కొల్లేరు కుదింపు?
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:29 AM
కొల్లేరు సరస్సు నుంచి వన్యప్రాణి అభయారణ్య కుదింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అభయారణ్యం నుంచి 20 వేల ఎకరాల మినహాయించాలి
కేంద్ర కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
కుదింపుపై మంత్రివర్గం తీర్మానం
జిరాయితీ, పట్టా భూములకు మోక్షం!
కేంద్రం సానుకూల నిర్ణయం కోసం
కొల్లేటివాసుల ఎదురుచూపులు
కొల్లేరు సరస్సు నుంచి వన్యప్రాణి అభయారణ్య కుదింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొల్లేరునే నమ్ముకుని జీవిస్తున్న పేదలకు అనుకూలంగా 20వేల ఎకరాల జిరాయితీ, డి పట్టా భూములను అభయారణ్యం నుంచి మినహాయించాలని కేంద్ర సాధికార కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కొత్తగా సరిహద్దులను నిర్థారించేందుకు అనుమతిని ఇవ్వాలని కోరింది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నిర్ణయంపైనే కొల్లేటి ప్రజల భవితవ్యం ఆధారపడి ఉంది.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
కొల్లేరు అభయారణ్య పరిధిలో 77,178 ఎకరాలను గుర్తిస్తూ 1999లో అప్పటి ప్రభుత్వం 120 జీవోను విడుదల చేసింది. ఈ భూములు వ్యవసాయానికి అనువుగా లేవనే కారణంతో జిరాయితీ, సొసైటీలు, డి పట్టాభూముల్లోనే జలగం వెంగళరావు సీఎంగా ఉన్నప్పుడు చెరువులను తవ్వించారు. 2006 కొల్లేరు ఆపరేషన్‌తో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఈ కొన్ని చెరువులను ధ్వంసం చేశారు. దాదాపు 20 ఏళ్లకు పైబడే కొల్లేరు అభయారణ్యం నుంచి కాం టూరు కుదించాలని, అప్పుడే జిరాయితీ, డి పట్టా, ఇతర భూములకు విముక్తి లభిస్తుందని 136 గ్రా మాల ప్రజలు ఆందోళన చేపట్టారు. తమకు అర ఎకరం చొప్పున కేటాయించాలని కూడా పేదలు కోరారు. అప్పటిల్లో లక్ష మంది జనాభా ఉండగా ఇప్పుడు మూడు లక్షలకు పైగా పెరిగారు. ప్రభుత్వం రాసిన లేఖ మేరకు కొల్లేరు సరస్సులో పక్షుల అభయారణ్యానికి 57,138 ఎకరాలను కొనసాగిస్తూ, 20వేల ఎకరాలను మినహాయించాల్సి ఉంటుంది.
సాధికారిక కమిటీ పర్యటనతో..
గత ఏడాది జూలైలో పర్యటించిన కేంద్ర సాధి కారిక కమిటీకి కొల్లేరు ప్రజలు వినతులు అందజే శారు. ఇదిలా ఉండగా గత ఏడాది డిసెం బరు 19న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన కొల్లే రు సరస్సు అథారిటీ తొలి సమావేశంలో అభయార ణ్య సరిహద్దులపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఎన్ బీడబ్ల్యూఎల్ స్థాయి సంఘం సమావేశం సిఫార్సులు అమలుపై తదుపరి చర్యలు తీసుకోవడానికి సాధ్యా సాధ్యాలను ప్రభుత్వ స్థాయిలో పరిశీలించాలని కమి టి తీర్మానించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న జరిగిన కొల్లేరు అఽథారిటి రెండో సమావేశంలో ఇదే నిర్ణయా న్ని వెలువరించింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కారంపై దృష్టి సారించిన ప్రభు త్వం కొల్లేరు సరస్సు అఽథారిటీ సమావేశంలోని నిర్ణయాలకు అనుగుణంగా 20వేల ఎకరాలను మిన హాయించాలని, ఫిబ్రవరి 24న రాష్ట్ర మంత్రి వర్గంలో తీర్మానించారు. దానికి అనుగుణంగానే అటవీశాఖ, సాధికారిక కమిటీకి లేఖ రాసినట్లు సమాచారం.
శుభ పరిణామం
కొల్లేరు అభయారణ్య పరిధి 77,138 ఎకరాల్లో 20 వేల ఎకరాల మినహాయింపు కోరడం శుభ పరిణామం. అప్పట్లో జనాభా లక్షమంది కాగా ప్రస్తుతం 4 లక్షల మంది ఉన్నారు. మినహాయింపు భూముల్లో 14,500 ఎకరాలు పట్టా భూములే ఉన్నాయి. 1976 నుంచి 136 సొసైటీల సాగులో 5,500 ఎకరాలు ఉంది. ఇది 136 గ్రామాలకు పంచాల్సి ఉంటుంది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రజల పక్షాన ఆలోచించి పేదలకు ఎకరం, అర ఎకరం కేటాయించేలా చర్యలు చేపట్టాలి.
– సైదు సత్యనారాయణ, అధ్యక్షుడు, కొల్లేరు వ్యవసాయ, మత్య్యకారుల సంఘం
కొల్లేరు ప్రజలకు మేలు
కొల్లేరు అభయారణ్యం నుంచి 20 వేల ఎకరాలను మినహాయించాలని ప్రభుత్వం లేఖ రాయడం హర్షణీయం. ఏళ్ల తరబడి కొల్లేరు ప్రజలు ఎదురుచూస్తున్నట్లు ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకుంది. మొదటి నుంచి కొల్లేరు ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటామని ఇచ్చిన హామీ మేరకు కమిటీకి సిఫార్సు చేయడం మంచి పరిణామం అన్నారు. కొల్లేరు ప్రజల తరపున ఏ ప్రభుత్వం చేయనటువంటి పనులను చేసి ప్రజలను ఆదుకుంటుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ప్రజలంతా రుణపడి ఉంటారు.
–బలే ఏసురాజు, కొట్టాడ, కైకలూరు మండలం
సీఈసీ నిర్ణయమే..
2018లో సీఈసీ 20వేల ఎకరాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అప్పటి వైసీపీ ప్రభుత్వం అశ్రద్ధ చేసింది. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి అభయారణ్యం కుదింపై లేఖ రాయడంతో మార్గం సుగమం అయింది. జిరాయితీ పట్టా భూముల ప్రజలకు మేలు జరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు అవగాహనతో సరైన నిర్ణయం తీసుకున్నారు. అందువలనే ప్రజలకు మేలు జరుగుతుంది. త్వరితగతిన సీఈసీ సుప్రీంకోర్టుకు అందజేసి ప్రజలకు మేలు చేసేలా చూడాలి.
– నంబూరి వెంకటరామరాజు, తాడినాడ