Share News

వేదాలు, ఉపనిషత్తులు భారతీయ సంస్కృతికి చిహ్నాలు

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:09 AM

ప్రాచీన భారతీయ సాహిత్యం– వ్యక్తిత్వవికాసం’ అంశంపై భారతీయ భాషల కేంద్ర సంస్థ(సీఐఐఎల్‌) సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ స్టడీస్‌ ఇన్‌ క్లాసికల్‌ తెలుగు సౌజన్యంతో స్థానిక సెయింట్‌ థెరిస్సా మహిళా కళాశాలలో జరిగిన రెండురోజుల అంతర్జాతీయ సమావేశం శుక్రవారం ముగిసింది.

వేదాలు, ఉపనిషత్తులు భారతీయ సంస్కృతికి చిహ్నాలు
సమావేశంలో మాడభూషి సంపత్‌కుమార్‌, తోటకూర ప్రసాద్‌ తదితరులు

ముగిసిన ప్రాచీన భారతీయ సాహిత్య అంతర్జాతీయ సమావేశం

ఏలూరుఅర్బన్‌,జనవరి9(ఆంధ్రజ్యోతి):‘ప్రాచీన భారతీయ సాహిత్యం– వ్యక్తిత్వవికాసం’ అంశంపై భారతీయ భాషల కేంద్ర సంస్థ(సీఐఐఎల్‌) సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ స్టడీస్‌ ఇన్‌ క్లాసికల్‌ తెలుగు సౌజన్యంతో స్థానిక సెయింట్‌ థెరిస్సా మహిళా కళాశాలలో జరిగిన రెండురోజుల అంతర్జాతీయ సమావేశం శుక్రవారం ముగిసింది. ప్రాచీనభాషా విశిష్ట అధ్యయన కేంద్రం(నెల్లూరు) ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ మాడభూషి సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, నైతిక విలువలు, ధర్మం, కర్తవ్యం, ఇంద్రియ నిగ్రహం, అతిథి సత్కారం భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలకు నిదర్శనమన్నారు. విజయనగరం జిల్లా తగరపువలస ప్రభుత్వ డిగ్రీ కళాశాల హెచ్‌వోడీ అయ్యగారి సీతా రత్నం మాట్లాడుతూ మహాభారత, రామాయణంలో వ్యక్తిత్వ వికాసా నికి సంబంధించిన ఎన్నో విషయాలున్నాయన్నారు. ఉత్తర అమెరికా తెలుగు అసోసి యేషన్‌ (తానా) మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ తోటకూర ప్రసాద్‌, తమిళనాడు సెంట్రల్‌ యూనివర్సిటీ హెచ్‌వోడీ డాక్టర్‌ రాజు మాట్లాడారు. అనంతరం ప్రిన్సిపాల్‌ సిస్టర్‌ మెర్సీ మాట్లాడుతూ రెండురోజుల అంతర్జాతీయ సమావేఽశానికి దేశ, విదేశాలనుంచి హాజరైన విద్యావేత్తలు, ప్రముఖులు, పలు అంశాలపై జరిపిన చర్చలు ఫలప్ర దమ య్యాయన్నారు. అవధాని, ప్రవచనకర్త మైలవరపు లక్ష్మీనరసింహ, తెలుగు హెచ్‌వోడీ, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ మహాలక్ష్మి, రచయిత రాధిక మంగిపూడి(సింగపూర్‌), ఇందిరా సంధ్య(హైదరాబాద్‌), డాక్టర్‌ బందనా చంద్‌(ఉత్తరాఖండ్‌), డాక్టర్‌ వర్షారాణి(ఆగ్రా), డాక్టర్‌ నరేష్‌కుమార్‌ సెహవాగ్‌ (బిహార్‌), తదితరులు మాట్లాడారు.

Updated Date - Jan 10 , 2026 | 12:09 AM