రోడ్డెక్కారు!
ABN , Publish Date - Apr 26 , 2026 | 12:46 AM
సమగ్రశిక్ష జిల్లా కార్యాలయంలోని ఓ అధికారి కి, విలీన మండలాల్లోని పాఠశాలలను పర్య వేక్షించే ఓ డివిజన్ ఉప విద్యా శాఖాధికారికి మధ్య కొద్దిరోజులుగా విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.
తారస్థాయికి విభేదాలు
విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి
ఏలూరు అర్బన్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): సమగ్రశిక్ష జిల్లా కార్యాలయంలోని ఓ అధికారి కి, విలీన మండలాల్లోని పాఠశాలలను పర్య వేక్షించే ఓ డివిజన్ ఉప విద్యా శాఖాధికారికి మధ్య కొద్దిరోజులుగా విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. తొలుత ఉపాధ్యాయులకు నిర్వ హించిన ఆటల పోటీలకైన ఖర్చులకు నిధుల జమతో ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు అవినీతి ఆరోపణల వరకు వెళ్లింది. దీంతో అప్ర మత్తమైన సమగ్రశిక్ష అధికారి నేరుగా డీవై ఈవో బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తున్నా రంటూ పలు ఆరోపణలతో విద్యాశాఖ రాష్ట్ర, జిల్లా అధికారులకు ఈ–మెయిల్ ద్వారా శుక్ర వారం ఫిర్యాదులు పంపడం డీఈవో కార్యా లయంలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి స్పందనగా ఎస్‌ఎస్‌ఏ అధికారులు తనను ఏ విధంగా వేధిస్తున్నదీ, నెలవారీ మామూళ్లకు డిమాండ్ చేస్తున్నదీ ఫోన్‌పే ఆధారాలతో సహా విచారణలో ఉన్నతాధి కారులకు అందజేయడా నికి డీవైఈవో సమాయత్తమవుతున్నట్టు ప్రచా రం జరుగుతోంది.
మెగా డీఎస్సీ మొదలుకుని..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గతేడాది నిర్వ హించిన మెగా డీఎస్సీ–2025 రిక్రూట్ మెంట్‌లో ఉమ్మడి పశ్చిమ జిల్లా నుంచి ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం అధ్య క్షతన అమరావతిలో నియామక పత్రాలు అందజేసేందుకు భారీ సభను నిర్వహించిన విషయం విదితమే. ఉమ్మడి జిల్లా నుంచి ఎంపికైన అభ్యర్థులను అమరావతికి తరలించేం దుకు వీలుగా ఏలూరులో పలు విద్యా సంస్థల్లో వసతి ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు సౌకర్యా లు కల్పించేందుకు అవసరమైన నిధులను ముందుగా ప్రభుత్వం విడుదల చేయకపోవ డంతో డీవైఈవోలను ముందుగా ఖర్చుచేయా లని జిల్లా అధికారులు సూచించారు. ఇలా డీఎస్సీ అభ్యర్థులకు వసతి నిమిత్తం ఖర్చు చేసిన నిధులను ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే తనకు వెనక్కిఇవ్వాలని డీవైఈవో కోరారు. ప్రభుత్వ నిధులు సరిపోనందున ఇవ్వ లేమని డీవైఈవోకు జిల్లా అధికారులు స్పష్టం చేయడంతో కంగుతిన్నారు. ఆతర్వాత జిల్లాలోని టీచర్లకు మండలాలు, డివిజన్లు, జిల్లాస్థాయిల్లో నిర్వహించిన ఆటల పోటీలకు తన డివిజన్‌కు సంబంధించి చేసిన ఖర్చును రీయింబర్స్ చేయాలని డీవైఈవో కోరారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులను డీవైఈ వో బ్యాంకు ఖాతాకు సమగ్ర శిక్ష జిల్లా కార్యా లయం జమ చేసినా ఉప విద్యాశాఖాధికారి గమనించకుండా, ఆటల పోటీలకైన ఖర్చును చెల్లించాలంటూ సమగ్ర శిక్ష రాష్ట్ర అధికారులకు మెసేజ్ చేశారు. నిధులు జమ చేసినా పరి శీలించుకోకుండా రాష్ట్ర అధికారులకు తప్పుడు మెసేజ్ పెట్టి డీవైఈవో తనను అవమాన పర్చే లా బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించారని ఎస్ ఎస్‌ఏలో ఓ అధికారి శుక్రవారం ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపారు.
ఇదిలా ఉండగా నెలవారీ మామూళ్లు ఇవ్వని కారణంగా క్షేత్ర పర్యటనలకు వెళ్లేందుకు విని యోగిస్తున్న కారును సమగ్ర శిక్ష అధికారులు తొలగిస్తున్నట్టుగా డీవైఈవోకు ఇటీవల సమా చార మిచ్చినట్టు తెలుస్తోంది. నెలవారీ అద్దె ప్రాతిపదికన ప్రైవేటు ఆపరేటర్ల నుంచి తీసు కుని విద్యాశాఖలోని అధికారులకు సమగ్ర శిక్ష జిల్లా కార్యాలయం కేటాయిస్తోంది. ఇందుకు నెలవారీ బిల్లు చెల్లింపునకు ఆమోదం లభించా లంటే నెలకు రూ.7 వేలు లంచం ఇవ్వా ల్సిం దేని సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగితో డిమాండ్ చేయిస్తున్నారన్నది డీవైఈవో ఆరో పణ. తాను అంత ఇచ్చుకోలేనని నెలకు రూ.3 వేలు అయితే ఇస్తానని చెప్పడంతో పాత గొడ వల నేపథ్యంలో డీవైఈవోకు కారును తొలగిం చడానికి ఎస్‌ఎస్‌ఏ జిల్లా కార్యాలయం రంగం సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. కారు కు లంచం అడుగుతున్నారని డీవైఈవో ప్రచా రం చేస్తున్నట్టు భావించిన సమగ్రశిక్ష అధికారి ఒకరు తనపై ఉప విద్యాశాఖాధికారి ఆరోపణలను ఎదుర్కొనేందుకే టీచర్ల ఆటల పోటీలకైన ఖర్చుల చెల్లింపులో నిర్లక్ష్య ధోరణిని ఎత్తిచూపుతూ ఉన్నతాధికారులందరికీ ఫిర్యాదులను పంపడం శనివారం విద్యాశాఖవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఫిర్యాదుపై విచారణకు ఆదేశిస్తే సమగ్రశిక్షలోని ఆ అధికారి, ఉద్యోగుల అవినీతి బాగోతాన్ని విచారణాధికారుల ముందే ఆధారాలతో సహా బహిర్గతం చేసేందుకు డీవైఈవో సిద్ధమైనట్టు సమాచారం.