పసిడీలా..
ABN , Publish Date - Jun 09 , 2026 | 12:40 AM
సాధా రణంగా బంగారం ధర తగ్గిందంటే చాలు కొనేందుకు పరుగెత్తేవారు.. ఇది ఈ ఏడాది ఆరంభం నాటి సీన్. నేడు ధర తగ్గినా.. మార్కె ట్‌లో జోష్ కనిపించడం లేదు.
మార్కెట్‌లో కానరాని జోష్!
భారీగా పడిపోయిన అమ్మకాలు
ఇదేబాటలోనే వెండి విక్రయాలు..
నరసాపురం, జూన్ 8(ఆంధ్రజ్యోతి):సాధా రణంగా బంగారం ధర తగ్గిందంటే చాలు కొనేందుకు పరుగెత్తేవారు.. ఇది ఈ ఏడాది ఆరంభం నాటి సీన్. నేడు ధర తగ్గినా.. మార్కె ట్‌లో జోష్ కనిపించడం లేదు. అసలు ధర కంటే గ్రాముకు రూ.400 తగ్గించి అమ్ముతున్నా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కారణం ధర ఇంకా తగ్గుతుం దన్న నమ్మకం ఒక్కటైయితే.. ఆర్థిక మాద్యం మరోక్కటి. ఈ కారణంగా 20 రోజుల నుంచి జిల్లాలోని బులి యన్ మార్కెట్‌కు కళ తప్పింది. సోమవారం మార్కెట్‌లో గ్రాము 22 క్యారెట్ల ధర రూ.14, 040 స్ర్కీన్ ధర ఉన్నప్పటికీ వ్యాపారులు రూ.13,650కి అమ్మకాలు జరిపారు. ఇక బిస్కె ట్ బంగారం 24 క్యారెట్లు స్ర్కీన్ ధర రూ.15, 600 ఉండగా రూ.500 తగ్గించి అమ్మినా.. కొనేందుకు కొనుగోలుదారులు అసక్తి చూపించ లేదు. బులియన్ మార్కెట్ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని వ్యాపారులు వాపోతున్నారు.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పసిడి, వెండి ధరలకు హద్దు లేకుండా పోయింది. ఏడాది పాటు దూసు కెళ్లడంతో ఆల్‌టైం రికార్డు ధరలు నమోద య్యాయి. 2025 జనవరిలో గ్రాము 916 బంగా రం రూ.6,600 ఉండగా క్రమంగా పెరు గుతూ రూ.19,200లకు చేరింది. క్రమంగా తగ్గుతూ రూ.14500 దగ్గర స్థిరంగా నిలబడిం ది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధంతో క్రూడ్ ధర పెరగడం, డాలర్‌తో రూపాయి క్షీణించడంతో కేంద్ర ప్రభుత్వం పసిడి దిగుమతులపై పన్ను ను పెంచింది. ఇటు బ్యాంకుల్లో బంగారం రు ణాల మీద కూడా కొత్త నిబంధనలను తీసుకు రావడంతో పసిడి ధర ఒక్కసారిగా తగ్గు ముఖం పట్టింది. అయినా కొనేవాళ్లు కరువ య్యారు. ప్రస్తుతం నిత్యావసర ధరలు పెరగ డం, రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతాయన్న ఊహాగానాలతో చాలామంది పొదుపుబాట పట్టారు. వచ్చే అదాయం ఇంటి ఖర్చులకే సరి పోతున్నాయి. ఇతర వస్తువుల్ని కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ కారణంగా పసిడి అమ్మకాలు జిల్లాలో భారీగా పడ్డాయి.
వెండిది కూడా ఇదే పరిస్థితి. ఒక దశలో కేజీ వెండి రూ.4 లక్షలకు వెళ్లింది. ఈ ధర రూ.10 లక్షలకు చేరుతుందన్న ఊహాగానాలతో చాలామంది అప్పులు తెచ్చి మరీ కొన్నారు. అయితే మళ్లీ వెండి ఆ ధరకు చేరువకాలేదు. ప్రస్తుతం సోమవారం మార్కెట్‌లో కేజీ వెండి రూ.2.48 లక్షలు ఉంది. వ్యాపారులు రూ.5 వేలు తగ్గించి విక్రయిస్తున్నా కొనేందుకు ముం దుకు రావడం లేదు.
ఎన్నడూ ఈ పరిస్థితి చూడలేదు
అంతర్జాతీయంగా వెండి, పసిడికి డిమాండ్ తగ్గింది. దీనికి యుద్దమే కారణం, క్రూడ్ ధర పడటంతో ఆ ప్రభావం పసిడిపై పడింది. సాధారణంగా యుద్దం వస్తే వెండి, బంగారం పెరగాలి,. కానీ ఈసారి రివర్స్ అయ్యాయి. ప్రభుత్వం దిగుమతులపై పన్నులు విధించడం, రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గుతాయన్న ఊహాగానాలు, ప్రస్తుతం ఆన్‌సీజన్ కావడం ధరలు తగ్గుముఖానికి కారణంగా చెప్పవచ్చు.
–వినోద్‌కుమార్ జైన్,
బులియన్ అసోసియేషన్ అధ్యక్షుడు