నిరంతర పర్యవేక్షణతోనే గోవుల సంరక్షణ
ABN , Publish Date - Jun 26 , 2026 | 12:40 AM
దేవస్థానాలలో గోశాల నిర్వహణ అనేది గోసంరక్షణకు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుందని, నిరంతర పర్యవేక్ష ణతోనే గోవుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ (ఎస్‌ఐటీఏ) డైరెక్టర్, మాజీ దేవదాయశాఖ కమిషనర్ ఎన్.ముక్తేశ్వరరావు సూచించారు.
సిటా డైరెక్టర్ ముక్తేశ్వరరావు
ద్వారకాతిరుమల, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): దేవస్థానాలలో గోశాల నిర్వహణ అనేది గోసంరక్షణకు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుందని, నిరంతర పర్యవేక్ష ణతోనే గోవుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ (ఎస్‌ఐటీఏ) డైరెక్టర్, మాజీ దేవదాయశాఖ కమిషనర్ ఎన్.ముక్తేశ్వరరావు సూచించారు. ద్వారకాతిరుమలలో దేవదాయశాఖ, సిటా సంయుక్త ఆధ్వర్యంలో ఆదర్శ గోశాలల నిర్వహణపై, శాస్త్రీయపద్ధతులపై మూడురోజుల శిక్షణ తరగతు లను గురువారం అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దాదాపు 26 ప్రముఖ దేవస్థానాల నుంచి ఎంపికైన సిబ్బందికి పలు అంశాలపై శిక్షణ ఇస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణలో పాల్గొన్న వారికి ఆలయ గోశాల అభివృద్ధి, పశుసంరక్షణలో నాణ్యత పెంపు, సంప్రదాయ విలు వల పరిరక్షణకు తోడ్పాటు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సిటా డీడీ ఎంవీఎస్‌ఎస్ విష్ణుప్రసాద్, ఈవో వి.త్రినాథరావు, డాక్టర్ జి.విజయకుమార శర్మ, డాక్టర్ కె. శివసాగర్‌రెడ్డి, డాక్టర్ సీహెచ్ గౌతమ్‌వర్మ, పలు దేవాలయాల గోశాలలో పనిచేస్తున్న గోపాలకులు, క్లర్కులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.