Share News

కేజీబీవీల సిబ్బందిపై కక్ష..!?

ABN , Publish Date - May 12 , 2026 | 01:01 AM

ఏలూరు జిల్లా కస్తూర్బా బాలికా విద్యాలయాల్లోని కాంట్రాక్టు సిబ్బంది, స్పెషలాఫీసర్లను సమగ్ర శిక్ష జిల్లా అధికారుల వేధిం పులపై ఎస్‌ఎస్‌ఏ రాష్ట్ర ప్రాజెక్టు ఆఫీసర్‌ దృష్టి సారించింది.

కేజీబీవీల సిబ్బందిపై కక్ష..!?

నిజ నిర్ధారణకు జిల్లాకు రానున్న రాష్ట్ర అధికారుల బృందం

ఏలూరు జిల్లా కస్తూర్బా బాలికా విద్యాలయాల్లోని కాంట్రాక్టు సిబ్బంది, స్పెషలాఫీసర్లను సమగ్ర శిక్ష జిల్లా అధికారుల వేధిం పులపై ఎస్‌ఎస్‌ఏ రాష్ట్ర ప్రాజెక్టు ఆఫీసర్‌ దృష్టి సారించింది. మూడు రోజుల్లో అధికారుల బృందం జిల్లాకు రానున్నట్టు సంకేతాలందాయి. విద్యా శాఖలో ఈ అంశం హాట్‌ టాఫిక్‌ గా మారింది.

ఏలూరు అర్బన్‌, మే 11(ఆంధ్రజ్యోతి):బాలికల విద్య కోసం కుక్కునూరు, వేలేరు పాడు, వేలేరుల్లో కస్తూర్బా బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) వున్నాయి. ఆరు నుంచి ఇంటర్మీడియట్‌ వరకు బోధించే ఈ విద్యాలయాలు ఒక్కో దానిలో 220 నుంచి 260 మంది వరకు బాలికలు చదువు కుంటారు. ఒక్కో కేజీబీవీకి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించే స్పెషలాఫీసర్‌ మొదలుకుని క్లస్టర్‌ రీసోర్సు టీచర్లు, ఏఎన్‌ ఎంలు, ఆయాలు, కుక్‌లు, నైట్‌ వాచ్‌మెన్లు, మెసెంజర్లు, తదితర ఉద్యోగులంతా కాంట్రాక్టు ప్రాతిపదిన నియమితు లైన వారే. మొత్తం మూడు కేజీబీవీల్లో వేలేరులోని విద్యా లయకు ప్రిన్సిపాల్‌ డీఎస్సీలో రెగ్యులర్‌ జాబ్‌ రావడంతో వెళ్లిపోగా, ఆ స్థానం ఖాళీగా ఉంది. మిగతా రెంటింటికి స్పెషలా ఫీసర్లున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం విడుదల చేసిన కాంపోజిట్‌ గ్రాంట్ల నిధుల్లో వివిధ పనుల నిమిత్తం ఖర్చు చేయగా మిగిలిన నిధులను వెనక్కివ్వాలని ఎస్‌ఎస్‌ఏ జిల్లా కార్యాలయ అధికారి ఒకరు కుక్కునూరు, వేలేరుపాడు కేజీబీవీల స్పెషలాఫీసర్లపై ఒత్తిడి తేవడంతో మిగులు నిధులను ఇచ్చేశారు. సంబంధిత చెక్కులకు వస్తు రూపంలో జిల్లా కార్యాలయం నుంచి ఏ ఒక్కటీ అందక పోవడంతో స్పెషలాఫీసర్లకు సందేహం వచ్చి జిల్లా అధి కార వర్గాలను నిలదీయడంతో వేధింపులు మొదలయ్యా యి. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని చిరు దుకాణాల్లో కొనుగోలు చేసిన చీపుళ్లు, చిన్నపాటి సామగ్రికి బిల్లులు లేవని, దొంగ బిల్లులు పెట్టారని, తదితర సాకులను చూ పించి స్పెషలాఫీసర్లను చీవాట్లు పెడుతూ వేధించేవారు. మరోవైపు ముందస్తు జాగ్రత్తలతో ఏప్రిల్‌లో కొన్ని ఆట వస్తువులను జిల్లా కార్యాలయం నుంచి రెండు కేజీబీవీలకు సరఫరా చేసి చేతులు దులుపుకున్నారనే వ్యాఖ్యలు విన్పి స్తున్నాయి.

విధుల్లో కొనసాగాలంటే...

అనుమతి తీసుకోకుండా పలువురు కాంట్రాక్టు ఉద్యో గులు కేజీబీవీల్లో పని చేస్తున్నారంటూ వారిని తొలగిం చేందుకు చర్యలు చేపట్టడం, మళ్లీ టెర్మినేషన్‌ ఉత్తర్వులు జారీకాకుండా అవినీతికి పాల్పడిన ఉదంతంలో పెద్ద మొత్తంలోనే చేతులు మారినట్టు ప్రచారం జరుగుతోంది. కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఎవరైనా మానేస్తే ప్రత్యామ్నాయ సిబ్బందిని నియమించుకునే వెసులుబాటు గతంలో ఎస్‌ఎస్‌ఏ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్‌ అనుమతి ఉండేది. దీనికి మద్దతుగా టీచింగ్‌, నాన్‌–టీచింగ్‌ సిబ్బంది నియామకాల నోట్‌ ఆర్డర్స్‌, రెన్యువల్‌ ఆర్డర్స్‌ కేజీబీవీల వద్ద ఉండడం గమనార్హం. అవి చెల్లవంటూ గత 10, 15 ఏళ్లుగా ఖాళీ స్థానాల్లో పనిచేస్తున్న సిబ్బంది కొందరిని విధుల నుంచి టెర్మినేట్‌ చేయడానికి జిల్లా కార్యాలయం చేపట్టిన చర్యలను నిలుపుదల చేయడానికి రూ.12 లక్షలు వసూళ్లు జరిగినట్టు సమాచారం. ఇలా ఎవరెవరి నుంచి ఎస్‌ఎస్‌ఏ జిల్లా కార్యాలయ వర్గాలు ఎంతెంత వసూలు చేసిందీ పేర్కొంటూ ఓ కేజీబీవీ స్పెషలాఫీసర్‌ /ప్రిన్సిపాల్‌ నేరుగా సమగ్ర శిక్ష ఎస్పీడీకి సోమవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు పంపారు. ఆ ఒక్క కేజీబీవీలో ఏడుగురు ఉద్యోగుల నుంచి రూ.3.90 లక్షలు వసూలు చేశారని ఫిర్యాదులో ప్రిన్సిపాల్‌ వివరించారు.

Updated Date - May 12 , 2026 | 01:01 AM