సర్‌కు సిద్ధం
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:15 AM
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఫొటో ఎల క్ర్టోల్ రోల్స్(సర్) చేపట్టేందుకు ఇప్పటికే 1,744 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు, ఏఆర్వో, ఏఈఆర్వోలకు ప్రత్యేక శిక్షణ పూర్తి చేశారు. ఈనెల ఐదో తేదీ నుంచి బీఎల్‌వోలు తమ దగ్గర యాప్‌లో నమోదైన ఓటర్ల వివరాలను ఇంటింటికి వెళ్లి సరిపోల్చుతారు.
నేడు ఇంటింటా ఓటర్ల జాబితాల పరిశీలన
కొత్త ఓటర్ల చేరికకు అవకాశం
తుది జాబితా సెప్టెంబరు 22న విడుదల
జిల్లాలో ఓటర్లు 16,44,153 మంది
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవ రణకు రంగం సిద్ధమైంది. పకడ్బం దీగా ఓటర్ల నమోదు, చనిపోయిన ఓటర్ల తొలగింపును చేపట్టేందుకు ఇటీవల ఎన్నికల కమిషన్ నాలుగు నెలలు ప్రణాళిక రూపొందించి అమలు చేసేలా కార్యాచరణ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చేపట్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఫొటో ఎల క్ర్టోల్ రోల్స్(సర్) చేపట్టేందుకు ఇప్పటికే 1,744 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు, ఏఆర్వో, ఏఈఆర్వోలకు ప్రత్యేక శిక్షణ పూర్తి చేశారు.
ఈనెల ఐదో తేదీ నుంచి బీఎల్‌వోలు తమ దగ్గర యాప్‌లో నమోదైన ఓటర్ల వివరాలను ఇంటింటికి వెళ్లి సరిపోల్చుతారు. తాజాగా 18 ఏళ్లు నిండిన వారిని కొత్త ఓటర్ల చేర్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టను న్నారు. జిల్లాలో మొత్తం 1,744 పోలింగ్ కేంద్రాలుం డగా, అధికారులు లెక్కల ప్రకారం జిల్లాలో 16 లక్షల 44 వేల 153 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 8,01,937 మంది, మహిళా ఓటర్లు 8,42,088 మంది, ట్రాన్స్‌జెండర్లు 128 మంది ఉన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు ఇంటింటా ఓటర్ల పరిశీలన పూర్తి చేస్తారు. వీటిని సరి చూశాక జూలై 14న జాబితా ప్రచురిస్తారు. జూలై 14 నుంచి పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ చేస్తారు. జూలై 21న పరిశీలన పూర్తి చేసిన జాబితాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల పరిశీలనార్థం ఉంచుతారు. ఆ రోజు నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. వీటిని సెప్టెంబరు 18 తేదీలోగా పరిష్కరించి, ఎన్నికల సంఘానికి నివేదించి, అక్కడ నుంచి నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితాలను సెప్టెంబరు 22న ప్రచురించనున్నారు.
‘సర్’ స్వచ్ఛంగా ఉండాలి : కలెక్టర్
ఏలూరు అర్బన్, జూన్ 4 (ఆంధ్ర జ్యోతి): ఓటరు జాబితాల స్వచ్ఛత, పారదర్శకత, ఖచ్ఛితత్వం నిర్ధారిం చేందుకు ఉద్దేశించిన ‘సర్’ నిర్వహణ లో క్షేత్రస్థాయిలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్– 2026) కార్యక్రమం నిర్వహణపై శిక్షణను గురువారం స్థానిక సీఆర్‌ఆర్ కళాశాల ఆడిటోరియంలో ఈఆర్వో లు, ఏఈఆర్వోలు, బీఎల్‌వో, సూపర్‌వైజర్లకు కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఓటర్ల వివరాల మ్యాపింగ్ ప్రక్రియలో అసాధారణతలు, డూప్లికేషన్లు, ఇతర సాంకేతిక లోపాలు గుర్తిస్తే వెంటనే సరిచేయాలన్నారు. ఇన్‌చార్జి డీఆర్వో దేవకీ దేవి, ఆయా నియోజక వర్గాల ఈఆర్వోలు ప్రసన్నలక్ష్మి, భాస్కర్, రమణ, సత్యవేణి, వినూత్న పాల్గొన్నారు.