Share News

మేత మోత వాత

ABN , Publish Date - Jun 14 , 2026 | 01:20 AM

రొయ్యల మేత(ఫీడ్‌)ల ధరలను తయారీ సంస్థలు పెంచే శాయి. వనామీ రొయ్య రకానికి ఉపయోగించే మేతపై కిలోకు రూ.10, టైగర్‌ రొయ్యల మేతపై కిలోకు రూ.12 పెంచడంతో రైతులు ఉలిక్కిప డ్డారు.

మేత  మోత వాత

రైతులను సంప్రదించకుండా.. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా.. కంపెనీల ఏకపక్ష నిర్ణయం

టన్నుకు పది వేలు భారం.. తగ్గుతున్న రొయ్యల ధరలతో సాగు మరింత నష్టం

ధరలపై కలిదిండిలో రైతుల నిరసన.. 16న రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు

మండవల్లి, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి):రొయ్యల మేత(ఫీడ్‌)ల ధరలను తయారీ సంస్థలు పెంచే శాయి. వనామీ రొయ్య రకానికి ఉపయోగించే మేతపై కిలోకు రూ.10, టైగర్‌ రొయ్యల మేతపై కిలోకు రూ.12 పెంచడంతో రైతులు ఉలిక్కిప డ్డారు. ఓ వైపు రైతులతో సంప్రదింపులు కొలిక్కి రాలేదు. మరోవైపు ప్రభుత్వం అనుమతించ లేదు. అయినప్పటికి కంపెనీల ఆకస్మిక నిర్ణ యంతో రైతులకు గుదిబండగా మారనుంది. ఇప్పటికే నష్టాలతో సతమతమవుతున్న రైతులు ప్రభుత్వం రాయితీ విద్యుత్‌పై చర్యలు తీసుకుం టుందన్న ఆనందంపై ఈ పెంపు నీళ్లు చల్లింది.

టన్నుకు రూ.10 వేలు అదనపు భారం

ఇప్పటి వరకు టన్ను రొయ్యల మేత ధర సుమారు రూ.86 వేలు ఉండగా తాజా పెంపు తో అది రూ.96 వేల నుంచి రూ.లక్ష వరకు చేరుతుంది. కిలోకు రూ.10 పెంపు కారణంగా టన్నుపై రైతులకు అదనంగా రూ.10 వేలు భారం పడుతోంది. సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రైతులైతే లక్షల రూపాయల అదనపు వ్య యాన్ని భరించాలి. ఇటీవల మేత కంపెనీలు ధరలు పెంచే ప్రయత్నం చేయగా ప్రభుత్వం జోక్యం చేసుకుని అడ్డుకుంది. మళ్లీ భారీగా ధర లు పెరగడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మేత ధరలు పెరుగుతున్నప్పటికీ మార్కెట్‌లో రొయ్యలకు సరైన ధర లభించడం లేదు. గతంలో 100 కౌంటు రూ.270కు లభించిన ధర ప్రస్తుతం రూ.240కు పడిపోయింది. ఇతర కౌంట్ల రొయ్యల ధరలూ గణనీయంగా తగ్గాయి. ఉత్పత్తి వ్యయం పెరుగుతుండగా, విక్రయ ధర లు తగ్గిపోవడంతో రైతులకు లాభాల మాట పక్కన పెడితే పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే వైట్‌గట్‌, వైరల్‌ ఇన్పెక్షన్లు తది తర వ్యాధులు ఆక్వా సాగును అతలాకుతలం చేస్తున్నాయి. పంట చివరి దశలో వ్యాధులు సో కితే రైతులు భారీ నష్టాలను చవిచూడాల్సి వ స్తోంది. ఈ పరిస్థితుల్లో మేత ధరలు పెరగడం రైతులకు భరించలేని భారంగా మారింది.

అంతర్జాతీయ పరిస్థితులు, ఇరాన్‌, ఇజ్రాయి ల్‌, అమెరికా యుద్ధ వాతావరణం కారణంగా ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం పడు తోంది. విదేశీ మార్కెట్లో డిమాండ్‌ తగ్గడం, కొను గోలు ధరలు పడిపోవడం వల్ల ఎగుమతిదారు లు రైతులకు ఇచ్చే ధరలను తగ్గించడంతో రైతు లకు మరింత నష్టం వాటిల్లుతోంది. వేసవిలో ఐస్‌ కొరతను సాకుగా చూపుతూ కొన్నిచోట్ల సరైన సదుపాయాలు అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రొయ్యల నాణ్యత కాపాడడానికి ఐస్‌ కీలకం. సరఫరాలో సమస్యలు ఏర్పడడం మరింత ఇబ్బందులను గురి చేస్తోంది.

కరెంటు సబ్సిడీ ఆనందం ఆవిరి

ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50కు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతు ల్లో కొంత ఆశ నెలకొంది. ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. విద్యుత్‌ రాయితీ వల్ల కలిగే ప్రయోజనంకన్నా మేత ధరల పెంపుతో అద నపు భారం మరింత ఎక్కువగా ఉండడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు.

ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి

మేత ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రై తు సంఘాలు కోరుతున్నాయి. రొయ్యలకు గి ట్టుబాటు ధర కల్పించడం, ఎగుమతులు ప్రోత్సా హానికి చర్యలు చేపట్టడం, వ్యాధి నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ధరలు పడిపోతే రైతు నష్టపోతా డు. ఖర్చులు పెరిగితే రైతే కుంగిపోతాడు. ఈ రెండు ఒకేసారి ఎదురైతే ఆక్వా మనుగడే ప్రశ్నా ర్థకం అవుతుంది. ఖర్చులు తగ్గించి, గిట్టుబాటు ధరలు కల్పించకపోతే ఈ రంగం మరింత సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

ఆ ఐదుగురి వల్లే పెరిగిన ధరలు: ఎమ్మెల్సీ సోము వీర్రాజు

పాలకోడేరు, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి):‘రా ష్ట్రంలో రొయ్య మేతల ధరలు పెరగడానికి ఆ ఐదుగురు వ్యక్తులే కారణం. వారు ఎవరో అందరికీ తెలుసు. నేను ప్రభుత్వంలో ఉన్నా ను కాబట్టి వారి పేర్లు వెల్లడించను. వీరి విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా’ అంటూ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. గొల్లలకోడేరులో శనివారం ఆక్వా రైతుల సమస్యలపై ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రం లో ఐదుగురు చేతుల్లోనే ఫీడ్‌ కంపెనీలు, హేచరీస్‌, ప్రోసెసింగ్‌ యూనిట్స్‌, ఎక్స్‌పోర్ట్స్‌ ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ ఐదుగురు వ్యక్తులే ఫీడ్‌ ధరలను పెంచే స్తున్నారు. రొయ్య ధర పెరగకుండా ఫీడ్‌ ధరలు ఎలా పెంచుతారు. తాజాగా కేజీ మేతకు రూ.10 ధర పెంచడం దారుణం. రాష్ట్రంలో లాబీయింగ్‌ చేస్తున్న వ్యక్తులను కట్టడి చేయాలి’ అని అన్నారు.

16న రాష్ట్రవ్యాప్త నిరసన : ఆక్వా సంఘం చైర్మన్‌ గొట్టుముక్కల

పాలకొల్లు రూరల్‌ : ‘సిండికేట్‌ అయిన కం పెనీలు ప్రభుత్వ అను మతి లేకుండా రాత్రికి రాత్రే రొయ్యల మేతల ధరలు పెంచేశాయి. దీన్ని ఆక్వా సంఘాలు, రైతులు వ్యతిరేకిస్తు న్నాం’ అని ఆక్వా సంఘం రాష్ట్ర చైర్మన్‌ గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు అన్నారు. పాలకొల్లులో శనివారం ఆక్వా సంఘ ప్రతి నిధులతో కలిసి ఆయన విలేకరులతో మా ట్లాడారు. అప్పడా కమిషనర్‌ను, సంబంధి త మంత్రి అచ్చెన్నాయుడును, ఆక్వా సం ఘాల నేతలను సంప్రదించకుండా ఏకపక్షం గా నిర్ణయం తీసుకోవడంపై మండిపడ్డారు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరిం చుకోకుంటే ఈ నెల 16న ఆక్వా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామని హెచ్చ రించారు. రాష్ట్ర కార్యదర్శి టి.నాగ భూషణం, మేడిద జాన్‌ డేవిడ్‌రాజు, బోనం చినబాబు, రమేష్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

గిట్టుబాటు ధర కల్పించాలంటూ ధర్నా

కలిదిండి : రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ శనివారం భాస్కర రావుపేటలో ఏపీ రైతుల సంఘం ఆధ్వ ర్యంలో ఆక్వా రైతులు ధర్నా చేశారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.బల రామ్‌ మాట్లాడుతూ ఆక్వా మేతలు, మందుల ధరలను తగ్గించి రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆక్వా ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వాలకు వేలకోట్ల విదేశీ మారక ద్రవ్యం వస్తున్నప్పటికీ గిట్టుబాటు ధర లేక ఆక్వా రైతులు నష్టాల ఊబిలో కూరుకుపో తున్నారన్నారు. రైతు సంఘం నాయకులు శేషపు మహంకాళిరావు, వీరవల్లి భాస్కర రావు, డి.వెంకట సత్యనారాయణ, అనిల్‌కుమార్‌, రామనాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2026 | 01:20 AM