Share News

ఎగసిన మంటలు.. పూళ్లలో నిలిచిన రైళ్లు

ABN , Publish Date - May 27 , 2026 | 12:48 AM

రైతులు తమ పంటను కోసి దుబ్బులను తగలబెట్టే ప్రయత్నంలో మంటలు రైల్వే హైటెన్షన్‌ వైర్ల వరకు ఎగసిపడడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు.

ఎగసిన మంటలు.. పూళ్లలో నిలిచిన రైళ్లు

పూళ్ల రైల్వే ట్రాక్‌ వద్ద మంటలు

అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

తాడేపల్లిగూడెం రూరల్‌, మే 26(ఆంధ్రజ్యోతి):రైతులు తమ పంటను కోసి దుబ్బులను తగలబెట్టే ప్రయత్నంలో మంటలు రైల్వే హైటెన్షన్‌ వైర్ల వరకు ఎగసిపడడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం భీమడోలు, పూళ్ల రైల్వేస్టేషన్ల సమీపంలో ఈ ఘటనలు మంగళవారం సాయంత్రం జరిగాయి. ఈ రెండు స్టేషన్ల సమీపంలో కొందరు రైతులు పంటను కోసిన తర్వాత మిగిలిన చెత్త, దుబ్బులకు మంట పెట్టారు. ఇవి దావానలంలా వ్యాపించారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు అటు పూళ్ల, తాడేపల్లిగూడెం స్టేషన్లలో అరగంటకు పైగా నిలుపుదల చేశారు. ఈలోగా తాడేపల్లిగూడెం అగ్నిమాపక సిబ్బంది వేర్వేరుగా శ్రమించి మంటలు అదుపు చేశారు. పూళ్ల స్టేషన్‌లో రత్నాచల్‌, ప్రశాంతి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లను నిలుపుదల చేసినట్టు స్టేషన్‌ మాస్టర్‌ బెనయ్‌ తెలిపారు. పరిస్థితి చక్కబడిన తర్వాత రైళ్లను పంపించినట్లు చెప్పారు.

Updated Date - May 27 , 2026 | 12:48 AM