ఏలూరులో ఎస్ఆర్ షాపింగ్‌మాల్ పునఃప్రారంభం
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:42 AM
ఆంధ్రప్రదేశ్ వస్త్ర రంగంలో పేరొందిన ఎస్.ఆర్.షాపింగ్‌మాల్ బుధవారం పట్టణంలోని ఆర్.ఆర్.పేటలో ఘనంగా పునఃప్రారంభమైంది.
ఏలూరు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ వస్త్ర రంగంలో పేరొందిన ఎస్.ఆర్.షాపింగ్‌మాల్ బుధవారం పట్టణంలోని ఆర్.ఆర్.పేటలో ఘనంగా పునఃప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ పుట్టా మహేష్, సినీ నటి రితికానాయక్, హైకోర్టు అడ్వకేట్ బార్ కౌన్సిల్ మెంబర్ బీవీ కృష్ణారావు హాజరయ్యారు. మాల్‌ను ఎంపీ మహేశ్ చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరులో ఇలాంటి షోరూమ్ ఏర్పాటు కావడం వల్ల పలువురికి ఉపాధి లభిస్తుందన్నారు. అంతేగాకుండా ఇది బెస్ట్ షాపింగ్ ప్రాంతం అన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన సినీ నటి రితికా నాయక్ మాట్లాడుతూ ఎస్.ఆర్.షాపింగ్ మాల్లో వెరైటీస్ చాలా ఉన్నాయన్నారు. ఈ ఫెస్టివల్ సీజన్లో ఆఫర్స్‌ను మిస్ చేసుకోవద్దన్నారు. లేటెస్ట్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయన్నారు. సంస్థ ఎండీ గోపినాథ్‌రెడ్డి మాట్లాడుతూ తమ 21 సంవత్సరాల అనుభవంతో ఆంధ్రప్రదేశ్‌లో 16 షోరూమ్‌లు ప్రారంభించామన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో మరిన్ని షోరూమ్‌లు ప్రారంభించనున్నట్టు తెలిపారు.