సెస్.. తుస్!
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:22 AM
జిల్లాలో వ్యవసాయ మార్కెటింగ్ సెస్ వసూళ్లలో ఉదాశీన వైఖరి ప్రదర్శిస్తోంది. ఏఎంసీ పాలక వర్గాలు ఏర్పా టైనా అధికారులు మొద్దు నిద్ర వదలడం లేదు. జిల్లావ్యాప్తంగా తొమ్మిది ఏఎంసీల పరిధిలో రూ. 53.75 కోట్లకు గాను రూ.31.04 కోట్లే వసూలైంది.
వసూలైంది రూ.31.04 కోట్లు
ఏఎంసీల్లో పర్యవేక్షణ శూన్యం
ఏలూరు, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి):జిల్లాలో వ్యవసాయ మార్కెటింగ్ సెస్ వసూళ్లలో ఉదాశీన వైఖరి ప్రదర్శిస్తోంది. ఏఎంసీ పాలక వర్గాలు ఏర్పా టైనా అధికారులు మొద్దు నిద్ర వదలడం లేదు. జిల్లావ్యాప్తంగా తొమ్మిది ఏఎంసీల పరిధిలో రూ. 53.75 కోట్లకు గాను రూ.31.04 కోట్లే వసూలైంది. నెల రోజుల్లో మొత్తం వసూళ్లు కావడం అధికారులు నడుంబిగిస్తే సాధ్యమే.! కలిదిండి, కైకలూరు, నూజి వీడు మినహా అన్నిచోట్ల ప్రజా ప్రతినిధులు కొలువుతీరారు. అయినా సెస్ వసూళ్లు మాత్రం 58 శాతం మించలేదు. 33 వరకు ఏఎంసీ చెక్ పోస్టు లున్నాయి. సిబ్బంది సక్రమంగా వున్నా.. వసూళ్లలో ఉదాశీనతతో ఆదాయాలకు గండి పడుతోంది. సూపర్‌వైజర్లు, మార్కెటింగ్ సెక్రటరీలు పూర్తిగా పర్యవేక్షణ చేయకపోవడంతో సెస్ ఆశించిన మేర వసూలు కాలేదు. నిర్ధేశిత వేళల్లో సిబ్బంది విధుల్లో ఉండడం లేదు. ఒకేచోట పాతుకుపోయిన సెక్యూ రిటీ, గుమస్తా ఉద్యోగుల వల్ల ఆదాయాలకు గండి పడుతోందనే విమర్శలున్నాయి. మార్కెటింగ్ శాఖ వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయలు, చేపలు, మేత, ఇతర ఉత్పత్తులపై సెస్ వసూళ్లపరంగా ముందంజలోనే ఏలూరు జిల్లా మార్కెటింగ్ ఉండేది. ఈ ఏడాది కొంత వెనుకబాటుతనం కనిపిస్తోంది.
ఏఎంసీలు వసూలు వసూలైంది శాతం
చేయాల్సింది (రూ.కోట్లలో..)
ఏలూరు 3.60 2.98 82.00
కలిదిండి 6.00 4.22 70.44
కైకలూరు 7.79 5.18 66.50
చింతలపూడి 7.92 4.48 56.60
నూజివీడు 5.08 2.80 55.20
భీమడోలు 3.43 1.83 53.58
ఉంగుటూరు 6.13 3.06 50.02
పోలవరం 5.70 2.74 48.22
దెందులూరు 8.10 3.71 45.82
మొత్తం 53.75 31.04 57.76
లక్ష్యం చేరుకుంటాం..
ప్రభుత్వం నిర్థేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ధాన్యం రవాణా లో మార్కెటింగ్ శాఖకు సెస్ వసూళ్లు జరుగుతా యి. మార్చిలో లక్ష్యాలను కచ్చితంగా అధిగమించేం దుకు చర్యలు చేపట్టాం. నూజివీడు పరిసరాల్లో మామిడి, ఇతర ఉత్పత్తుల వల్ల సెస్ వసూలవుతుంది.
– మార్కెటింగ్ శాఖ ఏడీ, శ్రీనివాస్