పుంత చింత తీరేనా..?
ABN , Publish Date - Mar 22 , 2026 | 01:01 AM
అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి ఏఎంసీ పరిధిలో రూ.1.50 కోట్లు మంజూ రుచేశారు. వీటితో పలు రోడ్లను అభివృద్ధి చేశారు. తర్వాత వచ్చిన వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏఎంసీ నిధులను సైతం ప్రభుత్వం సొంతానికి వాడుకుంది.
రహదారుల అధ్వానంతో రైతుల పాట్లు
నిబంధనల ప్రకారం.. ఆదాయంలో ఖర్చు చేయని 20 శాతం నిధులు
గత ప్రభుత్వం హయాంలో మంజూరు కాని నిధులు
ప్రభుత్వానికి ఎమ్మెల్యేల ద్వారా కమిటీల ప్రతిపాదనలు
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
గత ప్రభుత్వం హయాంలో మంజూరు కాని నిధులు
ప్రభుత్వానికి ఎమ్మెల్యేల ద్వారా కమిటీల ప్రతిపాదనలు
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి ఏఎంసీ పరిధిలో రూ.1.50 కోట్లు మంజూ రుచేశారు. వీటితో పలు రోడ్లను అభివృద్ధి చేశారు. తర్వాత వచ్చిన వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏఎంసీ నిధులను సైతం ప్రభుత్వం సొంతానికి వాడుకుంది. రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదు. తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పా టైన తర్వాత రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే జిల్లాలోని పది మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను ఏర్పాటుచేశారు. అయితే చైర్మన్ లకు చెక్ పవర్ ఇవ్వలేదు. ఫలితంగా నిధులు ఖర్చు పెట్టుకునే అవకాశం లేదు. దీనిపై పాలక వర్గాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక శాసనసభ్యుల చొరవతో రైతు లకు ఉపయోగపడే విధంగా పుంత రహదారుల మరమ్మతులకు నిధులు కేటాయించాలంటూ ఏఎంసీ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
నిధులు పుష్కలం
జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో నిధు లు పుష్కలంగా ఉన్నాయి. అత్యధికంగా భీమవ రం ఏఎంసీ నుంచి ఏడాదికి రూ.15 కోట్ల ఆదా యం లభిస్తోంది. ఈ ఏడాది కాస్త తగ్గినా కొన్నే ళ్లుగా సమకూరిన ఆదాయం బ్యాంకు ఖాతాల్లో ఉంది. తాడేపల్లిగూడెం, భీమవరం, ఉండి, ఆకి వీడు ఏఎంసీలకు గణనీయంగానే ఆదాయం వచ్చి చేరుతోంది. తణుకు, పెనుగొండ, ఆచంట మార్కెట్ కమిటీలకు ధాన్యం ఉత్పత్తులు ద్వారా ఆదాయం సమకూరుతోంది. ఈ పది ఏఎంసీల నుంచి ఏటా సెస్ రూపంలో రూ.68 కోట్లు ఆదాయం రావాలి. ఈ ఏడాది అంతకుమించి వచ్చింది. ఆక్వా ఉత్పత్తులు, ఉల్లి ఎగుమతి, దిగు మతులు, వ్యాపార ఉత్పత్తుల దిగుమతుల ద్వారా రూ.48 కోట్లు లభించింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంతో పౌరసరఫరాల కార్పొరేషన్ రెండు విడతలుగా రూ.37 కోట్లు జిల్లాలోని ఎఎంసిలకు జమచేసింది. దీంతో ఈ ఏడాది ఆదాయం రూ.85 కోట్లకు చేరింది.
20 శాతం నిధులు తుస్
ఏఎంసీలకు వచ్చిన ఆదాయంలో ఏటా 20 శాతం నిధులను స్థానిక రైతుల అవసరాలు తీర్చేందుకు ఉపయోగించాలి. పుంత రహదారుల నిర్మాణం, రైతులకు వైద్య శిబిరాలు, పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందుల పంపిణీ చేపట్టాలి. యార్డుల్లో వసతులు మెరుగుపరచాలి. ప్రభుత్వం మాత్రం నిధులు వెచ్చించడానికి అవకాశం ఇవ్వడం లేదు. పాలకవర్గాలు ఏర్పాటైన తర్వాత ఇటీవల కొన్ని ఏఎంసీల్లో శుభ్రత పనులు చేపట్టారు. వాటి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. కేవలం సిబ్బంది వేతనాలు, పాలకవర్గాల గౌరవ వేతనాల వరకే ప్రభుత్వం ప్రతి నెలా నిధులు ఇస్తోంది. అంతకుమించి బిల్లులు మంజూరు చేయడం లేదు. డెల్టాలో పుంత రహదారుల ఏర్పాటుపై రైతుల నుంచి పాలకవర్గాలు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి వుంది. నిబంధనల మేరకు అయినా 20 శాతం నిధులు కేటాయిస్తే ఈ ఏడాదే జిల్లాకు దాదాపు రూ.20 కోట్లు లభ్యం కానున్నాయి. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
మూడు కోట్లు ఇవ్వాలి..
ప్రతి నియోజకవర్గంలో దాదాపు 30 వరకు ముఖ్యమైన పుంత రహదారులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు అధ్వాన్నంగా మారాయి. నియోజకవర్గానికి రూ.3 కోట్లు వంతున నిధులు కేటాయిస్తే రైతులకు కనీస అవసరాలు తీర్చేలా పొలాల్లోకి రహదారుల అభివృద్ధి చేయవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు 20 శాతం నిధులు ఇచ్చినా రహదారుల అభివృద్ధి సాధ్యపడుతుంది. భవిష్యత్తులో బీటీ రోడ్లకు ఆస్కారం కలుగుతుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.