పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:33 PM
:కార్తీకమాసాన్ని పురస్క రించుకుని పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్ధం ఏపీఎస్‌ఆర్టీసీ జంగా రెడ్డిగూడెం డిపో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
జంగారెడ్డిగూడెం రూరల్, నవంబరు 13, (ఆంధ్రజ్యోతి):కార్తీకమాసాన్ని పురస్క రించుకుని పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్ధం ఏపీఎస్‌ఆర్టీసీ జంగా రెడ్డిగూడెం డిపో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా పంచా రామ క్షేత్రాల దర్శనానికి ప్రతి ఆదివారం ప్రత్యేక బస్సును నడపనున్నట్లు డిపో అధికారులు తెలిపారు.ఈనెల 15, 22, 29 తేదీలతో పాటు డిసెంబరు 6వ తేదీ రాత్రి 8:45 గంటలకు జంగారెడ్డిగూడెం బస్టాండ్ నుంచి అలా్ట్ర డీలక్స్ బస్సు బయ లుదేరుతుంది. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పంచా రామ క్షేత్రాలను దర్శించుకునేలా యాత్రను రూపొందించారు. దీనికి గాను ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించారు. అలాగే కార్తీకమాసంలో ప్రతి శుక్ర, ఆది వారాల్లో రాత్రి 8 గంటలకు అన్నవరం వెళ్లే భక్తుల కోసం బస్సులు నడపనున్నారు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం అద్దె ప్రాతిపదికన ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్టు డిపో ఇన్‌చార్జి మేనేజర్ పి.వరలక్ష్మి తెలిపారు. మరిన్ని వివరాల కోసం డిపో మేనేజర్ 99592 25489, అసిస్టెంట్ మేనేజర్ 94929 49350, బస్టాండ్ ఎంక్వైరీ 08821 223228, రిజర్వేషన్ కౌంటర్ 83411 34111 నెంబర్‌లను సంప్రదించాలని కోరారు.