తణుకులీనేనా..?
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:55 AM
పట్టణ సమగ్రాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి స్థానిక ప్రజాప్రతినిధులే దిక్సూచి. అయితే తణుకు మున్సిపాలిటీలో మాత్రం కొన్నేళ్లుగా ఎన్నికైన పాలకవర్గం లేకపోవడంతో ప్రత్యేకాధి కారి పాలనే కొనసాగుతోంది.
తణుకు పురపాలక సంఘంలో ఆరేళ్లుగా ప్రత్యేకాధికారి పాలనే శరణ్యం
న్యాయ వివాదాలు, విలీన గ్రామాల పంచాయితీతో నిలిచిన ప్రక్రియ
34 వార్డులతోనే బరిలోకి దిగేందుకు ఆశావహుల నిరీక్షణ
తణుకు, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి):పట్టణ సమగ్రాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి స్థానిక ప్రజాప్రతినిధులే దిక్సూచి. అయితే తణుకు మున్సిపాలిటీలో మాత్రం కొన్నేళ్లుగా ఎన్నికైన పాలకవర్గం లేకపోవడంతో ప్రత్యేకాధి కారి పాలనే కొనసాగుతోంది. 2021లో జరగాల్సి న పురపాలక ఎన్నికలు పలు న్యాయ వివాదాల కారణంగా నిలిచిపోయాయి. పట్టణంలో అభివృ ద్ధి పనులు, మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం వంటి అంశాలను అధికారులు పర్యవేక్షిస్తున్నా రు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చొరవతో పట్ట ణంలో అభివృద్ధి పనులు ముందుకు సాగుతు న్నాయి. అయినప్పటికి ప్రజల నుంచి నేరుగా ఎన్నికైన కౌన్సిలర్లు, చైర్‌పర్సన్ లేకపోవడం తీవ్ర లోటుగా మారింది.
విలీన గ్రామాలే ప్రధాన అవరోధం
వెంకట్రాయపురం, వీరభద్రపురం, పైడిపర్రు గ్రామాలను తణుకు పురపాలక సంఘంలో విలీనం చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉత్తర్వులు జారీ అయ్యా యి. దీనిని వ్యతిరేకిస్తూ ఆయా గ్రామాల ప్రజ లు కోర్టును ఆశ్రయించారు. అనంతరం ఎన్నికలు పూర్తయి కౌన్సిల్ పనిచేసినప్పటికీ, విలీన ప్రక్రి య నిబంధనల ప్రకారం సక్రమంగా జరగలేదని తదుపరి కాలంలో న్యాయస్థానం తీర్పునిచ్చింది. విలీనానికి వ్యతిరేకంగా దాఖలైన ఏడు కేసులలో ఐదు కేసులు ఇప్పటికే కొట్టివేయబడ్డాయి. వెంక ట్రాయపురం టౌన్‌షిప్‌నకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ, నూతన పాలకవర్గం ఎన్నిక కాలే దు. ఇప్పటికీ అది మున్సిపాలిటీ ఆధ్వర్యంలోనే కొనసాగుతుం డటంతో, ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే ఎన్నికలకు మార్గం సుగమమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం తణుకు మున్సిపాలిటీలో 34 వార్డులు కొనసాగుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు ముందు వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా సవరణ వంటి ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంది. కోర్టు కేసులు పరిష్కారమై ప్రభుత్వానికి అను కూలంగా తీర్పు వస్తే, దాదాపు ఇరవై రోజుల్లో అవసరమైన ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది.
ఆశావహుల ఎదురుచూపు
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందా అని ప్రధాన పార్టీల నాయకులు, ఆశావహులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వార్డుల రిజర్వేషన్లు, అభ్యర్థుల ఎంపిక, కొత్త ఓటర్ల చేరిక వంటి అంశాలపై పట్టణంలో ఇప్పటికే చర్చలు ఊపందుకున్నాయి. కోర్టు పరిధిలోని సమస్యలు కొలిక్కి వచ్చి ప్రక్రియ ప్రారంభమైతే పట్టణంలో రాజకీయ వేడి మరింత పెరగనుంది.