వీడని పొగ మంచు
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:56 AM
గడిచిన రెండు రోజులు గా జిల్లాను కమ్మేస్తున్న పొగమంచు మూడో రోజు సోమవారం కొనసాగింది.
తణుకు/తణుకు రూరల్/వాసవి పెనుగొండ, జనవరి 19(ఆంధ్రజ్యోతి):గడిచిన రెండు రోజులు గా జిల్లాను కమ్మేస్తున్న పొగమంచు మూడో రోజు సోమవారం కొనసాగింది. రహదారులను కప్పే యడంతో సాధారణ ప్రజానీకంతోపాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెల్లవారుజామున మొదలైన మంచు 10 గంటల వరకు వీడడం లేదు. పదడుగుల దూరం కూడా కనిపిం చకపోవడంతో ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనతో వాహనదారులు అతి నెమ్మదిగా వెళుతున్నారు. ఉదయాన్నే పనులకు వెళ్లే కా ర్మికులు, కూలీలు చాలా అవస్థలు పడ్డారు. తణుకు – తాడేపల్లిగూడెం జాతీయ రహదారిపై మంచు కమ్మేయడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. సంక్రాతి తిరుగు ప్రయాణంలో తెలంగాణ, కర్ణాటక తదితర ప్రాంతాలకు ఉదయం బయలుదేరిన వాహనాలు తేతలి, దువ్వ గ్రామాల్లోని జాతీయ రహదారి పక్కనే కొంత సేపు నిలిపివేశారు.