Share News

సర్దుబాటు సంబరం

ABN , Publish Date - Jul 18 , 2026 | 12:26 AM

ప్రభుత్వశాఖల్లో ఉద్యోగులను సర్దుబాటు చేయడానికి రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయిలో కస రత్తు వేగంగా సాగుతోంది.

సర్దుబాటు సంబరం

ప్రభుత్వశాఖల్లో ఖాళీల భర్తీకి ఛాన్స్‌

చురుగ్గా సీనియార్టీ జాబితాలు

ఆగస్టు 15న జాబ్‌ క్యాలెండర్‌

ఆపై అన్ని శాఖల్లో ఖాళీల భర్తీ

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వశాఖల్లో ఉద్యోగులను సర్దుబాటు చేయడానికి రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయిలో కస రత్తు వేగంగా సాగుతోంది. 2022 జిల్లాల పున ర్విభజన నేపథ్యంలో అసంబద్ధంగా తయారు చేసిన వివిధ శాఖల్లోని సీనియార్టీ జాబితాల సరిదిద్ది, పారదర్శకంగా అన్ని కేడర్లలోని జాబి తాలను సిద్ధం చేస్తున్నారు. దీనిపై రాష్ట్రస్థాయి లో విడుదలైన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా స్థాయిల్లోని ఆ శాఖల అధికారుల వివరా లతో, రాష్ట్రస్థాయిల్లోని ఆయా శాఖల ఉన్నతాధి కారుల సమాచారాల్ని, జాబితాలను అందించే ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఉద్యోగులు సర్దు ాటు వల్ల పరిపాలన వికేంద్రీకరణ మార్గం సుగమం అవుతుందని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా యంత్రాంగం ఈనెల 20లోగా సీనియార్టీ జాబితాలను సమర్పించాలని వివిధ శాఖలకు ఆదేశాలను జారీ చేసిన విషయం విదితమే. దీనిపై అభ్యంతరాలను స్వీకరించి ఆగస్టు ఐదో తేదీ నాటికి పరిష్కరించనున్నారు.

మళ్లీ ఆరుజోన్ల వ్యవస్థ

1976లో ప్రెసిడెంటల్‌ ఉత్తర్వుల ప్రకారం తెలుగు రాష్ర్టాల విభజన జరిగిన నేపథ్యంలో అమలులో ఉన్న నాలుగు జోన్ల వ్యవస్థను ఇప్పుడు ఆరుజోన్లకు ఏపీ ప్రభుత్వం విభజనకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలో జోన్‌–3లో ఉన్నాయి. తాజా మార్గదర్శకాల ప్రకారం ప్రతి జిల్లాలో స్థానిక ఉద్యోగులకు 80 శాతం, స్థానికేతరులకు 20 శాతం ప్రాధాన్యత ఇచ్చేలా సర్దుబాటు చేస్తారు. ఇదిలావుండగా ఉద్యోగుల సర్దుబాటు జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌, రాష్ట్రస్థాయిల్లో నాలుగు రకాలుగా చేపడతారు. ఈ కారణంగానే ఈ ఏడాది బదిలీల ప్రక్రియను చేపట్టలేదు. జిల్లాస్థాయిలో వాచ్‌ మెన్లు, ఆఫీస్‌ సబార్డినేట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, జోనల్‌స్థాయిలో సీనియర్‌ అసిస్టెంట్‌ నుంచి సూపరింటెండెంట్‌ వరకు, మల్టీ జోనల్‌లో డివిజన్‌ స్థాయి అధికారులు ఆర్డీవో, డీడీవో స్థాయిలో, రాష్ట్రస్థాయిలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్సీ, ఇతర ఉన్నతాధికారుల బదిలీలు చేపడతారు.

ఫ ఖాళీల భర్తీకి ఛాన్స్‌

జిల్లాల విభజన నేపథ్యంలో ఏలూరులోని పలు ప్రభుత్వ శాఖల్లో జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, సూపరింటెండెంట్‌ స్థాయిల్లోను పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వం చేపట్టే కసరత్తు అన్ని శాఖల్లో పూర్తయితే, ఆగస్టు 15న ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ జారీ చేస్తుంది. దాని ప్రకారం ఖాళీల భర్తీ అన్ని శాఖల్లో జరుగుతుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. స్థానిక, స్థానికేతరులతో ఉద్యోగుల ఖాళీల భర్తీ చేసే అవకాశం కలగనుండటంతో పొరుగు జిల్లాల నుంచి ఇక్కడ పనిచేసే ఉద్యోగులు ఆయా ప్రాంతాలకు బదిలీలకు అవకాశం ఉంటుంది. వారిచ్చే ఆప్షన్ల ప్రకారం తొలుత వారికి ప్రాధా న్యత ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులంతా సర్దుబాటు సంబరం పైనే ఆసక్తి, సర్వత్రా చర్చల్లో మునిగి తేలుతున్నారు.

Updated Date - Jul 18 , 2026 | 12:26 AM