మైనింగ్ సెస్‌కు ఏఎంఆర్ గంతలు!
ABN , Publish Date - Aug 29 , 2026 | 01:09 AM
రాజధాని అవసరాలకు గ్రావెల్ పేరుతో నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరి పల్లి మండలం కనసానిపల్లిలోని పరిసర ప్రాంతాల్లో మైనింగ్ శాఖ అనుమతులు పొందిన క్వారీలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి.
కనసానిపల్లిలో అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్న గ్రామస్థులు
నిలదీతతో సిబ్బంది నిష్క్రమణ
అనుమతులు ఒకచోటకు.. గ్రావెల్ చేరేది మరో చోటుకు..
నూజివీడు, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): రాజధాని అవసరాలకు గ్రావెల్ పేరుతో నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరి పల్లి మండలం కనసానిపల్లిలోని పరిసర ప్రాంతాల్లో మైనింగ్ శాఖ అనుమతులు పొందిన క్వారీలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. మైనింగ్ సెస్‌ను మైనిం గ్ శాఖకు చెల్లించి రసీదు పొందాలి. దీని వల్ల నేరుగా ప్రభుత్వానికి ఆదాయం లభి స్తుంది. ఇక్కడ ఇందుకు విరుద్ధంగా మైనింగ్ సెస్ స్థానంలో ఏఎంఆర్ (ఫ్రైవే ట్ సంస్థ) స్లిప్స్‌తో యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ మార్గంలో రియల్ ఎస్టేట్‌కు తరలి పోతోందని కనసనపల్లి గ్రామస్థులు ఆరోపి స్తున్నారు. శుక్రవారం గ్రామం నుంచి వెళు తున్న క్వారీ లారీలను ఏఎంఆర్ పాయిం ట్ వద్ద గ్రామస్థులు అడ్డుకుని ఏ అధి కారంతో స్లిప్‌లు ఇస్తున్నారో చెప్పలంటూ ఏఎంఆర్ సిబ్బంది నిలదీశారు. లోడ్‌లో ఉన్న గ్రావెల్ లారీలు మైనింగ్ సెస్ చెల్లించారా లేదా పరిశీలించకుండా స్లిప్స్ ఇవ్వడంపై సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేయడంతో ఏఎంఆర్ సిబ్బంది అక్కడి నుంచి మౌనంగా నిష్క్రమించారు. దీంతో గ్రామస్థులు మరింత అనుమానా లు వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వం హయాంలో ఈ గ్రామా నికే ఆనుకుని ఉన్న తోటపల్లిలోని క్వారీలో జరిగిన అక్రమ మైనింగ్‌పై నాటి ప్రభుత్వం శాఖ పరమైన విచారణ జరిపి రూ.మూడు కోట్లు అపరాధ రుసుమును విధించిన విషయం తెలిసినదే. ఇప్పుడు ప్రభుత్వం మారినా అక్రమ క్వారీయింగ్ తీరు మారదలేదని ప్రజల నుంచి విమ ర్శలు విన్పిస్తున్నాయి. రాజధాని అవసరాల పేరుతో అనుమతులను తీసుకున్నారు. అయితే సదరు గ్రావెల్ నున్న, పామర్రు, విజయవాడ తదితర ప్రదేశాలను రియల్ ఎస్టేట్ పారిశ్రామిక అవసరాలకు తరలి వెళ్తోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మైనింగ్ బిల్లుల స్థానంలో ఏఎంఆర్ బిల్లు లతో వెళ్తుండడంతో నిబంధనల ప్రకారం ఎంతవరకు సక్రమమన్నది మైనింగ్ శాఖ, ఏఎంఆర్ సంస్థ బహిరంగంగా ప్రకటన చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. రాజధాని పేరుతో ఆగిరిపల్లి కొండలు కరిగిపోతున్నాయి. దీనివల్ల గ్రామాల్లో రోడ్ల ధ్వంసంతో పాటు ప్రకృతి సమ తుల్యత దెబ్బతినడం, దుమ్ము, ధూళి వల్ల పంట నష్టాలు జరుగుతాయని గ్రామ స్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.