మా మార్కులు తగ్గాయి
ABN , Publish Date - May 10 , 2026 | 12:28 AM
‘మేం రాసిన పరీక్షల్లో ఆశించిన మార్కులు రాలేదు. కాబట్టి మా పేపర్‌ను మళ్లీ పరిశీలించండి’ అంటూ పదో తరగతి విద్యార్థులు పెద్ద సంఖ్యలో రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ల కోసం దరఖాస్తులు చేస్తున్నారు.
83,500 మంది టెన్త్ విద్యార్థుల దరఖాస్తులు
భీమవరం రూరల్, మే 9(ఆంధ్రజ్యోతి):
‘మేం రాసిన పరీక్షల్లో ఆశించిన మార్కులు రాలేదు. కాబట్టి మా పేపర్‌ను మళ్లీ పరిశీలించండి’ అంటూ పదో తరగతి విద్యార్థులు పెద్ద సంఖ్యలో రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ల కోసం దరఖాస్తులు చేస్తున్నారు. ఈనెల ఏడో తేదీతో గడువు ముగిసే నాటికి ఈ దరఖాస్తుల సంఖ్య 3,500. గతంలో ఎన్నడూలేని విధంగా అత్యధికంగా అభ్యర్థనలు వచ్చినట్లు జిల్లా విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 22,363 పరీక్షలు రాస్తే 19,147 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 85.59. వీరిలో 1,719 మంది విద్యార్థులు 500మార్కులపైన సాధించారు. వారు వారి పాఠశాలల విద్యార్థులలో మొదటి పది స్థానాల్లో ముందు వెనుక ఉండడంతో రీ కౌంటింగ్ కోసం వంద మంది, రీ వెరిఫికేషన్ కోసం 3400 మంది దరఖాస్తు చేశారు. ఈసారి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేటుతో పోటీగా మార్కులు సాధించారు. వారు అనుకున్న మార్కులలో నాలుగు, ఐదు తగ్గాయని రీవాల్యుయేషన్‌కు వెళ్లారు. ఇక సైన్స్ సబ్జెక్టులలో 1913 మంది, తెలుగులో 1381 మంది, సోషల్‌లో 1076 మంది ఫెయిలయ్యారు. వీరిలో ఒక మార్కు తేడాతో ఫెయిల్ అయిన వారు ఉన్నారు. సైన్స్‌లో రెండు పేపర్లు కనుక 17 మార్కులు, మరో పేపర్‌లో 17 మార్కులు రెండు కలిపి 34 రావడం ఒక మార్కుపై సందేహాలు వున్న వారు దీనిపై ఆసక్తి చూపారు.
వారం రోజులలో వివరాలు ..
డీఈవో ‘పేపర్ రీ వాల్యుయేషన్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యింది. వీటి వివరాలు వారం రోజుల్లో వస్తాయి. సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 25 నుంచి జూన్ 4 వరకు జరుగుతాయి. రీ వాల్యుయేషన్‌లో ఫెయిలైన వారు దరఖాస్తు చేసుకున్నారు. మార్కులు పెరగకపోతే సప్లిమెంటరీ పరీక్షలకు వెళ్లాలి. దాని కోసం రీవాల్యుయేషన్ వివరాలు త్వరగా రావాలని చూస్తున్నారు’ అని డీఈవో నారాయణ తెలిపారు.