Share News

‘సర్‌’కు సన్నద్ధం!

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:56 AM

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) కార్య క్రమానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. జూన్‌ 15 నుంచి సెప్టెంబరు 22 వరకు వివిధ దశల్లో ఈ కార్యక్రమం నిరంతరాయంగా సాగనుంది.

 ‘సర్‌’కు సన్నద్ధం!

జిల్లాకు చేరిన ఓటర్ల జాబితా మెటీరియల్‌

నేడు, రేపు పోలింగ్‌ బూత్‌ల్లో మ్యాపింగ్‌

15 నుంచి ఇంటింటా ఓటర్ల పరిశీలన..

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) కార్య క్రమానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. జూన్‌ 15 నుంచి సెప్టెంబరు 22 వరకు వివిధ దశల్లో ఈ కార్యక్రమం నిరంతరాయంగా సాగనుంది. జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాల వారికి, బూత్‌ లెవెల్‌ అధికారులకు ఓటర్ల జాబితా మెటీరియల్‌ ఎన్నికల సంఘం నుంచి ఏలూ రుకు చేరుకుంది. ఈ సందర్భంగా సంబంఽధిత బీఎల్‌వోలకు ఎన్యుమరేషన్‌ ఫారాలు కట్టలు కట్టుకుని నియోజకవర్గాల వారీగా వ్యానుల్లో శనివారం తరలించుకున్నారు. పలుచోట్ల బీఎల్‌వోలకు శనివారం సర్‌ కార్యక్రమం నిర్వహణలపై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ప్రత్యేక శిక్షణలను నిర్వహించారు.

మ్యాపింగ్‌ పూర్తికి 14 వరకు అవకాశం

జిల్లాలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణకు ముందుగా 2002, 2025 ఓటర్ల జాబితాలను మ్యాపింగ్‌ చేసే ప్రక్రియ అనుకున్నంతగా పూర్తి కాలేదు. జిల్లాలో 1,744 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 70 శాతం సగటున పూర్తయింది. దీంతో బీఎల్‌వోల దగ్గర షీట్‌ల ఆధారంగా 13,14వ తేదీల్లో మ్యాపింగ్‌ను పూర్తి చేసే దిశగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇంటింటా పరిశీలన

ఇదిలా ఉండగా ఇప్పటికే బీఎల్‌వోలకు అవసరమైన కిట్లను ఆయా నియోజక వర్గా ఎన్నికల రిటర్నింగ్‌ అధి కారులు పంపిణీ పూర్తి చేయగా...తాజాగా అం దుకున్న ఎన్యు మరేషన్‌ షీట్లు ఆధారంగా జాబి తాలను సరిచూసుకుని చనిపోయిన ఓటర్ల తొలగింపు, పోలింగ్‌ కేంద్రాల మార్పును తీసుకోవాల్సిన చర్యలపై ఓటర్ల ఇంటింటా పరిశీలనలో సూచనలు, సలహాలను అందివ్వనున్నారు.

‘సర్‌’ పైనే అన్ని పార్టీల దృష్టి..!

ముదినేపల్లి, జూన్‌ 13(ఆంధ్ర జ్యోతి): ఓటర్ల జాబి తా ప్రత్యేక సవరణ (సర్‌) కార్యక్రమం పైనే అన్ని రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ నెల 15 నుంచి ఎన్నికల సంఘం ప్రారంభించనున్న ఈ స్పెషల్‌ ఇంటె న్సివ్‌ రివిజన్‌ ‘సర్‌’పై అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు తమ దృష్టిని కేంద్రీకరించారు. గతంలో ఏనా డు లేని విధంగా ఓటర్ల జాబితాల సవర ణలకు అధికార యంత్రాంగం నిర్వహించ నున్న సర్వే జరిగే తీరు తెన్నులను పరిశీలిం చేందుకు గ్రామస్థాయి నాయకులు, బూత్‌ స్థాయి ఏజెంట్లు సిద్ధమయ్యారు. కైక లూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రధాన రాజకీ య పార్టీలు తమ పార్టీల నాయకులు, కార్యకర్తలు, బీఎల్‌ఏలకు మండల, నియోజకవర్గస్థాయిలో సర్‌పై సమావేశా లు నిర్వహించి అవగాహన కల్పించారు. ముదినేపల్లి, కలిదిండి, కైకలూరు, మండవల్లి మండ లాల్లోని 235 పోలింగ్‌ బూత్‌ల ఏరియాల్లో సర్‌ కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటీవల పలు రాష్ట్రాల అసెంబ్లీ లకు జరిగిన ఎన్నికల్లో ‘సర్‌’ పేరుతో లక్షలాది మంది ఓట్లు తొలగించారని ఓటమి పాలైన పార్టీలు ఆరోపించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రాజ కీయ పార్టీలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ‘సర్‌’లో అర్హులైన వారి ఓట్లు తొలగింపునకు గురికాకుండా, అనర్హుల ఓట్లు చేర్చకుండా, ఇతర సరవణల్లో పొరపాట్లు జరగకుండా చూసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ నాయకులు, బీఎల్‌ఏలు సమాయత్తమవుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో బీఎల్‌ఏ–1గా టీడీపీ తరపున నియోజకవర్గపార్టీ కన్వీనర్‌ వీరమల్లు నరసింహారావు, బీజేపీ తరపున ఆ పార్టీ జిల్లా కో కన్వీనర్‌ కోటప్రోలు కృష్ణారావు, వైసీపీ తరపున బి.దుర్గారావు, కాంగ్రెస్‌ తరపున బొడ్డు నోబుల్‌ను ఆయా పార్టీల అధిష్ఠానాలు నామినేట్‌ చేశాయి.

Updated Date - Jun 14 , 2026 | 12:56 AM