Share News

కోడళ్లకు అత్తింట సర్‌ చిక్కులు

ABN , Publish Date - Jul 07 , 2026 | 01:28 AM

కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) కార్య క్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.

కోడళ్లకు అత్తింట సర్‌ చిక్కులు

అవి ఉంటేనే ఓటు హక్కు అంటున్న బీఎల్‌వోలు

చాలామంది ఓటు కోల్పోయే పరిస్థితి

ఏలూరు రూరల్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) కార్య క్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. బోగస్‌, డబుల్‌ ఎంట్రీలను తొలగించేందుకు చేపట్టిన ఈ ప్రక్రియ మంచిదే అయినప్పటికీ 2002 నాటి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయా ల్సి రావడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. ముఖ్యంగా తెలుగింటికి 24 ఏళ్ల క్రితం వచ్చిన ఇతర రాష్ట్రాల మహిళలకు కష్టాలు రెట్టింపయ్యాయి. క్షేత్రస్థాయిలో సర్‌ కష్టాలు ఇటు ఓటర్లకు, అటు బీఎల్వోలకు అధి కంగానే ఉన్నాయి. 2002 నాటి ఓటరు జాబితా లో పేరు లేకపోతే వారి తల్లిదండ్రుల ఓటరు పత్రం చూపాలి. ఇక్కడే వారికి అసలు సమస్య మొదలవుతోంది. జిల్లాలో చాలా మంది కోడళ్లు కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. 2002 నాటి ఓటరు జాబితాలో వారి తల్లిదండ్రుల పేరు లేదా వంశవృక్షాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. తక్షణం వంశవృక్షాన్ని నిరూపించుకు నేందుకు కావాల్సిన పత్రాలు దొరక్కపోవడంతో అవస్థలు పడుతున్నారు. కొంతమంది ఇన్ని ఇబ్బందులు పడి ఓటు చేర్చుకోక వదిలేస్తు న్నారు. మన రాష్ట్రంలో మాదిరిగా గ్రామ, వార్డు సచి వాలయాలు లేకపోవడంతో కార్యాల యాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇప్పటికిప్పుడే పత్రాలు కావాలం టే దొరికే పరిస్థితి లేదు.

సవాలుగా ఎన్యూమరేషన్‌ పత్రాలు జారీ

బీఎల్వోలు ఎన్యూమరేషన్‌ పత్రాలు పంపిణీ చేయాలి. ఇం టింటికి వెళ్లి ఓటర్లను మ్యాపింగ్‌ చేయాలి. ఎన్యూమరేషన్‌ ఫారా లను భర్తీ చేసి బీఎల్వోలకు ఇవ్వా లి. వారు వాటిని డిజిటలైజేషన్‌ చేయాలి. ఈ ఫారాలను నింపేందుకు చాలామంది ఓటర్లకు అవగాహన లేక, మరి కొంతమంది నిర్లక్షరాస్యులు కావడంతో ఇబ్బందులు పడుతు న్నారు. 2002 నాటి ఓటరు జాబితాలోని వివరా లను తప్పనిసరిగా నమోదు చేయాల్సి రావడం తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. 24 ఏళ్ల క్రితం ఏ నియోజకవర్గం, ఏ గ్రామం, ఓటరు జాబితాలో ఓటరు క్రమసంఖ్య, ఓటరు గుర్తింపు కార్డు నంబరు, సీరియల్‌ నెంబరు, పోలింగ్‌ స్టేషన్‌ నెంబరు వంటి వివరాలు ఎన్యూమరేషన్‌ ఫారంలో నమోదు చేయాల్సి ఉంది. ఆ వివరాలు తెలియక ప్రజలు తికమక పడుతున్నారు. బీఎల్వోల వద్ద పాత ఓటరు జాబితా పీడీఎఫ్‌ రూపంలో మొబైల్‌లో ఉంది. అవి చూసి చెప్పడానికి ఇంటింటికి వెళ్లి ఫారం భర్తీ చేయడానికి అవస్థలు పడుతున్నారు.

నిరక్షరాస్యుల సంగతేంటి?

చదువుకున్నవారు గతంలో ఓటు హక్కు వివరాలు తెలిసిన వారైతే పర్వాలేదు. కాని నిరక్షరాస్యులు గతంలోనూ వివరాలపై పూర్తిగా సమాచారం లేనివారి విషయం ఏంటనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అంతా బీఎల్‌ వోలు చూసుకుంటారని అధికారులు చెబుతు న్నారు. అది ఎలా అన్నదానిపై స్పష్టత లేదు. ఈ విషయంలో ప్రస్తుతం ఉంటున్న ఊరు, వివరాలకు మాత్రమే పరిమితమైతే బాగుంటుం దని ప్రభుత్వానికి ఓటర్లు సూచిస్తున్నారు.

సర్‌ : 72.31 శాతం పూర్తి

ఏలూరు,జూలై6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రత్యేక ఓటర్ల జాబి తా సవరణ(సర్‌) కార్యక్రమంలో 11 లక్షల 88 వేల 857 మంది ఓటర్ల గణన ఫారాలను బీఎల్‌వోలు డిజి టలైజేషన్‌ ప్రక్రియను సోమవారం నాటికి పూర్తి చేశారు. ఈ కార్యక్రమం గతనెల 14న ప్రారంభించగా 72.31శాతం పురోగతిని జిల్లా సాధించింది. జిల్లాలో 1,744 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 16 లక్షల 44 వేల 193 మంది ఓట ర్లుండగా, అందరికి ఓటర్ల గణన ఫారాలను బీఎల్‌వోలు పంపిణీ చేసిన విషయం తెల్సిందే. ఎన్నికల సంఘం విధించిన గడువు మరోవారంలో అంటే ఈనెల 14వ తేదీతో ముగియ నుండటంతో సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది. నిర్దేశించిన కాలంలో నూరుశాతం పూర్తి చేయాల్సిందేనంటూ కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆదేశాల ను జారీ చేశారు. మరోవైపు సర్‌ కార్యక్రమం వేగం పుంజుకునేం దుకు నియోజకవర్గాల్లోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు (ఈఆర్వోలు) కూడా ఆయా మండలాల్లో పరిశీలనలతో మరింత వేగం పెరిగింది.

Updated Date - Jul 07 , 2026 | 01:28 AM