Share News

సర్‌.. రండి

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:56 AM

ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రతీ ఓటరును బీఎల్‌వోలు వారి ఇంటి వద్ద మూడుసార్లు కలుసుకోవాలి. ఒక్కసారి కూడా తమ ఇంటికి కాదు కదా.. తమ చుట్టపక్కల ఇళ్లకు కూడా బీఎల్వోలు ఎవరూ రాలేదని పలువురు చెబుతున్నారు.

సర్‌.. రండి

అరకొరగా ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ

ఓటర్‌ ఫోన్‌ చేసినా స్పందన లేదు

తమ వద్దకే వచ్చి ఫారాలు ఇవ్వాలంటున్నారు

క్షేత్రస్థాయికి భిన్నంగా అధికారుల ప్రకటనలు

ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రతీ ఓటరును బీఎల్‌వోలు వారి ఇంటి వద్ద మూడుసార్లు కలుసుకోవాలి. ఒక్కసారి కూడా తమ ఇంటికి కాదు కదా.. తమ చుట్టపక్కల ఇళ్లకు కూడా బీఎల్వోలు ఎవరూ రాలేదని పలువురు చెబుతున్నారు. కొంత మందికి ఫోన్‌ చేసి ఫలానా చోటికి రావాలని చెప్పడంతో బీఎల్వోలు సరి పెడుతున్నారు.

ఓటరు : ఫోన్లో హలో బీఎల్‌వో గారండీ..

బీఎల్‌వో : అవునండీ

ఓటరు : మాకు ఇంకా ఎన్యూమరేషన్‌ ఫారం రాలేదండి.

బీఎల్‌వో : మీ పేరు అడ్రస్‌ చెప్పండి

ఓటరు : పేరు, చిరునామా..

బీఎల్‌వో : మీరు ఎక్కడెక్కడో ఉంటే ఎవరు ఇస్తారు, మేము వచ్చినప్పుడు మీరు ఇంట్లో లేరు.

ఓటరు : మేము ఇంట్లోనే ఉంటాం. ఎవరూ రాలేదు, ఎందుకు అలా చెబున్నారు.

బీఎల్‌వో : సరే, నేను ఫలానా ప్రాంతంలో ఉన్నాను, వచ్చి తీసుకోండి.

ఓటరు : ఇంటికి వచ్చి ఇవ్వాలి కదా?

బీఎల్‌వో : కుదరదండి మీరే రావాలి, వచ్చేటప్పుడు ఫొటో, ఐడీ ప్రూఫ్‌ తీసుకురండి, ఫారం నింపి ఇవ్వండి.

ఏలూరు రూరల్‌, జూలై 8(ఆంధ్రజ్యోతి):జిల్లాలోని పలువురు బీఎల్వోల తీరు ఇదీ.. బీఎల్వోలు ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇస్తారు. వారే ఫారం భర్తీ చేయిస్తారు. అని ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఎక్కడా ఈ పరిస్ధితి లేదు. 90 శాతానికి పైగా ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ జరిగిం దని అధికారుల ప్రకటనతో ఓటర్లలో ఆందోళన నెలకొంది. తమ ఇంటికి ఎవరూ రాలేదని, ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇవ్వలేదని, పలువురు వాపోతున్నా పట్టించుకునే వారే లేరు. సాంకేతిక పరి జ్ఞానంపై అవగాహన ఉన్నవారు ఈసీఐ వెబ్‌సైట్‌లో ఎన్యూమ రేషన్‌ కాల్‌ బుక్‌ చేసినా బీఎల్వోలు ఫోన్‌ చేసి ఫలానా దగ్గర ఉంటాం రండి అని చెప్పడానికే పరిమితమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ పర్వాలేదు. పట్టణాలు, నగరంలో దారుణం. అధికారులకు ఇచ్చే నివేదికల్లో మాత్రం 90 శాతానికిపైగా పంపిణీ పూర్తి చేశామని బీఎల్వోలు చెబుతున్నారు. తమ ఓటు ఉంటుందో, పోతుందోని ఓటర్లు ఆందోళన చెందుతు న్నారు. ప్రైవేటు ఉద్యోగులు, రోజువారి పనులపై ఆధారపడేవారు, వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు బీఎల్‌వోలు చెప్పిన దగ్గరకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. ఎన్యూమరేషన్‌ పంపిణీ ప్రారంభ మైనప్పుడు రాజకీయ పార్టీల నుంచి బూత్‌ స్థాయి ఏజెంట్లు వారి వెంట రాగా పంపిణీ కొంత వరకు జరిగింది. ఆ తరువాత ఏజెం ట్లు రాకపోతుండడంతో బీఎల్‌వోలు ఓటర్లు ఇళ్లకు వెళ్లడం మానే శారు. తాము సచివాలయం/పోలింగ్‌ బూత్‌/ ఫలానా ప్రాంతంలో ఉన్నామని చెప్పి అక్కడికి వచ్చి ఫారాలు తీసుకోమంటున్నారు. ఓటు అనేది ప్రతీ ఒక్కరికి ఎమోషన్తో కూడుకొన్నది. దీంతో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌)లో తమ ఓటు ఎక్కడ తీసేస్తారోనన్న భయంతో విద్యార్ధులు కూడా బీఎల్వోలు చెప్పిన ప్రదేశాలకు వెళ్లి ఎన్యూమరేషన్‌ ఫారంలు ఇచ్చి వెనుతిరగాల్సి వస్తుంది. అలా వెళ్ళలేనివారు మాత్రం ఆందోళన చెందుతున్నారు.

అధికారుల పర్యటన సమయంలో హడావుడి..

బీఎల్వోల పనితీరు పరిశీలించేందుకు కొన్ని రోజులుగా సూపర్‌ వైజర్‌ స్ధాయి నుంచి చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి వరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. అధికారులు ఏ ప్రదేశానికి వస్తున్నారో ముందే సమాచారం తెలుసుకుంటున్న బీఎల్వోలు ఆ సమయంలో ఫీల్డ్‌లో కనిపిస్తూ హడావుడి చేస్తున్నారు.

Updated Date - Jul 09 , 2026 | 12:57 AM