Share News

హమ్మయ్య!

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:25 AM

జిల్లా పౌర సరఫరాల శాఖ పనితీరు నానా టికీ తీసికట్టుగా మారుతోంది. ప్రభుత్వంపై ప్రజల్లో సేవలపై సానుకూలత (పబ్లిక్‌ ఫర్‌ పెక్షన్‌)పై ఇటీవల ఐవీఆర్‌ఎస్‌ సర్వేలను చేపట్టింది.

హమ్మయ్య!

ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో కార్డుదారుల తీర్పు

ఇన్‌చార్జి మంత్రిగారి ఇలాకాలో అంతా అస్తవ్యస్తం

45 చోట్ల రేషన్‌ సరుకులను ముట్టని కార్డుదారులు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లా పౌర సరఫరాల శాఖ పనితీరు నానా టికీ తీసికట్టుగా మారుతోంది. ప్రభుత్వంపై ప్రజల్లో సేవలపై సానుకూలత (పబ్లిక్‌ ఫర్‌ పెక్షన్‌)పై ఇటీవల ఐవీఆర్‌ఎస్‌ సర్వేలను చేపట్టింది. పౌరసరఫరాల శాఖపై చేపట్టిన సర్వేలో జిల్లా గత నెలలో జరిగిన సర్వే ప్రకా రం 77.7 శాతం మంది కార్డుదారులు అను కూలంగాను, 22.3 శాతం ప్రతికూలంగాను సమాధానం ఇచ్చారు. దీంతో జిల్లా ర్యాంకు అట్టడుగు నుంచి రెండులో అంటే 25వ స్థానం లో నిలిచింది. దీంతో అప్రమత్తమైన అధికారు లు తనిఖీల బాట పట్టడంతో ఈ ర్యాంకు 12కు చేరుకుంది.

అకస్మాత్తుగా తనిఖీల బాట

జిల్లాకు సాక్షాత్తు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఇన్‌చార్జిగా ఉన్నా రు. 22 నెలల పాటు పలు తనిఖీలు.. వివిధ సమీక్షలు చేశారు. తీరా ఆచరణలో ఈ శాఖ ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో 25 ర్యాంకులో నిలవడంతో అధికారులు తనిఖీల బాట పట్టారు. సివిల్‌ సప్లయీస్‌ డీటీలు, ఆర్‌ఐలు రేషన్‌ షాపులను తనిఖీలు చేశారు. మొబైల్‌ యాప్‌ ద్వారా వారిని నమోదు చేసి ఐవీఆర్‌ఎస్‌ సర్వేలోకి ఎక్కించారు. కార్డుదారులకు అవ గాహన కార్య క్రమాలు చేపట్టారు. కొసమెరుపు ఏమిటంటే రాష్ట్రంలో అత్యధికంగా రేషన్‌ షాపులను తనిఖీ చేసిన జిల్లాగా ఏలూరు నిలిచిందని కూడా ఈనెల 4న జరిగిన డీఆర్‌సీ సమావేశంలో అధి కారులు పేర్కొనడం గమనార్హం. కలెక్టర్‌ వెట్రి సెల్వి, జేసీ అభిషేక్‌ గౌడ అధికారుల వెంటపడి మరీ సమీక్షలు చేశారు. ఈక్రమంలో ఈనెలలో చేపట్టిన సర్వేలో జిల్లా 12 ర్యాంకులో నిలిచి నట్టు ప్రకటించారు. సర్వేలో 81.2 శాతం అను కూలంగాను, 18.8శాతం ప్రతికూలంగా పౌరసర ఫరాల శాఖ సేవలపై స్పందించారు.

ఈ మండలాల్లో వెనుకబాటే..

జిల్లా వ్యాప్తంగా చింతలపూడిలో 6, దెందు లూరులో 3, ఏలూరులో 5, కైకలూరులో 10, నూజివీడులో 3, పోలవరంలో 11, ఉంగుటూరు లో 7 షాపుల కలిపి మొత్తం 45 చోట్ల రేషన్‌ సరుకులను అత్యధికంగా కార్డుదారులు తీసుకెళ్ల లేదని తేలింది. బియ్యం వండుతుంటే ముద్దవు తుందని తేలినట్టు సమాచారం. సాక్షాత్తు జిల్లా అధికారే ఈ విషయం తేటతెల్లం చేశారు. ఈ బ్యాక్‌లాగ్‌లో నిలిచిన షాపులు తమ పనితీరు మెరుగుపర్చకపోతే డీలర్‌షిష్‌లను రద్దు చేయా లని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆదేశాల ను జారీ చేయడం విశేషం. ఇక ముందు అయినా రేషన్‌ షాపులను సక్రమంగా నిర్వహిస్తారా? చతికిలపడతారా? అన్నది చూడాలి.

Updated Date - Apr 08 , 2026 | 12:25 AM