Share News

స్త్రీ శక్తి రూటు మళ్లింది

ABN , Publish Date - Jun 24 , 2026 | 12:32 AM

ఆర్టీసీ నూజివీడు డిపోలో రెండు ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను అలా్ట్ర డీలక్స్‌ సర్వీసులుగా మార్పు చేశారు.

స్త్రీ శక్తి రూటు మళ్లింది
ఆర్టీసీ ఏలూరు డిపో వద్ద ధర్నా చేస్తున్న ఉద్యోగులు

మహిళల ఉచిత ప్రయాణానికి బ్రేక్‌

సిబ్బంది కొరత సాకుతో ప్రభుత్వ పథకానికి తూట్లు

నూజివీడు టౌన్‌, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ నూజివీడు డిపోలో రెండు ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను అలా్ట్ర డీలక్స్‌ సర్వీసులుగా మార్పు చేశారు. దీంతో విజయవాడ, గుంటూ రు, నర్సారావుపేట, వినుకొండ, యర్రగొండపా లెం వంటి దూర ప్రాంతాలకు వెళ్లే మహిళల కు ఉచిత ప్రయాణ సౌకర్యానికి బ్రేక్‌ పడింది. నూజివీడు డిపో నుంచి యర్రగొండపాలెంకు ఏడు ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు ఉన్నాయి. విజయ వాడ, గుంటూరు, పల్నాడు, ఎర్రగొండపాలెం వంటి దూర ప్రాంతాలకు వెళ్లే మహిళలకు ఈ సర్వీసులు సౌకర్యవంతంగా ఉండేవి. ఇటీ వల నూజివీడు డిపో అధికారులు తెల్లవారు జామున 5.50 గంటలకు, మధ్యాహ్నం 3 గం టలకు యర్రగొండపాలెం వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను అలా్ట్ర డీలక్స్‌ సర్వీసులు గా మార్చడంతో మహిళలకు ఉచిత ప్రయా ణం నిలిచిపోయింది. మరో సర్వీస్‌ను సైతం మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తు న్నారు. కండక్టర్ల కొరత సాకుతో అలా్ట్ర డీలక్స్‌లుగా మార్చి మహిళలకు ఉచిత ప్ర యాణం దూరం చేశారు. నూజివీడు డిపోలో కండక్టర్లకు అసిస్టెంట్‌ డిపో క్లర్క్‌ గ్యారేజ్‌ సూపర్‌వైజర్‌ బాధ్యతలు అదనంగా అప్పగించడం సర్వీసు మార్పులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

వరుస ప్రమాదాలు..!

నూజివీడు ఆర్టీసీ బస్‌ డిపో బస్సులు నెల రోజులు మూడు ప్రమాదాలకు గురయ్యాయి. ఇటీవల ముసునూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురికాగా, 3 రోజుల క్రితం పల్లె వెలుగు బస్సు వట్టిగూడెం సమీపంలో విద్యుత్‌ స్తంభాన్ని, 2 రోజుల క్రితం శ్రీశైలం వెళ్తున్న బస్సు త్రిపురాంతకం వద్ద చెట్టును ఢీకొంది. డిపోలో బస్సుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, కాలం చెల్లిన బస్సులను సూపర్‌ డీలక్స్‌లుగా నడపడం, మరోవైపు సిబ్బందిపై పని ఒత్తిడితో వరుస ప్రమా దాలకు కారణం అవుతుందని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన శ్రీశైలం సర్వీస్‌ డ్రైవర్‌ అదే రోజు ఒంటి గంటకు ఎర్రగొండపాలెం సర్వీస్‌ దిగి డబుల్‌ డ్యూటీగా శ్రీశైలం సర్వీస్‌కు వెళ్లడంతో కనీస విశ్రాంతి లేని పరిస్థితుల్లో బస్సు ప్రమా దానికి గురైందని తెలుస్తోంది. మరోవైపు యూనియన్‌ నాయకులు కొందరు యూనియన్‌ బాధ్యతల పేరుతో విధులకు గైర్హాజరవ్వడంతో ఉన్న వారిపైనే అదనపు భారం పడుతోంది.

సిబ్బంది కొరత ఉంది : డీఎం ధనాంజనేయులు

ఎర్రగొండపాలెం ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు రెండిటిని అలా్ట్ర డీలక్స్‌లుగా అప్‌గ్రేడ్‌ చేశాం. నూతన ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు నడిపేందుకు సరిపడా సిబ్బంది లేరు. 15 మంది కండర్టర్లు అవసరం ఉంది. పల్లె వెలుగు బస్సుల కొరత ఉంది. దీనిని అధిగమించేందుకు డామేజ్‌ అయిన అలా్ట్ర డీలక్స్‌ బస్సులను పల్లె వెలుగులుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - Jun 24 , 2026 | 12:32 AM