వా'నో' కాలం!
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:48 AM
ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో చినుకుల జాడ అంతంత మాత్రంగానే ఉంది. వర్షాలు కురియాల్సిన జూన్‌లో జిల్లాలో సాధారణం కన్నా తక్కువగానే వర్షపాతాలు నమోద య్యాయి.
12 మండలాల్లో మైనస్ నమోదు
ఎల్‌నినో ప్రభావం.. జిల్లాలో అరకొరగా కురుస్తున్న వర్షాలు
(ఏలూరుసిటీ–ఆంరఽధజ్యోతి)
ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో చినుకుల జాడ అంతంత మాత్రంగానే ఉంది. వర్షాలు కురియాల్సిన జూన్‌లో జిల్లాలో సాధారణం కన్నా తక్కువగానే వర్షపాతాలు నమోద య్యాయి. ఒక పక్కన వరి నారుమళ్లు సాగు తున్నా వర్షాభావ పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఎండిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వ్యవసాయ పను ల్లో నిమగ్నం కావాల్సిన రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం జిల్లాపై ఎక్కువగానే కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాలు ప్రారంభమైన తర్వాత జూన్‌లో వర్షాకాలం మొదలవుతుంది. అయి తే ఆరంభం నుంచి వాతావరణంలో కొంత మార్పులు సంభవించాయి. ఆకాశం మేఘావృతమైనా చినుకులు నేలరాలడం లేదు. జిల్లాలో జూన్‌లో సాధారణ వర్షపాతం 111.9 మిల్లీ మీటర్లు కాగా 106.3 మి.మీ మాత్రమే నమోదైంది. జిల్లాలోని 12 మండలాల్లో మైనస్ వర్షపాతాలు నమోదు కాగా ఇందులో రెండు మండలాల్లో మైనస్ 50 శాతం కన్నా తక్కువగానే వర్షపాతాలు నమోదయ్యాయి. జిల్లాలోని పోలవరం, కుక్కునూరు మండ లాల్లో తక్కువ వర్షపు రోజులు ఉండి తీవ్ర వర్షాభావ పరిస్థితులు కనబడగా జిల్లాలోని వేలేరుపాడు, చింతల పూడి, లింగపాలెం, టి.నరసాపురం, జీలుగు మిల్లి, బుట్టాయి గూడెం, ద్వారకాతిరుమల , జంగారెడ్డిగూడెం, చాట్రాయి, ఏలూరు అర్బన్ మండలాల్లో మైనస్ వర్షపాతాలు నమోద య్యాయి. పోలవరం మండలంలో మైనస్ 73.7 మి.మీ, కుక్కునూరులో మైనస్ 61.1 మి.మీ, ఏలూరు అర్బన్‌లో మైనస్ 35.5 మి.మీ, బుట్టాయిగూడెం మైనస్ 34.3 మి.మీ వర్షపాతాలు నమోదయ్యాయి. అంటే జూన్ లో వర్షాలు కురవాల్సిన రోజుల్లోను వర్షపాతా లు నమోదు కాని పరిస్థితి ఏర్పడిందని జిల్లా ప్రణాళికా శాఖ నివేదికలు చెబుతున్నాయి.
సార్వా సజావుగా సాగేనా..?
జిల్లాలో సార్వా వరి సాగు ముమ్మరంగా సాగుతోంది. జిల్లాలో 2లక్షల 10వేల ఎకరాల్లో వరిసాగు జరుగుతోంది. సాగుకు నీరు అధికంగా కావాల్సి ఉంది. బోర్లు సాగు ఉన్నా, కాల్వలు కింద సాగు జరుగుతున్నా ప్రకృతి రూపంగా వర్షాలు కురిస్తేనే సార్వా సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల మెదటి వారంలో బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందన్న వాతావరణ శాఖ సమాచారంతో వర్షాలపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.