Share News

భానుడి భగభగలు

ABN , Publish Date - May 19 , 2026 | 12:57 AM

భానుడి భగభగలతో జిల్లా అట్టుడుకుతోంది. కొన్ని రోజులుగా జిల్లాలో తారస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోద వుతుండడంతో ప్రజలు ఎండతీవ్రత తట్టుకోలేక పోతు న్నారు.

భానుడి భగభగలు
ఏలూరులో ఫ్లయ్‌వోవర్‌పై నిర్మానుష్యం

జన సంచారం లేక రోడ్లు నిర్మానుష్యం

నేటి నుంచి తీవ్రంగా ఎండలు.. విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు

(ఏలూరుసిటీ – ఆంధ్రజ్యోతి)

భానుడి భగభగలతో జిల్లా అట్టుడుకుతోంది. కొన్ని రోజులుగా జిల్లాలో తారస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోద వుతుండడంతో ప్రజలు ఎండతీవ్రత తట్టుకోలేక పోతు న్నారు.ఏలూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, నూజి వీడు, భీమడోలు తదితర ప్రాంతాల్లో సోమవారం పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు నమో దయ్యాయి. రాత్రి పూట ఉషో ్ణగ్రతలు 26 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు నమోదవుతుండడంతో ఉక్క బోత తప్పడం లేదు. ఎండల ధాటికి ప్రధాన పట్టణా ల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈనెల 19వ తేదీ మంగళవారం వేడి గాలుల తీవ్రత ఎక్కువ గా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆ మేరకు మండలాలవారీగా నమోదయ్యే ఉష్ణోగ్రతలు.. ఆగిరిపల్లి 45.9, భీమడోలు 46.1, బుట్టాయిగూడెం 44.4, చాట్రాయి 45.2, దెందులూరు 46.1, ద్వారకా తిరుమల 45.3, ఏలూరురూరల్‌ 46.1, జంగారెడ్డి గూడెం 45.3, జీలుగుమిల్లి 44.7, కైకలూరు 45.4, కలిదిండి 45.4, కామవరపుకోట 45.3, కొయ్యలగూడెం 45.6, కుక్కునూరు 46.4, లింగపాలెం 45.2, మండవల్లి 45.4, ముదినేపల్లి 45.4, ముసునూరు 46, నిడమర్రు 46, నూజివీడు 45.9, పెదవేగి 46, పెద పాడు 46, పోలవరం 44.4, టి.నరసాపురం 45.2, ఉం గుటూరు 46, వేలేరుపాడు 46, ఏలూరు అర్బన్‌ 46 డిగ్రీల సెం టీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకా శాలున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ముదినేపల్లి/ఏలూరు కార్పొరేషన్‌ : ముదినేపల్లి ప్రాంతంలో సోమవారం ఎండ భగ్గుమంది. ఈ ప్రాంతంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.వేడి గాలులకు ప్రజలు తట్టుకోలేకపోయారు. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ముదినేపల్లి,సింగరాయ పాలెం, వడాలి, అల్లూరు, కొత్తపల్లి, నారాయణపురం సెంటర్లలో వ్యాపార సంస్థలను ఉదయం 11 గంటలకు మూసివేసి సాయంత్రం 5 గంటలకు తిరిగి తెరిచారు. ఏలూరులో ఎండల ధాటికి జన సంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

Updated Date - May 19 , 2026 | 12:57 AM