Share News

మంచు గండం!

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:53 AM

ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో ఒకప్పుడు చిన్న సన్నకారు రైతు లు సైతం మామిడి, జీడి మామిడి, పండ్ల తోటల పెంపకం చేపట్టేవారు.

మంచు గండం!

అధిక వర్షాల కారణంగా ఆలస్యంగా పూతలు

మంచు ప్రభావంతో తెగుళ్లు, పురుగుల దాడి

నివారణకు రసాయనాల పిచికారీ.. పెరుగుతున్న పెట్టుబడులు

ఇప్పటికే జిల్లాలో భారీగా తగ్గిన సాగు విస్తీర్ణం.. ప్రత్యామ్నాయ పంటలకు మరలిన రైతులు

అందరికీ తీపిని పంచే మామిడి పంటను పండించే రైతుకు మాత్రం చేదే మిగులుతోంది. ప్రకృతి వైపరీత్యా లు, తెగుళ్లు, సాగుభారం, దిగు బడులు, ధరల్లో ఒడిదుడుకులు తదితర కారణాలతో సాగు చేసేం దుకు రైతులు వెనుకడుగు వేస్తు న్నారు. ఒకప్పుడు జిల్లాలో లక్షల ఎకరాల్లో జరిగిన మామిడి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిది. జీడి మామిడిది ఇదే పరిస్థితి. మరోవైపు ఈ ఏడాది ఇప్పటికే ఆలస్యమైన పూతలపై మంచు ప్రభావం ఎక్కు వగా ఉండడంతో దిగుబడులపై రైతులు ఆందోళన చెందుతున్నారు.

జంగారెడ్డిగూడెం రూరల్‌/జీలుగుమిల్లి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో ఒకప్పుడు చిన్న సన్నకారు రైతు లు సైతం మామిడి, జీడి మామిడి, పండ్ల తోటల పెంపకం చేపట్టేవారు. పెద్దగా ఆదా యం లేకపోవడంతో గత ఇరవై ప్రత్యా మ్నాయ పంటలైన పొగాకు, మిర్చి, వేరు శెనగ, మొక్కజొన్న,పామాయిల్‌ సాగు ఉపం దుకుంది. అందుకు తగ్గట్టుగా పంటల యాజ మాన్యంలో నూతన పద్ధతులు అందు బాటు లోకి రావడంతో జీడి, మామిడి సాగు తగ్గిం ది. జిల్లాలో 36,686 ఎకరాల్లో మామిడిసాగు చేస్తున్నారు. నూజివీడు, ముసునూరు, చాట్రాయి, ఆగిరిపల్లి ప్రాంతాల్లోనే దాదాపు 80 శాతం సాగు జరుగుతుండగా మిగిలిన 20 శాతం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మామిడి పంటను పండిస్తున్నారు. ప్రస్తు తం జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, వేలేరు పాడు మండలాల్లో ఆరువేల ఎకరాల్లో జీడి మామిడి పంట సాగులో ఉంది.

మంచుతో ముప్పు

గత పదిహేను రోజుల నుంచి నిత్యం ఉదయం విపరీతంగా మంచు కురుస్తోంది తేనె మంచు ప్రభావంతో ఇప్పటికే పూత దశలో ఉన్న మామిడి, జీడిమామిడి చెట్లు వారం రోజులుగా కొంత మార్పు కన్పిస్తోం దని రైతులు వాపోతున్నారు. పూత నిలబడి పిందెలు కాస్తే తప్ప ఉన్నట్టుండి పూతలు పూర్తిగా మాడితే నష్టపోతామంటున్నారు. ఒక్కొ ఏడాది మంచు ప్రభావంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఎకరానికి సుమారు రూ.లక్ష వరకు ఆదాయం కోల్పోతామని చెబుతున్నారు. సాధారణంగా రాత్రి సమ యాల్లో చలి, పగలు వేడి ఉన్న వాతావరణంలో అధిక మొత్తంలో పూతపూసి దిగు బడిని ఇస్తుంది. అధికపూత ఉన్న సమయా ల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలి. ప్రధా నంగా ఈ సమయంలో మామిడిపై తేనె మంచు, తామర పురుగు ప్రభావం పూతపై పడుతుంది. పూత పువ్వులోని రసంను ఈ పురుగులు స్వీకరిస్తాయి. ఈ క్రమంలో పూత రాలిపోతుంది. ఈ సమయంలోనే చెట్ల ఆకు లు పాలిపోతాయి. దీనిని మట్టి తెగులు అం టారు. దీని తరువాత పూతపై కట్టుపురుగు దాడి చేస్తుంది. పూత అధికంగా ఉన్న రెమ్మ ల వద్ద ఈ పురుగు పూతతో గూడుకట్టుకుని అక్కడే ఆహారాన్ని సమకూర్చుకుంటుంది. దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం వస్తుంది. పూత బాగుందని సంతోషించినా నిర్లక్ష్యంగా ఉంటే దిగుబడి తగ్గిపోతుంది. ప్రస్తుతం వాతావరణంలో మామిడి, జీడిమామిడి పూతలు ఆశాజనకంగా ఉన్నాయని, పూతలు రాలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవా లని జీలుగుమిల్లి మండల ఉద్యాన అధికారి ప్రసన్నలక్ష్మీ సూచించారు. ‘పూత ఆశాజనకంగా ఉంది. ఫిబ్రవరి రెండవ వారంలో వచ్చే పూత నిలబడుతుంది. ప్రస్తుతం పొగ మంచు కారణంగా పెద్దగా నష్టం లేదు. ఎప్పటికప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నాం’ అని జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటి డైరెక్టర్‌ షాజా నాయక్‌ తెలిపారు.

మంచు, తెగుళ్లతో నష్టపోతున్నారు

ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌

పొగ మంచు, తెగుళ్లు వల్ల పూత, పిందె దశలో ఉన్న మామిడి పంటకు తీవ్ర నష్టం జరుగుతుంది. భారీగా దిగుబడులు తగ్గి మామిడి రైతుల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి. ఇప్పటికే తగిన గిట్టుబాటు ధర లేక జిల్లాలో వేలాది ఎకరాల్లో మామిడి తోటలను తొలగించారు. ప్రస్తుత దశలో రైతులకు సూచనలు, సలహాలు అందించి పంట దిగుబడిని రక్షించుకునేందుకు ఉద్యాన శాఖ చర్యలు చేపట్టాలి.

పెరిగిన సాగు ఖర్చులు

మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. చాలామంది రైతు లు తమ తోటలు తీసివేసి నీళ్ళు ఉంటే పామాయిల్‌ తోట నీళ్లు లేకపోతే జామాయిల్‌ వేస్తున్నారు. మామిడిపై తెగుళ్లు, పురుగుల దాడి నివారణకు ప్రతి రైతు పంటకాలంలో కనీసం పదిసార్లు పురు గు మందులు కొడుతున్నారు దీనివల్ల పంట విషాహారవయ్యి నిల్వ ఉండక మార్కెట్లో ధర రావడం లేదు దానికి తోడు సాగు ఖర్చులు పెరిగిపోయాయి. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మరలిపోతున్నారు.

– చిట్లూరి అంజిబాబు, మామిడి రైతు, చింతలపూడి

మంచుతో నష్టపోతున్నాం

ఏటా తేనె మంచుతో నష్టపోతున్నాం ప్రస్తుతం పూత బాగానే ఉంది. పిందె తయారయ్యే సమయానికి మంచు వల్ల నష్టపోతున్నాం. ఏడాది కాలంగా ఎదురు చూస్తే చివరకు పంట దిగుబడి లేక ఆదా యం తగ్గుతోంది. ప్రభుత్వం మరింత ప్రోత్సాహాకాలు ఇచ్చి రైతులకు భరోసానివ్వాలి.

బి.కొర్రాజులు, జీడిమామిడి రైతు, ఉదయ్‌భాస్కర్‌ కాలనీ, జీలుగుమిల్లి

Updated Date - Jan 20 , 2026 | 12:53 AM