Share News

పట్టణాల్లో ప్రత్యేక పాలన

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:21 AM

మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఈ నెల 16తో ముగియనుంది. వీరి స్థానంలో ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

పట్టణాల్లో ప్రత్యేక పాలన

మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారుల నియామకం

ముగియనున్న పాలకవర్గాల గడువు

జంగారెడ్డిగూడెం, నూజివీడు స్పెషల్‌ ఆఫీసర్లుగా జేసీ, సబ్‌ కలెక్టర్‌

18న బాధ్యతల స్వీకారం

మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఈ నెల 16తో ముగియనుంది. వీరి స్థానంలో ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జంగారెడ్డి గూడెంకు జేసీ అభిషేక్‌ గౌడ, నూజివీడుకు సబ్‌ కలెక్టర్‌ వినూత్న ఈ నెల 18న ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు స్వీకరిస్తారు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఈనెల 16తో ముగియనుంది. ఈ నెల 18 నుంచి ప్రత్యేక అధికారు లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. జిల్లాలో చింతలపూడి నగర పంచాయతీకి ఎన్నిక జరగకపోవడంతో అక్కడ జంగారెడ్డిగూడెం ఆర్డీవో ప్రత్యేకాధికారిగా కొనసాగుతున్నారు. ఏలూరు నగర కార్పొరేషన్‌ పాలకవర్గం పదవీ కాలం సెప్టెంబర్‌ వర కు ఉంది. జంగారెడ్డిగూడెం, నూజివీడు పురపాలక సంఘాల గడువు ముగియనుంది. జంగారెడ్డిగూడెం గ్రేడ్‌–1 మునిసిపాల్టీగా ఇటీవల వర్గోన్నతి చెందింది. ఇక్కడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా బత్తిన నాగలక్ష్మి (వైసీపీ) ఉన్నారు. నూజివీడు గ్రేడ్‌–2 మున్సిపాల్టీ చైర్‌పర్సన్‌గా రామిశెట్టి త్రివేణి దుర్గ(వైసీపీ) ఉన్నారు. కాగా ఈ నెల 17న పురపాలక సంఘాల పాలకవర్గాల కాలపరిమితి ఐదేళ్లు పూర్తి అవుతోంది.

ఎన్నికలకు ఎదురుచూపులు

మున్సిపల్‌ ఎన్నికలకు ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్‌పైనే ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. వాస్తవానికి మార్చి తొమ్మిదో తేదీన మున్సిపాలిటీల ఓటర్ల జాబితాను ప్రచురించాల్సి ఉంది. ఎన్నికల సంఘం ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్‌ల ఖరారులో జాప్యం జరుగుతుం దన్న ఉద్దేశంతో ఓటర్ల జాబితా ప్రచురణ ఉత్తర్వు లను రద్దు చేశారు. నిజానికి గతంలో వార్డుల సరిహ ద్దులను ఎన్నికల సంఘం కోరింది. విలీన గ్రామాలను మినహాయించి పాతవార్డుల ఆధారంగానే హద్దులను నిర్ధారించి ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల నుంచి అదే తరహాలో నివేదిక వెళ్లింది. ఓటర్ల జాబితాను కూడా పాత వార్డుల ప్రకారమే ప్రకటించాలని మున్సిపల్‌ అధికారు లు సన్నాహాలు చేసుకున్నారు. అంతలో ఎన్నికల సంఘం తమ ఆదేశాలను వెనక్కు తీసుకోవడంతో ఓటర్ల జాబితా ప్రకటన వాయిదా పడింది. మరోవైపు విలీన గ్రామాలకు ప్రత్యేకంగా మార్చి 18న జాబితా ప్రకటించడానికి సంబంధిత పంచాయతీల్లో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మున్సిపాలిటీలు సైతం విలీన గ్రామాలను మినహాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటిదాకా పంచాయతీలే ఆస్తిపన్ను వ సూలు చేసుకున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ నాటికి విలీన సమస్య ఒక కొలిక్కి రానుంది. తాజాగా అన్ని కోణాల్లోనూ కూటమి శ్రేణుల్లో చర్చ సాగుతోంది. పొత్తులో ఏ మున్సిపాలిటీలో ఏ పార్టీ ఖాతాలో చేరనుందోనని అందరిలో ఉత్సుకత నెలకొంది. వైసీపీ మాత్రం సంస్థాగతంగా ఇబ్బందులు పడుతోంది. నియోజకవర్గ నాయకత్వ మార్పులు, చేర్పులతో మల్లగుల్లాలు పడుతోంది.

జంగారెడ్డిగూడెంకు జేసీ అభిషేక్‌

నూజివీడుకు సబ్‌ కలెక్టర్‌ వినూత్న

పురపాలక సంఘాల్లో ప్రత్యేకాధికారులు కొలువు తీరనున్నారు. ఆరు నెలలు పాటు ప్రత్యేకాధికారుల పాలనకు అవకాశం కల్పిస్తూ పురపాలకశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జంగారెడ్డిగూడెం స్పెష ల్‌ ఆఫీసర్‌గా జాయింట్‌ కలెక్టర్‌ ఎంజే అభిషేక్‌ గౌడ, నూజివీడు స్పెషలాఫీసర్‌గా సబ్‌ కలెక్టర్‌ బొల్లేపల్లి వినూత్న నియమితుయ్యారు. వారు ప్రత్యేకాధికారులుగా ఈ నెల 18న బాధ్యతలను స్వీకరించనున్నారు.

Updated Date - Mar 11 , 2026 | 12:21 AM