వీడని బద్దకం
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:59 AM
స్థానిక సంస్థల ఆదాయానికి ఊతం ఇచ్చే అన ధికారిక లే–అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణలో కమిషనర్లు టౌన్‌ప్లానింగ్ అధికారులు బద్దకం వీడడం లేదు.
జిల్లాలో పరిష్కారం కానివే కోకొల్లలు
ఇప్పటి వర కు రూ.45.91 కోట్ల ఆదాయార్జన
అక్టోబరు 23 వరకు ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం
త్వరలో పురపాలక సంఘాల్లో టౌన్ ప్లానింగ్ మేళాలు : ఆర్జేడీ
స్థానిక సంస్థల ఆదాయానికి ఊతం ఇచ్చే అన ధికారిక లే–అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణలో కమిషనర్లు టౌన్‌ప్లానింగ్ అధికారులు బద్దకం వీడడం లేదు. కనీసం వారం వారం సమీక్షల్లేవు. క్షేత్రస్థాయిలో పరిశీల నలు చేపట్టడం లేదు. కేవలం కార్యాలయాలకే పరిమితం అవుతు న్నారన్న విమర్శలున్నాయి. పాలక వర్గాలు అధికారంలో లేని సమయంలో ఒత్తిడులు కొంత తక్కువే. అయినా కనీసం కదలక పోవడంతో దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వం అనధికారిక లే–అవుట్ల, ప్లాట్ల క్రమబద్ధీకర ణకు పలుమార్లు అవకాశం కల్పించింది. ఏటేటా గడు వును పెంచుతూ భవన యజమానులకు కొంతమేలు చేస్తూనే.. స్థానిక సంస్థలకు లే–అవుట్ ఫీజుల కింద ఆదాయం సమకూరేలా ఉత్తర్వులు ఇస్తోంది. అయితే ఇవి పరిష్కరిస్తే తమ ఆదాయానికి గండి పడుతుం దన్న ధోరణిలోనే టౌన్‌ప్లానింగ్ వ్యవస్థ వేళ్లూనుకు పోయింది. కొన్నేళ్ల క్రితం వచ్చిన ప్లానింగ్ సెక్రటరీలు హవానే చాలా చోట్ల సచివాలయాల్లో కొనసాగుతోంది. దీనికి తోడు పురపాలక సంఘాల్లో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్లు, బిల్డింగ్ ఇన్‌స్పెపెక్టర్లు, ట్రేసర్లు, కింది స్థాయి సిబ్బంది కొరతే... ప్లానింగ్ సెక్రటరీలకు కలి సొచ్చిన అంశంగా చెబుతున్నారు.
గతంలోనే గండి.. ఇప్పుడైనా శ్రద్ధ పెడతారా ?
వాస్తవంగా అక్రమ, అనధికారిక నిర్మాణాలు, ప్లాట్ల విభజనలను ఆదిలోనే టౌన్‌ప్లానింగ్, ఇడా ఆఫీసర్లు క్షేత్రస్థాయిలోనే తనిఖీలు చేస్తే ప్రభుత్వ ఆదాయానికి గండి పడేదే కాదు. పోనీ అలా కాకపోయిన నేపథ్యం లోనే వాటిని క్రమబద్ధీకరించినప్పుడు ఆ దరఖాస్తులను వేగంగా పరిష్కరించే దిశగా అడుగులు వే యలేకపోతు న్నారు. ప్రధానంగా దరఖాస్తు చేసుకున్న బిల్డర్ లేదా ప్లాట్ల ఓనర్లకు అవగాహన కల్పించాల్సిన బాఽధ్యత టౌన్‌ప్లానింగ్ అధికారులపైనే ఉంది. తూతూమంత్రంగా దరఖాస్తు ఫీజులను కట్టించేసి వారి సమస్యలను పరి ష్కరించడానికి అవసరమయ్యే డాక్యుమెంట్లను తిరిగి రప్పించే ప్రక్రియే చేపట్టం లేదు. ఓవరాల్‌గా పురపాలక సంఘం ఆదాయం, ఇతరత్రా అంశాలను పర్యవేక్షిం చాల్సిన కమిషనర్లు టౌన్‌ప్లానింగ్ అంశం తమది కాదనట్లుగానే వ్యవహరించడం కొస మెరుపు. అడపా దడపా సమీక్షలు చేయకుండానే సంవత్సరాలు గడిపేస్తున్నారు.
జిల్లాల్లో పరిష్కరించిన దరఖాస్తులు అంతంతే
జిల్లాలో ఏలూరు కార్పొరేషన్, ఏలూరు అర్బన్ అథారిటీ (ఇడా), జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సి పాల్టీలు, చింతలపూడి నగరపంచాయతీ పరిధిలో 7,450 దరఖాస్తులు రాగా అనుమతిచ్చిన లే– అవుట్లు 1,708, తిరస్క రించనవి 181 దరఖాస్తులున్నాయి. దరఖాస్తులను పరిష్కరించడానికి అవసర మయ్యే వివిధ డాక్యుమెంట్లు, ఎన్‌వోసీలు తదితర అంశాలకు సంబంధించి 741 మంది ఇంకా సమర్పించాల్సి ఉంది. 447 మంది ప్లాట్ల యజమానుల నుంచి లే–అవుట్ల రెగ్యులరేజేషన్ ఫీజుల కింద చెల్లింపులు చేయాలని నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ఓవరాల్‌గా లే–అవు ట్ల దరఖాస్తుల ఫీజుల కింద రూ.45.91 కోట్ల ఆదాయం స్ధానిక సంస్థలకు సమకూరింది. ఇడా పరిధిలోనే 5,994 దరఖాస్తులకు 29.76కోట్ల ఆదాయం సమకూరింది.
త్వరలో మేళాలు నిర్వహిస్తాం..
జిల్లాలో నెలా పదిహేను రోజులుగా ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ వల్ల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం తగ్గింది. త్వరలో పురపాలక సంఘాల్లో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ద్వారా ఎల్‌ఆర్‌ఎస్ మేళా లను నిర్వహించాలని సంకల్పించాం. త్వరలోనే ఎల్‌ఆర్‌ఎఆస్ ఆదాయం గణనీయంగా పెంచుతాం.
–గెడ్డం సుబ్బారావు, ఆర్జేడీ టౌన్‌ప్లానింగ్ (రాజమహేంద్రవరం)