ఓపీఎస్ ఉద్యోగుల పీఎఫ్ సమస్యను 15 రోజుల్లోగా పరిష్కరించండి
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:43 AM
కొత్తజిల్లాల ఏర్పాటులో కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లాలో కలసిన పంచాయతీరాజ్‌శాఖ ఓపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రావి డెంట్ ఫండ్ ఖాతాల సమస్యను 15 రోజుల్లోగా పరిష్కరించాలని ఏపీ పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కాంతీలాల్ దండే ఆదేశించారు.
కలెక్టర్, సీఈవోలకు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆదేశం
ముదినేపల్లి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): కొత్తజిల్లాల ఏర్పాటులో కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లాలో కలసిన పంచాయతీరాజ్‌శాఖ ఓపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రావి డెంట్ ఫండ్ ఖాతాల సమస్యను 15 రోజుల్లోగా పరిష్కరించాలని ఏపీ పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కాంతీలాల్ దండే ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జడ్పీ సీఈవో జగదాంబతో ఫోన్‌లో మాట్లాడి నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యపై జిల్లా అధికారులు చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. జడ్పీ పీఎఫ్ బాధిత ఉద్యోగుల కైకలూరు నియోజకవర్గ కమిటీ నాయకులు గొట్టిపాటి రమేష్, బేతాళ రాజేంద్ర ప్రసాద్, సభ్యులు దండే వెంకటరత్నం, దండే బెనర్జీ తదితరులు ప్రిన్సిపల్ కార్యదర్శి కాంతీలాల్‌ను సోమవారం రాష్ట్ర సచివాలయంలో కలసి ఓపీఎస్ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల సమస్యను వివరించి మెమొ రాండం అందజేశారు. దీనిపై స్పందించిన ప్రిన్సిపల్ కార్యదర్శి సమస్య పరిష్కారంలో కృష్ణా, ఏలూరు జిల్లాల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు.