగా దీపం గ్యాస్‌ కనెక్షన్లు 1,51,508 కాగా ి సీఎస్‌ గ్యాస్‌ కనెక్షన్లు 15,289, ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు 22,597, ఉజ్వల 3.0 గ్యాస్‌ కనెక్షన్లు 11,034 వరకు ఉన్నాయి. జిల్లాలో ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని వినియోగించుకునే గ్యాస్‌ వినియోగదారులు 4,02, 000 మంది వరకు ఉన్నారు. జిల్లాలో వంటగ్యాస్‌ సిలిండర్ల వినియోగం రోజువారీ 10 వేలకు పైగానే ఉంటుందని గ్యాస్‌ ఏజన్సీల సమాచారం.

తెరపైకి కట్టెల పొయ్యిలు

జిల్లాలో నిత్యం రద్దీగా ఉండే హోటళ్లకు గ్యాస్‌ సమస్య ఎదురవుతోంది. దాంతో కోయంబత్తూర్‌ లో లభ్యమయ్యే కట్టెల పొయ్యిలను బుక్‌ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమేర కట్టెలతో వంటకాలు చేస్తే గ్యాస్‌ కష్టాలు తీరి పోతాయని భావిస్తున్నారు.

గ్యాస్‌ కొరత లేదు : జేసీ

కలెక్టరేట్‌లో తన ఛాంబర్‌ నుంచి బుధవారం గ్యాస్‌ సరఫరాపై జేసీ అభిషేక్‌ గౌడ సమీక్షించారు. ‘జిల్లాలో వంట గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదు. ప్రజ లు ఆందోళన చెందవద్దు. జిల్లా వ్యాప్తంగా గృహ అవసరాలకు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు వినియోగించే వంట గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదు. గ్యాస్‌ బుకింగ్‌ లేదా డెలివరీకి సంబంధించి విని యోగదారులకు లేదా వసతి గృహాలు నిర్వాహకులకు ఇబ్బందులు ఎదురైతే సంబంధిత తహసీల్దార్‌ లేదా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలి’ అని సూచించారు.

Updated Date - Mar 12 , 2026 | 12:51 AM