Share News

అద్దెలు రావు.. అప్పులు తీరవు!

ABN , Publish Date - Jul 20 , 2026 | 12:11 AM

వైసీపీ అనాలోచిత నిర్ణయం కారణంగా సహకార గొడౌన్లపై ఆదాయం రాకపోగా... వాటి బకాయిలే పలు సొసైటీలకు గుదిబండ లుగా మారాయి

అద్దెలు రావు.. అప్పులు తీరవు!

అక్కరకు రాని సహకార గొడౌన్లు

వినియోగంలో 14.. నిరుపయోగంగా 16

సొసైటీలకు గుదిబండగా బకాయిలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

వైసీపీ అనాలోచిత నిర్ణయం కారణంగా సహకార గొడౌన్లపై ఆదాయం రాకపోగా... వాటి బకాయిలే పలు సొసైటీలకు గుదిబండ లుగా మారాయి. జిల్లా లో 30 గొడౌన్లు నిర్మించగా, 14 గొడౌన్లను గతిలేక సొసైటీలు వివిధ సామగ్రిని నిల్వ ఉంచు కుంటున్నాయి. 16 చోట్ల దారీతెన్ను, పలు మౌలిక వసతు లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. వీటిని అద్దెల కిచ్చేందుకు సహకారశాఖ చేపట్టిన కసరత్తులు కొలి క్కిరాలేదు. దీంతో అటు అద్దెలు రాక.. ఇటు అప్పులు తీరక సంకటస్థితిలో సొసైటీలు కొట్టుమిట్టాడుతున్నాయి.

జిల్లాలో కోట్లు వెచ్చించి నిర్మించిన సహకార గొడౌన్లు అక్కరకు రాక నిరుపయోగంగా పడి ఉన్నా యి. నెలలు గడుస్తున్నా రైతులకు ఉపయోగంలోకి రానంటున్నాయి. ఆదాయం రాకపోగా ప్రాఽథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (సొసైటీ)లకు ఇవి భారంగా పరిణమించాయి. మొదట విడతలో సొసైటీల పరిధిలో బహుళ ప్రయోజనాలు సౌకర్య గొడౌన్‌ (ఎంపీఎఫ్‌సీ) కింద 44 మంజూరు చేయగా కేవలం 30 మాత్రమే నిర్మించగలిగారు. వీటిల్లో వెయ్యి మెట్రిక్‌ టన్నుల గొడౌన్ల నిర్మాణానికి ఒక్కొ దానికి రూ.80 లక్షల వరకు ఖర్చు అయ్యింది. 500 మెట్రిక్‌ టన్నుల గొడౌన్‌లు కొన్నిఉండగా ఒక్కొ దానికి రూ.40 లక్షల వ్యయం చేశారు. మొత్తంగా 20 వేల మెట్రిక్‌ టన్నుల వివిధ పంట ఉత్పత్తుల నిల్వ చేసుకునే సామర్థ్యం ఇవి కలిగి ఉన్నాయి. గొడౌన్‌ పక్కనే పంట ఉత్పత్తులు ఆరబోసుకునేందుకు కల్లాలను రూ. ఐదు లక్షలు వ్యయం చేసి నిర్మింప చేశారు. జిల్లా సహకార కేంద్రబ్యాంకు సహకారం, నాబార్డు రుణాలతో ఈ గొడౌన్‌లు నిర్మించారు.

అలంకారప్రాయంగానే ..

జిల్లాలో 14 గొడౌన్లనే సొసైటీలు వినియోగిస్తుం డగా 16 గొడౌన్లు నిరుపయోగంగా ఉన్నాయి. ముందుచూపు లేకుండా గత వైసీపీ ప్రభుత్వం తీసు కున్న చర్యల వల్ల బహుళ ప్రయోజనాలకు నిలయం గా ఉండాల్సిన గొడౌన్‌లు అలంకారప్రాయంగా మారాయి. చాలాచోట్ల వీటిని ఊర్లకు దూరంగా నిర్మించడంతో ప్రహారీలు లేకపోవడం శాపంగా పరిణిమించింది. విద్యుత్‌, నీరు, రోడ్డు సౌకర్యాలు లేక అద్దెకు తీసుకోవడానికి ఎవ్వరు ముందుకు రావడం లేదు. చిన్నపాటి వర్షం వస్తే కొన్ని గొడౌన్లు ఉన్న ప్రాంతాలు ముంపునకు గురయ్యే దుస్థితి. మరికొన్నింటికి వెళ్లే మార్గం లేదు. మౌలిక వసతులు కల్పించాలంటే రూ.కోట్లు నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. నిధులు సమకూర్చి పనులు పూర్తి చేసి వాటిని ఎలా ఉపయోగంలోకి తేవాలో తెలియక అఽధికారులు తలలు పట్టుకుంటున్నారు. చాలా చోట్ల నిర్వహణ లేక గొడౌన్లు చుట్టూ ముళ్లచెట్లు పెరిగి అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. గొడౌన్లకు ఇచ్చిన రుణాల్లో పైసా తిరిగి సొసైటీలు చెల్లించలేదు. దీంతో బకాయిలు వాటికి భారంగా మారాయి. ఫలి తంగా ఎన్‌పీఏ శాతం భారీగా పెరిగిపోతోంది.

కొన్నిచోట్ల సౌకర్యాలు కల్పించాలి

జిల్లాలో 16 చోట్ల ఖాళీగా ఉన్న గొడౌన్లను విని యోగంలోకి తేవడానికి సివిల్‌ సప్లయ్స్‌ అధికారు లతో సంప్రదింపులు జరుపుతున్నాం. కొన్నిచోట్ల రోడ్లు, విద్యుత్‌, ఇతర సౌకర్యాలు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులున్నాయి. వాటిని అధిగమించి సొసైటీ గొడౌన్లు అద్దెలకు ఇచ్చేలా చర్యలు తీసు కుంటాం.

– ఆరిమిల్లి శ్రీనివాస్‌, డీసీవో

Updated Date - Jul 20 , 2026 | 12:11 AM