ఎదురులేని స్త్రీ శక్తి
ABN , Publish Date - Aug 15 , 2026 | 01:18 AM
ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత బస్సు ప్రయా ణానికి ఉపకరించిన స్రీశక్తి పథకం మహిళలు పెద్ద ఎత్తున ఆదరించడంతో సక్సెస్ బాట పట్టింది.
ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత బస్సు ప్రయా ణానికి ఉపకరించిన స్రీశక్తి పథకం మహిళలు పెద్ద ఎత్తున ఆదరించడంతో సక్సెస్ బాట పట్టింది. గతేడాది ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభిం చగా ఎదురులేని శక్తిగా స్ర్తీ శక్తి ఏడాది పూర్తి చేసుకుంది. ఆర్టీసీ అధికారులు, సిబ్బంది వీరికి బస్సు ప్రయాణాలను కల్పించడం సవాల్‌గా తీసుకుని సేవలందించడంతో మహిళలు ఆర్టీసీ సేవలను దగ్గర చేసుకున్నారు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి సర్కార్‌కు మరింత మైలేజీ ఇచ్చిన పథకం ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించిన స్ర్తీశక్తి పథకం. మహిళలు ఎడాపెడా ప్రయాణాలతో బస్సులను రయ్యమ నిపిస్తున్నారు. ఎంత కష్టమైన ఆడబిడ్డలకు బస్సు ప్రయా ణం వల్ల వారు కావాల్సిన అమర్చుకుంటున్నారని సీఎం చంద్రబాబు సైతం వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు.
జిల్లాలో భారీగా ప్రయాణాలు
జిల్లాలో 175 బస్సుల వరకు కేటాయించి ఉచిత బస్సు ప్రయాణా లను ఆర్టీసీ యాజమాన్యం నడిపింది. ఏడాది కాలంలో ఇప్పటి వరకు 2 కోట్ల 21 లక్షల 9వేల 970 మంది బస్సు సేవలను అందుకుని రాకపోకలు సాగిం చారు. తద్వారా ఆర్టీసీ రూ.73 కోట్ల 10 లక్షల పైబడి భారం మోసింది. వీటిని ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ రూపంలో జమ చేయాల్సి వుంది. ఏలూరు ఆర్టీసీ డిపో పరిధిలో 98 లక్షల76 వేల 732 మంది, జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో పరిధిలో 73 లక్షల 33 వేల 971 మంది, నూజివీడు డిపో పరిధిలో 49 లక్షల 19 వేల 267 మంది మహిళలు ఉచిత బస్సుల్లో రాకపోకలను సాగించారు.
ప్రైవేట్ ఉద్యోగినులకు ఎంతో మేలు
జిల్లాలో దగ్గర పట్టణాలు, గ్రామాల నుంచి ఏలూరు కేంద్రం, ఇతర చోట్ల ఉద్యోగాలు చేసే మహిళలకు స్ర్తీ శక్తి పథకం చాలావరకు మేలు చేసింది. చిన్న చితకా ఉద్యో గాల్లో రూ.పదివేలు నుంచి రూ.15 వేలు తెచ్చుకుని మహి ళా సెక్యూరిటీ గార్డులు, ఆయాలు, నర్సులు, ఇతర సేవ లందించే మహిళలకు నెలకు సగటున బస్సు ఛార్జీల రూపంలో రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేల వరకు ప్రయోజనం కలిగింది. ఈ మొత్తాలు ఆదా ద్వారా వారికి ఏడాదిలో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు మిగులు లభించింది. ఈ పథకం అమలుతో విద్యార్థినులకు బస్ పాస్‌ల సొమ్ము కలిసి వచ్చినట్లైంది.
ఆలయాలు కిటకిట
ఏలూరు, తూర్పుగోదావరి, విజయవాడల్లోని ప్రముఖ దేవాలయాలు శుక్ర, శని, ఆదివారాల్లో మహిళలతో కిట కిటలాడడానికి స్ర్తీశక్తి పథకం ఎంతో ఉపకరించింది. ఎవరి తోడు లేకుండా పొరుగువారి సహాయంతో ద్వారకా తిరుమల, వాడపల్లి వేంకటేశ్వరస్వామి, అన్నవరం సత్య నారాయణస్వామి తదితర ప్రముఖ దేవాలయాలను మహిళలు దర్శించుకుంటున్నారు.
సమస్యలు తలెత్తకుండా నిర్వహణ
ఏలూరు డీపీటీవో షేక్ షబ్నం
ప్రభుత్వం ముందు చూపుతో అమలు చేసిన ఈ పథకాన్ని మహిళలు విరివిగా వినియోగించు కుంటున్నారు. ఈ ఏడాది కాలంలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా నిర్వహించడం మాకెంతో సంతృప్తి నిచ్చింది. బస్సుల సంఖ్య పెరిగితే వారికి ఇంకా ప్రయోజనం చేకూరుతుంది.
మహిళలకు, ఉద్యోగినులకు ఉపయోగకరం
స్ర్తీ శక్తి పథకం మహిళల పాలిట వరం. పేద, మధ్యతరగతి మహిళలకు చార్జీలు లేకుండా ప్రయాణం చేయడం ఎంతో లబ్ధి చేకూరుతోంది. దూర ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు ఎటువంటి ఖర్చు లేకుండా ప్రయాణాలు చేస్తున్నారు.
– శానం కరుణశ్రీ, తంగెళ్లమూడి
ఇచ్చిన మాట నెరవేర్చిన చంద్రన్న
ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలు అమ లు చేస్తూ చంద్రన్న మాట నిలబెట్టుకున్నారు. స్ర్తీ శక్తి పథకం లో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత బస్సు ప్రయాణం అన్ని ప్రాంత మహిళలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులుండే మహిళలకు ఎక్కడకు వెళ్లాలన్న ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు.
– కర్రి పద్మావతి, ఏలూరు