Share News

నైపుణ్య సిద్ధి..

ABN , Publish Date - Jun 11 , 2026 | 12:43 AM

జిల్లాలోని స్థానిక అవసరాలు, ఉపాధి వనరులకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. గత రెండేళ్ల నుంచి 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు నిరు ద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిం చేందుకు వివిధ శిక్షణలను నిర్వహిస్తోంది. రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు వేర్వేరు కంపెనీల్లో వేతనాలను కల్పించే ఉద్యోగ ప్రాప్తి చేపడుతున్నారు.

నైపుణ్య సిద్ధి..

18 నుంచి 45 ఏళ్లలోపు నిరుద్యోగులకు స్కిల్‌ హబ్స్‌లో శిక్షణ

గతేడాది స్కిల్‌ హబ్స్‌ ద్వారా 711 మందికి ఉద్యోగాలు

జాబ్‌ మేళాల నిర్వహణ.. గత రెండేళ్లలో 5,300 మందికి ఉపాధి

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని స్థానిక అవసరాలు, ఉపాధి వనరులకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. గత రెండేళ్ల నుంచి 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు నిరు ద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిం చేందుకు వివిధ శిక్షణలను నిర్వహిస్తోంది. రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు వేర్వేరు కంపెనీల్లో వేతనాలను కల్పించే ఉద్యోగ ప్రాప్తి చేపడుతున్నారు.

నిరుద్యోగ యువతకు పరిశ్రమల్లో ఎక్కువ ఉద్యోగాలు కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా యువతకు మొత్తం ఎనిమిది రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వను న్నారు. ఎంచుకున్న రంగానికి తగ్గట్టుగా రెండు నుంచి మూడు నెలలు శిక్షణ ఉంటుంది. ఆయా రంగాల్లోని నిపుణులతో రోజుకు 4 గంటల పాటు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇటీవల దెందులూ రు, ఏలూరు, ఉంగుటూరుల్లో నిర్వహించిన జాబ్‌ మేళాలకు స్పందన వచ్చింది. నిరుద్యోగులు కనీ సంగా 250 మంది చొప్పున వివిధ ఉద్యోగాల తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

జిల్లాలో 13 ఎంప్లాయిబిలిటీ స్కిల్‌ సెంటర్ల (ఈఎస్‌సీ) ద్వారా ఎనిమిది సాఫ్ట్‌వేర్‌ రంగంలో శిక్షణ ఇస్తారు. పైథాన్‌, అకౌంటింగ్‌, ట్యాలీ, డిజిట ల్‌ మార్కెటింగ్‌, హార్డ్‌వేర్‌ మెయింటెనెన్స్‌, ఈడీపీ, కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌ వంటివి నేర్పిస్తారు. స్థానిక డిమాండ్‌లు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొ రేషన్‌ ద్వారా శిక్షణ ఇస్తారు. కిసాన్‌ లోన్‌ఆపరేటర్‌, ఆర్గానిక్‌ గ్రోవర్‌, రిపేర్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌, ఎయిర్‌ టికెటింగ్‌ అండ్‌ రిజర్వేషన్‌, ఎయిర్‌పోర్టు గ్రౌండ్‌ ఆపరేటర్‌, కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌, ఎలక్ర్టీషియన్‌, ప్లబింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ సిస్టమ్‌, వెబ్‌ డెవలపర్స్‌, కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌, ప్రొడక్షన్‌ కెమిస్ట్‌, క్వాలిటీ అస్యూరెన్స్‌ అసిస్టెంట్‌, గెస్ట్‌ సర్వీస్‌ ఆపరేటర్‌, రెస్టారెంట్‌ కెప్టెన్‌, ఫ్రంట్‌ ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్‌, ఎల్‌ఎంవీ డ్రైవర్స్‌, 4 వీలర్‌ సర్వీస్‌ టెక్నిషీయన్స్‌లో అవకాశాలను కల్పిస్తారు. శిక్షణ అవసరమనుకునే వారు నైపుణ్యం.జీవో.ఇన్‌ పోర్టల్‌లో సరి చూసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. గతేడాది స్కిల్‌ హబ్స్‌ ద్వారా 711 మందికి, జాబ్‌ మేళాల ద్వారా ఈ ఏడాదిలో 2,454 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు.

వేలాది మంది ఉద్యోగ అవకాశాలు

ఎన్‌. జితేంద్రబాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి

కూటమి ప్రభుత్వం వచ్చాక గత రెండేళ్లలో నిర్వహించిన జాబ్‌మేళాల్లో బెంగళూరు, చెన్నై, ఏపీ, తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో 5,300 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. అన్ని నియోజక వర్గాలను కవర్‌ చేస్తూ ఏటా 18 నుంచి 35 జాబ్‌మేళాలను నిర్వహణ చేపడుతున్నాం. జాబ్‌ మేళాల్లో వస్తు తయారీ పరిశ్రమలు, ఆటోమొబైల్‌ రంగం, టెక్స్‌టైల్‌ రంగం, ఫైనాన్షియల్స్‌ (బ్యాంకింగ్‌ సెక్టార్‌)ల్లోనే ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి.

Updated Date - Jun 11 , 2026 | 12:43 AM