Share News

ముగిసిన సర్‌

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:29 AM

జిల్లాలో సమగ్ర ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్‌) కార్యక్రమం అధికారికంగా శుక్రవారంతో ముగి సింది.

ముగిసిన సర్‌
పెదపాడులో సర్‌ కార్యక్రమంపై ఆరా తీస్తున్న కలెక్టర్‌ వెట్రిసెల్వి

ఓటర్ల డిజిటలైజేషన్‌ పూర్తి

అన్‌కలెక్టబుల్‌ ఓటర్ల సంఖ్య – 95,228

ఆగస్టు 3న తుది జాబితాల ప్రదర్శన

ఆపై నెలరోజులు అభ్యంతరాల స్వీకరణ

ఏలూరు, జూలై 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సమగ్ర ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్‌) కార్యక్రమం అధికారికంగా శుక్రవారంతో ముగి సింది. జూన్‌ 15న 1,744 పోలింగ్‌ కేంద్రాల పరిఽధిలో ఓటర్ల జాబితా సవరణ ప్రారంభం కాగా, తొలి గడువు ఈనెల 14నే ముగిసినా స్థానికంగా సమస్యలు, ఓటర్ల డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఆ గడువును ఈనెల 24 వరకు ఎన్నికల సంఘం పొడి గించింది. ఈ ప్రక్రియ జిల్లాలో ప్రశాం తంగా ముగియడతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల సర్‌కు గడువు పెంపుతో బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి అన్‌ట్రేస్‌ బుల్‌, ఆబ్సెంట్‌ విభాగంలో చూపిన వారి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు జాబితాల్లో ఉన్న కొందరు ఓటర్ల వివరాలను 2002 జాబితాలో తెలుసుకోవడం సాధ్యం కాక మ్యాపింగ్‌ చేయకుండానే ఎన్యూమరేషన్‌ పత్రాలు సమర్పించారు. ఇలాంటి వాటిని నో మ్యాపింగ్‌లో పెట్టారు. వీరిలో మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు, డబుల్‌ ఎంట్రీ ఉన్న వారు, ఆబ్సెంట్‌ అయినవారు, ఇతరత్రా కారణా లతో అందుబాటులో లేని వారిగా వీరిని పరిగణించా రు. జిల్లా వ్యాప్తంగా ఈ విభాగాల్లో మొత్తం 95,528 మంది ఉన్నట్టు అధికారుల గణాంకాలు వెల్లడిస్తు న్నా యి. జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ నాటికి మొత్తం 16,44,193 మంది ఓటర్లుండగా, వారికి ఓటర్ల గణన ఫారాలను అందించి, ఓటర్ల ఫొటోలతో సంతకాలు తీసుకుని ఆయా ఫారాలను బీఎల్‌వోలు జిల్లా వ్యాప్తం గా డిజిటలైజేషన్‌ చేయగా, తాజాగా 15,42,447 మంది అప్‌డేట్‌ చేయడంతో తాజాగా ఓటర్లుగా వీరి సంఖ్య తేలింది. ఓవరాల్‌గా 93.81 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా చనిపోయిన ఓటర్లు 55,122, శాశ్వ తంగా వలసవెళ్లిన వారు 23,114 మంది, డబుల్‌ ఎంట్రీగా నమోదైన ఓటర్లు 17,920 మంది ఉండగా, బీఎల్‌వోలు మూడుసార్లుకు పైగా ఓటర్ల దగ్గరకు వెళ్లిన అందుబాటులో లేని వారి సంఖ్య 4,462 మంది కలిపి మొత్తం 95,528 మంది ఓటర్లను అన్‌ కలెక్టబు ల్‌గా బీఎల్‌ వోలు తేల్చారు.

నోటిసులు జారీ... తొలగింపులకు సిఫార్సులు

రాబోయే రోజుల్లో చనిపోయిన ఓటర్ల తాలూకా కుటుంబ సభ్యులతో సంతకాలు తీసుకుని డెత్‌ ఓటర్ల జాబితాను ఖరారు చేస్తారు. బూత్‌లవారీగా నోటీసులు జారీ చేస్తారు. పూర్తిగా వలస వెళ్లిన ఓటర్లు, అందు బాటులో లేని ఓటర్లకు నోటీసులు ఇచ్చి చుట్టుపక్కలా ప్రజలు, బీఎల్‌ఏలు వారి సమక్షంలో వలస వెళ్లినట్లు నిర్ధారించుకుని, ఓటర్ల జాబితాల నుంచి తొలగించ డానికి సిఫార్సు చేస్తారు. డబుల్‌ ఎంట్రీ ఓటర్ల వివరాలను సరి చూసుకోమని వ్యక్తిగతంగా వారిని కలిసి వివరించి, వారి కోరిక మేరకు ఎక్కడ ఓటు ఉంచాలో అక్కడ జాబితాలో ఉంచేలా సిఫార్సు చేస్తా రు. చనిపోయిన ఓటర్లు, వలస వెళ్లిన ఓటర్లు, డబుల్‌ ఎంట్రీ, అందుబాటులో లేని ఓటర్లందరికీ నోటీసులు బీఎల్‌వోలు జారీ చేస్తారు. ఇప్పటి వరకు ఉన్న జాబితాలను ఎన్నికల సంఘం ముద్రణకు ఇచ్చి, జాబితాలను తయారు చేసి జిల్లాకు త్వరలో పంపుతుంది. వాటిని ఆగస్టు 3న ముసాయిదా జాబితాలను 1,744 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ప్రజల పరిశీలనకు కోసం ప్రదర్శిస్తారు. ఆ తర్వాత ఓటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరణతో పాటు సమాంతరంగా కొత్త ఓటర్ల చేరికకు అర్హత కలిగిన వారిని దరఖాస్తుల స్వీకరణ చేస్తారు. 18 ఏళ్లు నిండిన ఓటర్ల చేర్పులకు అవకాశం కల్పించారు.

డిజిటలైజేషన్‌ ఫారాలు ఏఈఆర్వోలకు..

ఇప్పటి వరకు చేపట్టిన ఓటర్ల డిజిటలైజేషన్‌ చేసిన ఎన్యూమరేషన్‌ పత్రాలను 100 చొప్పున కట్టలు కట్టి, వాటిని సంబంధిత ఏఈఆరోవోలు (అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లు)కు బీఎల్‌వోలు లెక్కలు చూసి సమర్పిస్తారు.

పెదపాడులో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

పెదపాడు, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఇంటెన్సివ్‌ రివిజన్‌ గడువు ముగుస్తున్నందున అనామలీస్‌ వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి బీఎల్‌వోలను ఆదేశించారు. పెదపాడులోని స్వర్ణ గ్రామ సచివాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులు, హాజరు పట్టికను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన సేవల ను వేగవంతంగా అందించాలన్నారు. ప్రత్యేక ఇంటె న్సివ్‌ రివిజన్‌ (సర్‌)పై బీఎల్‌వోలతో సమీక్షించారు. పారిశుధ్య కార్మికులతో మాట్లాడుతూ వర్షాకాలంలో డ్రైయిన్లలో మురుగునీరు నిల్వ ఉండకుండా సిల్ట్‌ తొలగించాల న్నారు. ఇంటింటికీ తడి, పొడి చెత్తలను సేకరించాలని సూచించారు. తహసీల్దార్‌ కృష్ణజ్యోతి, ఎంపీడీవో అమీలు జమ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2026 | 12:29 AM