అంతర్వేది తిరునాళ్లకు వేళాయె
ABN , Publish Date - Jan 25 , 2026 | 01:14 AM
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసిం హస్వామి తిరునాళ్లు సందర్భంగా నరసాపురం మీదుగా వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని ఆర్డీవో దాసి రాజు ఆదేశించారు.
పంటుపై పరిమితికి మించి అనుమతి లేదు
ఆర్టీసీ 40 ప్రత్యేక సర్వీసులు.. గుడి వరకు ప్రయాణం
ఆర్డీవో దాసి రాజు సమీక్ష
చించినాడ బ్రిడ్జికి ఐదు రోజులపాటు అనుమతి
నరసాపురం, జనవరి 24(ఆంధ్ర జ్యోతి):అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసిం హస్వామి తిరునాళ్లు సందర్భంగా నరసాపురం మీదుగా వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని ఆర్డీవో దాసి రాజు ఆదేశించారు. శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘ఈ నెల 28వ తేదీ కల్యాణం, 29న రధోత్సవం సందర్భంగా నరసాపురం మీదుగా పెద్ద సంఖ్యలో భక్తులు అంతర్వేది వెళుతుంటారు. రేవులో పరిమితికి మించి ప్రయాణికులను పంటు ఎక్కించ రాదు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణలో పంటు నడవాలి. రేవులో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలి. అంతర్వేది తిరునాళ్లు ముగిసే వరకు బియ్యపు తిప్ప రేవును మూసివేయాలి’ అని ఆర్డీవో ఆదేశించారు. ఆర్టీసీ డీఎం సుబ్బన్నరెడ్డి మాట్లాడుతూ 28, 29 తేదీల్లో నరసాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమ వరం డిపోల నుంచి ఆర్టీసీ 40 సర్వీసులను రేయింబ వళ్లు గుడి వరకు నడపనున్నట్లు తెలిపారు. కమిషనర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు లేకుండా మంచి నీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ, రైల్వే, రేవుల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారు.
చించినాడ వంతెనకు అనుమతి
అంతర్వేది తిరునాళ్లు సందర్భంగా ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే భక్తులకు ఇబ్బందులు లేకుండా చించినాడ వంతెనను తెరిచేందుకు కోనసీమ జిల్లా కలె క్టర్ ఆర్.మహే్‌ష్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు. మరమ్మ తుల నిమిత్తం ఈ వంతెనను గత ఏడాది నవంబరులో మూసివేశారు. ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. తిరునాళ్ల సందర్భంగా వంతెనపై ఆర్టీసీ బస్సులు, 16 టన్నుల బరువుతో కూడిన వాహనాలనే అనుమతిస్తారు. లారీలు, స్కూల్, కాలేజీ బస్సులు, ఇతర వాహనాలను అనుమతించరు.